సినిమా రంగానికి ఇటీవల కాలంలో వరుసగా గుడ్ న్యూస్ లు అందుతున్నాయి. ఇప్పటికే మెగాస్టార్ చిరంజీవి అత్యంత ప్రతిష్టాత్మకమైన అవార్డు పద్మ విభూషణ్ నుంచి మొదలుకొని రీసెంట్ గా గిన్నిస్ రికార్డ్, ఐఫా అవార్డ్స్ లో ప్రత్యేక గౌరవాన్ని అందుకున్న విషయం తెలిసిందే. తాజాగా మరో ప్రముఖ నటుడు మిథున్ చక్రవర్తి 'దాదా సాహెబ్ ఫాల్కే' అవార్డుకు ఎంపికైనట్టు ప్రకటన రావడం సినీ వర్గాలను సంతోషంలో ముంచెత్తింది. 


మిథున్ చక్రవర్తికి 'దాదా సాహెబ్ ఫాల్కే' అవార్డు 
భారత దేశంలో 'దాదా సాహెబ్ ఫాల్కే' అవార్డును సినీ రంగానికి సంబంధించి ఎంతో ప్రతిష్టాత్మకంగా భావిస్తారు. అయితే 2025 ఏడాదికి గాను ఈ అవార్డుకు ప్రముఖ నటుడు మిథున్ చక్రవర్తి ఎంపికయ్యారని తాజాగా కేంద్ర సమాచార, ప్రసార మంత్రిత్వ శాఖ ప్రకటించింది. మిథున్ చక్రవర్తితో పాటు ఆయన అభిమానులకు, మూవీ లవర్స్ కు గుడ్ న్యూస్ అందించింది. 'దాదా సాహెబ్ ఫాల్కే' అవార్డుల ప్రధానోత్సవం అక్టోబర్ 8న జరగబోతోంది. మిథున్ చక్రవర్తి ఈ జాతీయ చలనచిత్ర అవార్డుల ప్రధానోత్సవంలో ఈ అత్యంత గౌరవనీయమైన పురస్కారాన్ని అందుకోబోతున్నారు. కేంద్ర సమాచారం మంత్రి అశ్విని వైష్ణవ్ ఈ విషయాన్ని సోషల్ మీడియా వేదికగా తెలియజేశారు. ఆ పోస్టులో 'మిథున్ చక్రవర్తి అద్భుతమైన సినీ ప్రయాణం, సినిమా రంగానికి ఆయన చేసిన కృషి ఎంతో మందికి స్ఫూర్తిదాయకమైనది. భారతీయ చలనచిత్ర పరిశ్రమకు ఆయన చేసిన సేవలను గుర్తించిన జ్యూరీ ఈ ఏడాది దాదా సాహెబ్ ఫాల్కే పురస్కారం మిథున్ చక్రవర్తికి అందించాలని నిర్ణయించింది' అంటూ ఈ విషయంపై అఫీషియల్ గా అనౌన్స్మెంట్ ఇచ్చారు. 


Also Readవెంకీ మామతో దేవిశ్రీ స్టెప్పులు - ఐఫా 2024లో గ్లామరస్ పెర్ఫార్మన్స్‌లు... ఫోటోలు చూడండి



మిథున్ చక్రవర్తి సినీ ప్రయాణం... 
బాలీవుడ్ లో ఎవర్ గ్రీన్ హీరోల్లో మిథున్ చక్రవర్తి ఒకరు. పశ్చిమ బెంగాల్ కు చెందిన ఆయన ఇప్పటిదాకా ఎన్నో బాలీవుడ్ సినిమాల్లో నటించి తనకంటూ ప్రత్యేకమైన గుర్తింపును దక్కించుకున్నారు. కేవలం హీరో గానే కాకుండా క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా, విలన్ గా కూడా మిథున్ చక్రవర్తి ఎందరో స్టార్ హీరోల సినిమాల్లో నటించి అలరించారు. 1976లో 'మృగాయ' అనే సినిమాతో సినిమా పరిశ్రమలోకి ఎంట్రీ ఇచ్చి, మొదటి సినిమాతోనే ఆయన బెస్ట్ యాక్టర్ గా జాతీయ అవార్డును అందుకోవడం విశేషం. ఇక ఆ తర్వాత మిథున్ చక్రవర్తి వరుసగా బన్సారి, ముక్తి, ప్రేమ్ వివాహ్, అమర్దీప్, కస్తూరి, కిస్మత్ ,మేరా సాతి, వాంటెడ్, దలాల్, భీష్మ, కిక్, సుల్తాన్, డిస్కో డాన్సర్ వంటి పలు సినిమాల్లో నటించి కోట్లాది మంది అభిమానులను సంపాదించుకున్నారు. మిథున్ చక్రవర్తి కేవలం హిందీ సినిమాల్లోనే కాకుండా బెంగాలీ, తెలుగు, ఒరియా, కన్నడ, భోజ్ పురి సినిమాల్లో కూడా కనిపించారు. తెలుగులో పవర్ స్టార్ పవన్ కళ్యాణ్, విక్టరీ వెంకటేష్ కలిసి నటించిన బ్లాక్ బస్టర్ మల్టీస్టారర్ ,గోపాల గోపాల, మూవీతో విలన్ గా నటించి తెలుగు ప్రేక్షకులకు పరిచయమయ్యారు. ఆ తర్వాత మిథున్ చక్రవర్తి ,మలుపు, అనే తెలుగు సినిమాలో కూడా నటించారు. ,ఐయామ్ ఎ డిస్కో డాన్సర్' అనే పాపులర్ సాంగ్ తో దేశ విదేశాల్లో సైతం మిథున్ చక్రవర్తికి ప్రత్యేకమైన ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంది. మరో గర్వించదగ్గ విషయం ఏమిటంటే ఈ ఏడాది మొదట్లోనే ఆయనను పద్మభూషణ్ అవార్డుతో కేంద్ర ప్రభుత్వం సత్కరించింది.


Also Read: నామినేషన్ పేరుతో కంటెస్టెంట్ల మధ్య మంట పెట్టిన బిగ్ బాస్... ఇవాళ్టి ప్రోమోలో హైలెట్స్ ఇవే