బాలీవుడ్ యాక్షన్ హీరోల లిస్టులో తప్పకుండా కనిపించే రెండు పేర్లు... ఖిలాడీ కుమార్ అక్షయ్ (Akshay Kumar) & యంగ్ హీరో టైగర్ ష్రాఫ్ (Tiger Shroff). ఈ ఇద్దరికీ ఓ కామన్ ఫ్యాక్టర్ ఉంది. ఇద్దరూ జిమ్నాస్టిక్స్ నేపథ్యం నుంచి వచ్చిన హీరోలే. మజిల్డ్, ప్యాక్డ్ బాడీతో ఉంటారు. వీళ్లిద్దరూ కలిసి నటిస్తున్న సినిమా 'బడే మియా ఛోటే మియా' (Bade Miyan Chote Miyan Movie). ఈ ఏడాది... 2024లో ఇద్దరికీ ఫస్ట్ సినిమా ఇది. మరో రెండు రోజుల్లో ట్రైలర్ విడుదల కానుంది. 


మార్చి 26... మంగళవారం ట్రైలర్ రిలీజ్!
అక్షయ్ కుమార్, టైగర్ ష్రాఫ్ నటిస్తున్న 'బడే మియా ఛోటే మియా' చిత్రాన్ని పూజా ఎంటర్‌టైన్‌మెంట్స్, ఏఏజెడ్ ఫిలిమ్స్ సంస్థలతో కలిసి వశు భగ్నానీ, దీప్షికా దేశ్‌ముఖ్, జాకీ భగ్నానీ సంయుక్తంగా ప్రొడ్యూస్ చేస్తున్నారు. ఈ చిత్రానికి సల్మాన్ ఖాన్ హీరోగా 'సుల్తాన్', 'టైగర్ జిందా హై', 'భారత్' వంటి హిట్ సినిమాలు తీసిన అలీ అబ్బాస్ జాఫర్ దర్శకత్వం వహించారు. రైటర్ కూడా ఆయనే! లేటెస్ట్ అప్డేట్ ఏమిటంటే... ట్రైలర్ రిలీజ్ డేట్ అనౌన్స్ చేశారు.


మార్చి 26న... మంగళవారం 'బడే మియా ఛోటే మియా' ట్రైలర్ యూట్యూబ్‌లో విడుదల కానుంది. హిందీతో పాటు తెలుగు, తమిళం, మలయాళ, కన్నడ భాషల్లో ట్రైలర్ రిలీజ్ చేయనున్నారు.


Also Readఒమీ భాయ్ - పవన్ కళ్యాణ్ సినిమాలో విలన్‌గా బాలీవుడ్ హీరో లుక్ వచ్చేసింది






రంజాన్ సందర్భంగా ఏప్రిల్ 10న సినిమా విడుదల
యాక్షన్ ఎంటర్‌టైనర్‌గా 'బడే మియా ఛోటే మియా'ను తెరకెక్కించారు. ఇందులో అక్షయ్ కుమార్ సరసన మానుషీ చిల్లర్, టైగర్ ష్రాఫ్ జోడీగా ఆలయ ఫార్ట్యూన్ వాలా నటించినట్లు ట్రైలర్ రిలీజ్ డేట్ పోస్టర్ చూస్తే అర్థం అవుతోంది. రంజాన్ సందర్భంగా ఏప్రిల్ 10న థియేటర్లలో పాన్ ఇండియా రిలీజ్ కానుంది.


థియేటర్లలో హిందీతో పాటు తెలుగు, తమిళం, మలయాళం, కన్నడ భాషల్లో సినిమా రిలీజ్ చేస్తామని తెలిపారు. ఇందులో పృథ్వీరాజ్ సుకుమారన్, సోనాక్షి సిన్హా కూడా కీలక పాత్రల్లో నటిస్తున్నారు. ఆల్రెడీ విడుదలైన 'మస్త్ మలంగ్' పాటలో అక్షయ్, టైగర్ 'నాటు నాటు...' పాటకు స్టెప్పులు వేశారు. ఆ విజువల్స్ వైరల్ అయ్యాయి.


Also Readవెంకటేష్, అనిల్ రావిపూడి లేటెస్ట్ సినిమాకు మ్యూజిక్ డైరెక్టర్ ఫిక్స్... ఆయన ఎవరంటే?






'బడే మియా చోటే మియా' సీట్ ఎడ్జ్ యాక్షన్ థ్రిల్లర్ అని, ఇందులో థ్రిల్లింగ్ అండ్ ఎమోషనల్ సీన్స్, సూపర్బ్ సాంగ్స్ - ఇలా ఆడియన్స్ కోరుకునే అంశాలు అన్నీ ఉన్న విజువల్ వండర్ ఇదని నిర్మాతలు తెలిపారు.