తమిళ స్టార్ హీరో విజయ్, పూజా హెగ్డే జంటగా నటించిన సినిమా 'బీస్ట్'. సన్ పిక్చర్స్ సంస్థ నిర్మించింది. 'కోకో కోకిల', 'డాక్టర్' సినిమాలతో తెలుగులోనూ విజయాలు అందుకున్న నెల్సన్ దిలీప్ కుమార్ దర్శకత్వం వహించారు. ఈ సినిమాను ఏప్రిల్ 13న విడుదల చేయనున్నట్టు నేడు అధికారికంగా ప్రకటించారు.


తొలుత ఏప్రిల్ 14న 'బీస్ట్' ప్రేక్షకుల ముందుకు తీసుకు రావాలని అనుకున్నారు. అయితే... ఇప్పుడు ఒక్క రోజు ముందుకు వచ్చారు. తమిళం సహా తెలుగు, హిందీ , ఇతర భాషల్లోనూ విడుదల చేయాలని ప్లాన్ చేస్తున్నారు. కన్నడ స్టార్ యష్ పాన్ ఇండియా సినిమా 'కె.జి.యఫ్ 2' ఏప్రిల్ 14న విడుదల కానున్న సంగతి తెలిసిందే. ఒక్క రోజు వ్యవధిలో రెండు సినిమాలు బాక్సాఫీస్ దగ్గర పోటీ పడనున్నాయి. ఓ రోజు ముందు విజయ్ సినిమా వస్తుండటంతో ఓపెనింగ్స్ విషయంలో ఆయనకు ఢోకా ఉండదు.


Also Read: కోడి కత్తి వాడిన రాజ‌మౌళి, ఖైదీ సీఎం - నాగబాబు వెటకారం! వైఎస్ వివేకాది సహజ మరణమా?


తెలుగులో భారీ ఎత్తున్న 'బీస్ట్'ను విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నారు. ఈ సినిమా తెలుగు థియేట్రికల్ హక్కులను సుమారు 11 కోట్ల రూపాయలకు ప్రముఖ నిర్మాతలు సురేష్ బాబు, 'దిల్' రాజు, ఏషియన్ సునీల్ నారంగ్ సొంతం చేసుకున్నట్టు ఫిల్మ్ నగర్ టాక్. ముగ్గురూ సంయుక్తంగా సినిమాను డిస్ట్రిబ్యూట్ చేయనున్నారు. ఈ సినిమాకు అనిరుధ్ రవిచందర్ సంగీత దర్శకుడు. ఆల్రెడీ విడుదలైన పాటలకు మంచి స్పందన లభిస్తోంది.


Also Read: బాలీవుడ్‌లో విషాదం - 24 ఏళ్లకు 'గల్లీ బాయ్' ర్యాపర్ ఎంసీ తోడ్ ఫోడ్ మృతి, ర‌ణ్‌వీర్ సింగ్‌ భావోద్వేగం