విజయ్ దేవరకొండ (Vijay Devarakonda) కు అభిమానులు ఎంతో మంది ఉన్నారు. అందులో మహిళా అభిమానుల సంఖ్య ఎక్కువే. అతడు ఎక్కడికి వెళ్ళినా... స్టేజి ముందు ఉన్న అభిమానుల్లో అమ్మాయిలూ ఉంటారు. వాళ్ళ నుంచి ప్రపోజల్స్ కూడా వస్తాయి. 'లైగర్' (Liger Movie) ప్రచారం నిమిత్తం బెంగళూరు వెళ్లిన విజయ్ దేవరకొండకు అటువంటి ప్రపోజల్ వచ్చింది.
 
విజయ్ దేవరకొండ రింగ్ వెనుక కథ!
విజయ్ దేవరకొండకు తేజు అనే అభిమాని ఉన్నారు. బెంగళూరు వెళ్ళిన అతడికి ఆమె ప్రపోజ్ చేశారు. రింగ్ తొడిగారు. అంతే కాదు... అతడిని పట్టుకుని ఏడ్చేశారు. ఎమోషనల్ అయిన ఆమెను రౌడీ బాయ్ ఓదార్చారు.
 
విజయ్ దేవరకొండకు దిష్టి తగలకుండా రింగ్ తొడిగానని తేజు తెలిపారు. 'లైగర్' ప్రమోషన్స్ కంప్లీట్ అయ్యే వరకూ ఆ రింగ్ ధరిస్తానని ఆమెకు రౌడీ బాయ్ మాట ఇచ్చారట. ఈ విషయాన్ని తేజు సోషల్ మీడియాలో తెలిపారు. బెంగళూరు ప్రెస్ మీట్ పూర్తి చేసుకుని వెళ్లే ముందు 'బై తేజూ' అని విజయ్ దేవరకొండ చెప్పడంతో ఆమె ఆనందానికి అవధులు లేవు. గాల్లో తేలుతున్నారు. 






ఎవరీ రౌడీ గాళ్ తేజు?
విజయ్ దేవరకొండకు ప్రపోజ్ చేసిన తేజు స్వతహాగా మోడల్. ఆర్మీ కుటుంబంలో జన్మించారు. వృత్తిరీత్యా తల్లిదండ్రులు వివిధ ప్రాంతాలు తిరిగారు. ఇప్పుడు తిరుపతిలో సెటిల్ అయినట్లు సమాచారం. తిరుపతి టు బెంగళూరు తేజు తిరుగుతున్నారు. ఆమెకు విజయ్ దేవరకొండపై ఎంత అభిమానం ఉందంటే... సోషల్ మీడియాలో 'రౌడీ గాళ్ దేవరకొండ' పేరుతో ఒక పేజీ రన్ చేస్తున్నారు. అందులో అభిమాన కథానాయకుడికి సంబంధించిన విషయాలు పోస్ట్ చేస్తున్నారు. 






బెంగళూరు టు బొంబాయి
బెంగళూరులో మాత్రమే కాదు... అటు బొంబాయిలోనూ, వడోదరలోనూ 'లైగర్' ప్రమోషన్స్ కోసం వెళ్లిన విజయ్ దేవరకొండకు అపూర్వ ఆదరణ లభించింది. ఆయనపై అభిమానాన్ని ప్రేక్షకులు పలు విధాలుగా చూపిస్తున్నారు. బాక్సాఫీస్ బరిలో కూడా ఆ అభిమానం కనబడుతోంది.


జోరుగా అడ్వాన్స్ బుకింగ్స్ 
'లైగర్' సినిమాతో విజయ్ దేవరకొండ హిందీ సినిమా ఇండస్ట్రీకి ఇంట్రడ్యూస్ అవుతున్న సంగతి తెలిసిందే. ఈ సినిమాకు ఆయనకు ఫస్ట్ పాన్ ఇండియా ఫిల్మ్. 'అర్జున్ రెడ్డి' సహా ఆయన నటించిన కొన్ని సినిమాలను హిందీ ఆడియన్స్ చూశారు. డబ్బింగ్స్ రూపంలో! ఇప్పుడు ఈ 'లైగర్' కోసం వెయిట్ చేస్తున్నారు. ఆగస్టు 25న విడుదల కానున్న ఈ సినిమాకు అడ్వాన్స్ బుకింగ్స్ జోరుగా ఉన్నాయి. ఆల్మోస్ట్ అన్ని మేజర్ సిటీలలో హౌస్ ఫుల్స్ అవుతున్నాయి. అమెరికాలో ఎక్స్ట్రా షోలు యాడ్ చేస్తున్నారు. 



Also Read : 'లైగర్' ప్రీ రిలీజ్ బిజినెస్ ఎంతో తెలుసా? ఏ ఏరియా రైట్స్ ఎన్ని కోట్లకు అమ్మారో చూడండి



విజయ్ దేవరకొండ సరసన అనన్యా పాండే (Ananya Panday) కథానాయికగా నటించిన ఈ సినిమాలో బాక్సింగ్ లెజెండ్ మైక్ టైసన్ (Mike Tyson), ప్రముఖ నటి రమ్యకృష్ణ నటించారు. ప్రముఖ బాలీవుడ్ దర్శక - నిర్మాత కరణ్ జోహార్‌కు చెందిన ప్రొడక్షన్ కంపెనీ ధర్మ ప్రొడక్షన్స్, పూరి కనెక్ట్స్ నిర్మించారు. ఈ సినిమాకు పూరి జగన్నాథ్, ఛార్మీ కౌర్, కరణ్ జోహర్, అపూర్వ మెహతా నిర్మాతలు. 


Also Read : విజయ్ దేవరకొండ ఫ్యాన్స్ రచ్చ షురూ - బాలీవుడ్ బాయ్‌కాట్ గ్యాంగ్‌కు దిమ్మ‌తిరిగే రియాక్షన్