Family Star third single 'Madhurame Kadha' to release on March 25th: 'ది' విజయ్ దేవరకొండ హీరోగా నటించిన కొత్త సినిమా 'ఫ్యామిలీ స్టార్'. ఇందులో ఆయన జోడీగా 'సీతా రామం', 'హాయ్ నాన్న' సినిమాల ఫేమ్ మృణాల్ ఠాకూర్ కథానాయికగా నటించారు. 'గీత గోవిందం' తర్వాత విజయ్ దేవరకొండ కథానాయకుడిగా పరశురామ్ తెరకెక్కిస్తున్న చిత్రమిది. త్వరలో సినిమా ట్రైలర్ విడుదల కానుంది.
మార్చి 28న 'ఫ్యామిలీ స్టార్' ట్రైలర్ విడుదల
Family Star Trailer: మార్చి 28... అంటే రాబోయే గురువారం రోజు 'ఫ్యామిలీ స్టార్' ట్రైలర్ విడుదల చేయనున్నట్లు చిత్ర నిర్మాణ సంస్థ శ్రీ వేంకటేశ్వర క్రియేషన్స్ సంస్థ అనౌన్స్ చేసింది. దాంతో పాటు మరో అప్డేట్ కూడా ఇచ్చింది. సినిమాలో మూడో పాట 'మధురము కదా...'ను మార్చి 25 (సోమవారం) విడుదల చేయనున్నట్లు పేర్కొంది.
'ఫ్యామిలీ స్టార్' నుంచి ఇప్పటికే రెండు పాటలు విడుదల అయ్యాయి. అందులో తొలి పాట 'నందనందా...' ఆల్రెడీ 25 మిలియన్ వ్యూస్ మార్క్ చేరుకుంది. 'గీత గోవిందం' సినిమాకు సూపర్ డూపర్ హిట్ ఆల్బమ్ ఇచ్చిన గోపీసుందర్ మరోసారి ఈ సినిమాకు సైతం సూపర్ హిట్ సాంగ్స్ ఇచ్చినట్లు ఆ సాంగ్ వింటే అర్థం అవుతోంది. 'గీత గోవిందం'లో 'ఇంకేం ఇంకేం కావాలో...' పాటను సిద్ శ్రీరామ్ పాడిన సంగతి తెలిసిందే. ఆయన 'నందనందనా' పాడారు. ఆ తర్వాత 'కల్యాణీ వచ్చా వచ్చా' విడుదల చేశారు. దానికీ మంచి స్పందన లభించింది. ఇప్పుడు మూడో పాట 'తెలుసు కదా' ఎలా ఉంటుందో చూడాలి.
Also Read: వెంకటేష్, అనిల్ రావిపూడి లేటెస్ట్ సినిమాకు మ్యూజిక్ డైరెక్టర్ ఫిక్స్... ఆయన ఎవరంటే?
ప్రైమ్ వీడియో చేతికి 'ఫ్యామిలీ స్టార్' డిజిటల్ రైట్స్!
'ఫ్యామిలీ స్టార్' సినిమా ఏప్రిల్ 5న థియేటర్లలో విడుదల కానుంది. అయితే, ఈ సినిమా ఓటీటీ డీల్ ఆల్రెడీ క్లోజ్ అయ్యింది. ప్రముఖ ఓటీటీ వేదిక అమెజాన్ ప్రైమ్ వీడియో సంస్థ ఫ్యాన్సీ రేటుకు స్ట్రీమింగ్ హక్కులు సొంతం చేసుకుంది. 'దిల్' రాజుకు చెందిన శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ సంస్థలో తెరకెక్కుతున్న 54వ చిత్రమిది. సోదరుడు శిరీష్ (Shirish Producer)తో కలిసి ఆయన ఈ సినిమా నిర్మిస్తున్నారు.
'ఫ్యామిలీ స్టార్' సినిమాలో మృణాల్ ఠాకూర్ మెయిన్ హీరోయిన్ కాగా... 'మజిలీ', 'రామారావు ఆన్ డ్యూటీ', 'మైఖేల్' ఫేమ్ దివ్యాంశ కౌశిక్ ఓ కీలక పాత్ర చేశారు. నేషనల్ క్రష్ రష్మికా మందన్నా అతిథి పాత్రలో సందడి చేయనున్నారు. ఓ విదేశీ భామ సైతం ఓ ముఖ్యమైన పాత్రలో కనిపిస్తారని సమాచారం.