Esari Pandaga Manade Promo 2: పండుగ వస్తుందంటే వారం రోజుల ముందే బుల్లితెరపై ఆ సందడి కనిపిస్తుంది. తెలుగు పండుగలు వచ్చాయంటే చాలు పలు టీవీ చానల్స్‌ స్పెషల్‌ ప్రోగ్రామ్స్‌తో ప్రేక్షకులకు వినోదం అందించేందుకు రెడీ అవుతుంటాయి. మరో ఐదు రోజుల్లో తెలుగు పండుగ ఉగాది రాబోతుంది. ఈ సందర్భంగా ఈటీవీ విన్‌ 'ఈసారి పండుగ మనదే' అంటూ ఆడియన్స్‌కి వినోదం పంచబోతుంది. తాజాగా ఈ ఈవెంట్‌కు సంబంధించిన ప్రోమోను విడుదల చేసింది ఈటీవీ టీం.


సుధీర్ రీఎంట్రీ


ఈ కార్యక్రమానికి సుడిగాలి సుధీర్‌ హోస్ట్‌గా వ్యవహరిస్తుండగా.. నటుడు, బిగ్‌బాస్‌ ఫేం శివాజీ, బలగం డైరెక్టర్‌ వేణు తమ టీంతో కలిసి ఈ షో సందడి చేశారు. ఇక ఫ్యామిలీ స్టార్‌ మూవీ ప్రమోషన్స్‌ కోసం విజయ్‌ దేవరకొండ ఈ పండుగ సెలబ్రేషన్స్‌లో భాగమయ్యారు. ఈ షోతో సుధీర్‌ ఈటీవీలోకి రీఎంట్రీ ఇవ్వడంతో ఫ్యాన్స్‌ అంతా ఖుష్‌ అవుతున్నారు. ఈ ఈవెంట్‌కు సుధీర్‌ యాంకర్‌గా వ్యవహరించాడు. ఇక హైపర్‌ ఆది, ఆటో రాం ప్రసాద్‌తో పాటు పలువురు జబర్దస్త్‌ కమెడియన్స్‌ కామెడీతో ఆకట్టుకున్నారు. ఇక ఢీ షో కంటెస్టెంట్స్‌ తమదైన డ్యాన్స్‌తో ఈవెంట్‌లో అలరించారు. శివాజీ #90's వెబ్‌సిరీస్‌ టీంతో, వేణు.. తన బలగం మూవీ టీంతో కలిసి ఈ ఈవెంట్‌లో పాల్గొన్నారు. రెండు టీం మధ్య పోటీ పెట్టి డ్యాన్స్‌, స్కిట్స్‌తో అవుట్‌ అండ్‌ అవుట్‌ ఎంటర్‌టైన్‌మెంట్‌ అందించారు. మధ్యలో సుధీర్‌, హైపర్‌ ఆదిల మధ్య జరిగిన సంభాషణ ఫుల్‌ ఆకట్టుకుంటుంది. నువ్వు అమ్మాయిలను గెలికినందుకు కాదు బాధ ఆ గోకేటప్పుడు నన్ను పిలవలేదని చెబుతున్నా అంటూ తనదైన స్టైల్లో పంచ్‌ వేశాడు.


వాట్సప్ బాయ్స్..


ఆ తర్వాత హీరో విజయ్‌ దేవరకొండ ఎంట్రీ ఇచ్చాడు. వాట్సాప్‌ బాయ్స్‌ అంటూ ఎంట్రీతోనే అక్కడునన వారందరిలో జోష్‌ నింపాడు. ఆ తర్వాత సుధీర్‌.. విజయ్‌తో స్మాల్‌ డౌట్‌ సర్ అంటూ పెళ్లి కాని యూత్‌కి ఏమైన చిన్న టిప్‌ ఇస్తే నాలాంటి వాళ్లకు యూజ్‌ అవుతుందని అడుగుతాడు. దానికి విజయ్‌ స్పందిస్తూ.. "నా లవ్‌స్టోరి కంటే రోజు నీ లవ్‌స్టోరీ రోజు వార్తల్లో వస్తుంది కదా.. నాకంటే సీనియర్‌ నువ్వు" అని బదులిస్తాడు. ఆ తర్వాత మృణాల్ ఠాకూర్ ఎంట్రీ ఇస్తుంది. ఆ తర్వాత విజయ్‌, మృణాల్ ఫ్యామిలీ స్టార్‌లోని పాటకు డ్యాన్స్‌ చేసి ఆకట్టుకున్నారు. ఇక శివాజీ, వేణు టీం ఇద్దరు లీడ్‌గా వ్యవహరించి వారితో ధమ్‌ షరత్‌ ఆడుతారు. ఇలా మొత్తం ఈవెంట్‌ అంతా చాలా సరదాగా సాగింది. ఈసారి పండగే మనదే అంటూ ఫ్యామిలీ స్టార్‌ టీంతో జబర్దస్త్ టీం, #90's వెబ్‌ సిరీస్‌ టీం, బలగం టీం చేసిన హంగామా చూడాలంటే ఉగాది వరకు వేచే చూడాల్సిందే. మార్చి 19న ఈ కార్యక్రమంలో ఉదయం 9:30 గంటలకు ఈటీవీలో ప్రసారం కానుంది.  బలగం డైరెక్టర్, ఒకప్పటి జబర్దస్క్ కమెడియన్ వేణు ఎల్దండి కూడా ఫ్యామిలీతో ఈ ఈవెంట్‍లో కనిపించనున్నారు.