Raghavendra Rao on Baby Movie: యువ నటుడు ఆనంద్ దేవరకొండ కొత్త సినిమా, సాయి రాజేష్ దర్శకత్వం వహించిన 'బేబీ'.. ఇటీవలే థియేటర్లలో విడుదలై మంచి టాక్ ను సొంతం చేసుకుంది. ఈ సినిమాలో వైష్ణవి చైతన్య కథానాయికగా నటించగా.. విరాజ్ అశ్విన్ ఓ కీలక పాత్రలో కనిపించారు. ఈ చిత్రం ముందు నుంచే పాజిటివ్ టాక్ ను సొంతం చేసుకోగా.. ఇప్పుడు బాక్సాఫీస్ వద్ద కూడా మంచి వసూళ్లను రాబడుతోంది. ఈ క్రమంలోనే ఈ సినిమాపై పలువురు సినీ ప్రముఖులు ప్రశంసలు కురిపిస్తున్నారు. ఈ నేపథ్యంలోనే ప్రముఖ స్టార్ డైరెక్టర్ రాఘవేంద్రరావు ఈ మూవీని వీక్షించారు. అనంతరం టీమ్ మొత్తం కలిసి మంచి సినిమాను అందించారని అభినందించారు. 


'జగదీక వీరుడు అతిలోక సుందరి', 'అన్నమయ్య', 'శ్రీరామదాసు', 'ఘరానా మొగుడు', 'హిమ్మత్‌వాలా' వంటి 100కు పైగా చిత్రాలను రూపొందించిన రాఘవేంద్రరావు తెలుగు చిత్రసీమలోని ప్రముఖులలో ఒకరుగా చెప్పవచ్చు. అంతటి గ్రేట్ బ్యాగ్రౌండ్ ఉన్న దర్శకుడు... ఇటీవలే 'బేబీ' సినిమాను చూసి చిత్ర బృందంపై ప్రశంసలు గుప్పించారు. ఈ సందర్భంగా ట్వీట్ చేసిన ఆయన.. “బేబీ సినిమా చూశాను. చాలా ఎంజాయ్ చేశాను. ఈ సినిమాకు సాయి రాజేష్ చక్కగా రాసి దర్శకత్వం వహించారు. ఆనంద్ దేవరకొండ, వైష్ణవి చైతన్య, విరాజ్ అశ్విన్ అద్భుతంగా నటించారు. మైండ్ బ్లోయింగ్ మ్యూజిక్ అండ్ బ్యాక్ గ్రౌండ్ స్కోర్" అంటూ ఆయన ట్వీట్ లో రాసుకువచ్చారు. 


ఇక రాఘవేంద్రరావు చేసిన ట్వీట్‌కు చిత్ర దర్శకుడు సాయి రాజేష్ బదులిచ్చారు. "నాకు పెద్ద ఇన్స్పిరేషన్ మీరు.. మీ 'ఘరానా మొగుడు' సినిమా చూసే దర్శకత్వం మీద ఆసక్తి పెంచుకున్నాను. నా 'బేబీ' సినిమా మీకు నచ్చడం చాలా ఆనందంగా ఉంది" అని తెలిపారు. 






ఇక 'బేబీ' మూవీ విషయానికి వస్తే.. విడుదలకు ముందే.. సినిమాలోని పాటలు సెన్సేషన్‌ను క్రియేట్ చేశాయి. విజయ్ బుల్గానిన్ ఇచ్చిన సంగీతం సినిమాకు ప్రాణంగా నిలిచింది. టీజర్, ట్రైలర్‌లో సాయి రాజేష్ రాసిన డైలాగ్స్ అందరినీ కదిలించాయి. ఇలా సినిమా విడుదలకు ముందే పాజిటివ్ బజ్ క్రియేట్ చేసిన ఈ సినిమా మంచి అంచనాల నడుమ జూలై 14న రిలీజై మంచి కలెక్షన్లను వసూలు చేస్తోంది. 'బేబీ' మూవీని మాస్ మూవీ మేకర్స్ నిర్మించగా.. ఈ చిత్రంలో నాగబాబు, లిరీషా, కుసుమ, సాత్విక్ ఆనంద్ తదితరులు కీలక పాత్రలు పోషించారు. విజయ్ బుల్గానిన్ ఈ చిత్రానికి సోల్‌ఫుల్ సౌండ్‌ట్రాక్‌లను అందించారు. 'బేబీ'ని ఎస్‌కెఎన్ నిర్మించగా.. ధీరజ్ మోగినేని సహ నిర్మాతగా వ్యవహరించారు.


Read Also :‘OMG 2’ Controversy: ‘OMG 2’లో స్వలింగ సంపర్కం సీన్స్‌ ఉన్నాయా? మూవీ టీమ్ సెన్సార్ బోర్డ్‌కు ఏం చెప్పింది? గ్రీన్ సిగ్నల్ ఇస్తారా?


ముఖ్యమైన, మరిన్ని ఆసక్తికర కథనాల కోసం ‘టెలిగ్రామ్’లో ‘ఏబీపీ దేశం’లో జాయిన్ అవ్వండి.
Join Us on Telegram: https://t.me/abpdesamofficial