విజయ్ దేవరకొండ (Vijay Devarakonda) ఓ మంచి పని మొదలు పెట్టారు. 'ఖుషి' ద్వారా తనకు వచ్చిన డబ్బుల్లో ఓ కోటి రూపాయలను ప్రేక్షకులకు ఇవ్వాలని అనుకుంటున్నట్లు తెలిపారు. ఆయన నిర్ణయంపై ఇటు చిత్రసీమ, అటు ప్రజల నుంచి హర్షం వ్యక్తం అవుతోంది. అయితే... విజయ్ దేవరకొండ అలా డబ్బులు ఇవ్వడం మీద అభిషేక్ పిక్చర్స్ చేసిన ట్వీట్ వైరల్ అవుతోంది. అసలు, అభిషేక్ పిక్చర్స్ చేసిన ట్వీట్ ఏమిటి? అసలు, ఏమైంది? అనే వివరాల్లోకి వెళితే...


మాకు రూ. 8 కోట్ల లాస్ వచ్చింది, ఆదుకోండి!
Vijay Devarakonda vs Abhishek Pictures : విజయ్ దేవరకొండ 'వరల్డ్ ఫేమస్ లవర్'ను విశాఖ, కృష్ణ, గుంటూరు, నెల్లూరుతో పాటు ఉభయ గోదావరి జిల్లాల్లో అభిషేక్ పిక్చర్స్ సంస్థ డిస్ట్రిబ్యూట్ చేసింది. ఆ సినిమా వల్ల తమకు ఎనిమిది కోట్ల రూపాయల లాస్ వచ్చిందని ఇప్పుడు బయట పెట్టింది. తన 'ఖుషి' సంపాదనలో కోటి రూపాయలను ప్రేక్షకులకు ఇస్తున్న విజయ్ దేవరకొండ... తమను కూడా ఆదుకోవాలని అభిషేక్ పిక్చర్స్ సంస్థ కోరింది. 


నిర్మాతను అడగాలి కదా?
హీరోను అడగటం ఏమిటి?
హీరో ఇమేజ్ మీద బిజినెస్ జరుగుతుంది. అయితే, ఆ బిజినెస్ చేసేది అంతా చిత్ర నిర్మాత! ఇప్పుడు 'వరల్డ్ ఫేమస్ లవర్' (World Famous Lover) డిస్ట్రిబ్యూషన్ రైట్స్ నిర్మాత కెఎస్ రామారావు నుంచి అభిషేక్ పిక్చర్స్ కొనుగోలు చేసింది తప్ప హీరో విజయ్ దేవరకొండ నుంచి కాదు! 'ఇప్పుడు అడగాల్సింది కూడా నిర్మాతను గానీ హీరోను కాదు కదా' అని కొందరు సోషల్ మీడియాలో కామెంట్ చేస్తున్నారు. 






'అర్జున్ రెడ్డి' లాభాల్లో హీరోకి షేర్ ఇచ్చారా?
విజయ్ దేవరకొండ సూపర్ డూపర్ హిట్ సినిమా 'అర్జున్ రెడ్డి'ని పశ్చిమ గోదావరి జిల్లాలో అభిషేక్ పిక్చర్స్ డిస్ట్రిబ్యూట్ చేసింది. సుమారు నాలుగు కోట్లకు సినిమా అమ్మితే... 40 కోట్ల రూపాయల వరకు కలెక్షన్స్ వచ్చాయి. అప్పట్లో ఆ సినిమా ద్వారా అభిషేక్ పిక్చర్స్ లాభపడింది. అప్పుడు హీరోకి షేర్ ఇచ్చారా? అని కొందరు క్వశ్చన్ చేస్తున్నారు.






విజయ్ దేవరకొండకు డబ్బులు ఇవ్వలేదట!
'వరల్డ్ ఫేమస్ లవర్', 'లైగర్'... రెండూ భారీ అంచనాల మధ్య విడుదలయ్యాయి. ఆ రెండు సినిమాలకు భారీగా బిజినెస్ జరిగింది. అయితే... ఆ రెండిటికీ విజయ్ దేవరకొండ పూర్తి స్థాయిలో, ముందు జరిగిన ఒప్పందం ప్రకారం రెమ్యూనరేషన్ అందుకోలేదని ఇండస్ట్రీలో జనాలకు తెలిసిన విషయమే. సగానికి పైగా డబ్బులు నిర్మాతలు ఇవ్వలేదట. ఈ విషయం తెలిసి విజయ్ దేవరకొండను టార్గెట్ చేయడం ఎంత వరకు కరెక్ట్? అని అభిషేక్ పిక్చర్స్ చేసిన ట్వీట్ మీద ఇండస్ట్రీ జనాల్లో కొందరు డిస్కషన్ చేసుకుంటున్నారు. విజయ్ దేవరకొండ మీద బురద జల్లే ప్రయత్నం జరుగుతోందని ఆయన ఫ్యాన్స్ ఫీలవుతున్నారు. 






Also Read : పెళ్ళికి అనుష్క రెడీ! కానీ, ఓ కండిషన్ - అదేమిటో తెలుసా?


మహేష్ బాబును, రవితేజను ఇలాగే అడుగుతారా?
సూపర్ స్టార్ మహేష్ బాబు 'బ్రహ్మోత్సవం' సినిమాను నైజాంలో అభిషేక్ పిక్చర్స్ సంస్థ డిస్ట్రిబ్యూట్ చేసింది. అంతకు ముందు 'శ్రీమంతుడు'తో లాభాలు వచ్చాయి. అయితే... 'బ్రహ్మోత్సవం'తో లాస్ వచ్చింది. రవితేజ హీరోగా అభిషేక్ పిక్చర్స్ సంస్థ నిర్మించిన 'రావణాసుర' సైతం థియేటర్లలో ఆడలేదు. ఇప్పుడు మహేష్ బాబును, రవితేజను కూడా ఇలాగే అడుగుతారా? అని కొందరు ట్వీట్స్ చేయడం గమనార్హం. 


Also Read రజనీకాంత్ సినిమాలో రానా దగ్గుబాటి - రీ ఎంట్రీ అదేనా!?



ముఖ్యమైన, మరిన్ని ఆసక్తికర కథనాల కోసం ‘టెలిగ్రామ్’లో ‘ఏబీపీ దేశం’లో జాయిన్ అవ్వండి.
Join Us on Telegram: https://t.me/abpdesamofficial