Chaitanya Rao Madadi new movie: '30 వెడ్స్ 21' ఫేమ్ చైతన్య రావు హీరోగా యాక్ట్ చేసిన కొత్త సినిమా 'తెప్ప సముద్రం'. ఇందులో 'బిగ్ బాస్' ఫేమ్, సీరియళ్లతో పాటు కొన్ని సినిమాల్లో హీరో & విలన్ రోల్స్ చేసిన అర్జున్ అంబటి మరో హీరో. 'కోరమీను' ఫేమ్ కిశోరి ధాత్రిక్ హీరోయిన్. రవిశంకర్ ప్రధాన పాత్రలో నటించారు. సతీష్ రాపోలు దర్శకత్వం వహించారు. ఈ చిత్రాన్ని బేబీ వైష్ణవి సమర్పణలో శ్రీమణి ఎంటర్‌టైన్‌మెంట్స్ పతాకంపై నీరుకంటి మంజులా రాఘవేందర్ గౌడ్ ప్రొడ్యూస్ చేస్తున్నారు. ఇందులో పెంచల్ దాస్ ఓ పాట పాడారు.


నా నల్ల కలువా పువ్వా...
ఎండి మెరుపుల చేపా పిల్లా!
'తెప్ప సముద్రం' చిత్రానికి పీఆర్ (పెద్దపల్లి రోహిత్ - Music Director PR) సంగీతం అందిస్తున్నారు. ఆయన స్వరపరిచిన బాణీకి సాహిత్యం రాయడంతో పాటు స్వయంగా ఆలపించారు పెంచల్ దాస్. 


యంగ్ టైగర్ ఎన్టీఆర్ హీరోగా త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వం వహించిన 'అరవింద సమేత వీర రాఘవ' సినిమాలో 'ఏడ పోయినాడో...' పాట పెంచల్ దాస్ (Penchal Das Hit Songs)కు పేరు తెచ్చింది. ఆ సినిమాలో 'రెడ్డమ్మ తల్లి' పాట రాసింది కూడా ఆయనే. అంతకు ముందు 'కృష్ణార్జున యుద్ధం' సినిమాలోనూ 'దారి చూడు' పాట రాసి పాడారు. తర్వాత కొన్ని సాంగ్స్ చేశారు. ఇప్పుడు మరో పాటతో తెలుగు ప్రేక్షకుల ముందుకు వచ్చారు.


'నా నల్ల కలువా పువ్వా...
ఎండి మెరుపుల చేపా పిల్లా...
ఎదురు చూపుల వేళా ఏమైనావో?
ఏ మబ్బు కమ్మినాదో...
ఏ మిత్తవ మింగినాదో...
ఏ కామపు కోరకే ఆహుతి అయినావో!
అరచేతుల పెంచి ఆడమరచినామమ్మా'
అంటూ 'తెప్ప సముద్రం' కోసం పెంచల్ దాస్ పాట రాసి పాడారు. అమ్మాయిలు, మహిళలపై జరుగుతున్న అత్యాచారాలు, మానభంగాలపై ఈ సాంగ్ రూపొందించారు. మానవ మృగాల చేతిలో మహిళ ఎలా బలిపోతుందో చెబుతూ భావోద్వేగ భరితంగా సాగిందీ గీతం.


Also Readఒమీ భాయ్ - పవన్ కళ్యాణ్ సినిమాలో విలన్‌గా బాలీవుడ్ హీరో లుక్ వచ్చేసింది



ఏప్రిల్ 12న థియేటర్లలోకి 'తెప్ప సముద్రం'
ఏప్రిల్ 12న థియేటర్లలో చిత్రాన్ని విడుదల చేస్తున్నట్లు నిర్మాత రాఘవేందర్ గౌడ్ తెలిపారు. ఇంకా 'తెప్ప సముద్రం' సినిమా గురించి ఆయన మాట్లాడుతూ... ''ఈ పాటలో మంచి సందేశం ఉంది. ఆల్రెడీ విన్నవారు ఎంతో బావుందని చెబుతూ మెస్సేజులు చేస్తున్నారు. మా దర్శకుడు సతీష్ చెప్పిన కథ నాకు ఎంతో నచ్చింది. అందుకని సినిమా ఓకే చేశాం. ఆల్రెడీ అవుట్ ఫుట్ చూశా. బాగా వచ్చింది. మా చిత్రాన్ని ప్రేక్షకులు కూడా ఆదరిస్తారని కోరుకుంటున్నాను'' అని చెప్పారు. దర్శకుడు సతీష్ రాపోలు మాట్లాడుతూ... ''నిర్మాత రాఘవేందర్ గారు కాంప్రమైజ్ కాకుండా ఈ చిత్రాన్ని నిర్మించారు. ప్రేక్షకులకు నచ్చే కమర్షియల్ సినిమా అవుతుంది. ఏప్రిల్ 12న అందరూ థియేటర్లలో చూస్తారని ఆశిస్తున్నా" అని అన్నారు.


Also Readవెంకటేష్, అనిల్ రావిపూడి లేటెస్ట్ సినిమాకు మ్యూజిక్ డైరెక్టర్ ఫిక్స్... ఆయన ఎవరంటే?