Saindhav seals its world TV premiere date : టాలీవుడ్ లో ఈ ఏడాదికి సంక్రాంతి రిలీజ్ అయిన సినిమాల్లో విక్టరీ వెంకటేష్ 'సైంధవ్' కూడా ఒకటి. హిట్, హిట్ 2 వంటి సక్సెస్ఫుల్ సినిమాలను తెరకెక్కించిన యంగ్ డైరెక్టర్ శైలేష్ కొలను దర్శకత్వంలో యాక్షన్ ఎంటర్టైనర్ గా రూపొందిన ఈ చిత్రం భారీ అంచనాల నడుమ విడుదలై ఆడియన్స్ ని ఏమాత్రం ఆకట్టుకోలేకపోయింది. అటు కలెక్షన్స్ కూడా పూర్తిగా నిరాశపరిచాయి. చాలా గ్యాప్ తర్వాత ఈ సినిమాతో వెంకటేష్ యాక్షన్ మోడ్ లోకి దిగడంతో ఫ్యాన్స్ 'సైంధవ్' పై ఎన్నో ఆశలు పెట్టుకున్నారు. కానీ ఫ్యాన్స్‌ను సైతం ఈ సినిమా నిరాశపరిచింది. రీసెంట్ గా ఓటీటీలో స్ట్రీమింగ్‌కు అందుబాటులోకి వచ్చిన ఈ సినిమా ఇప్పుడు టీవీల్లోకి వచ్చేస్తుంది.


'సైంధవ్' టీవీల్లోకి వచ్చేది అప్పుడే..


'సైంధవ్' ప్రస్తుతం ప్రముఖ ఓటీటీ అమెజాన్ ప్రైమ్ లో స్ట్రీమింగ్ అవుతోంది. ఇక త్వరలోనే ఈ సినిమా టీవీలోకి రాబోతోంది. ఈ మూవీ శాటిలైట్ హక్కులను ఈటీవీ దక్కించుకుంది. ఈ క్రమంలోనే 'సైంధవ్' వరల్డ్ టెలివిజన్ ప్రీమియర్ డేట్ ను ఈటీవీ అధికారికంగా అనౌన్స్ చేసింది. మార్చి 17 సాయంత్రం 6 గంటలకు ఈటీవీలో 'సైంధవ్' మూవీ టెలికాస్ట్ కానున్నట్లు ఆ ఛానల్ వెల్లడించింది. థియేటర్, ఓటీటీలో పెద్దగా ప్రేక్షకాదరణ పొందని ఈ సినిమా ఇప్పుడు టీవీలో ఎలాంటి రెస్పాన్స్ అందుకుంటుందో చూడాలి.


‘సైంధవ’ ఎందుకు ప్లాప్ అయింది?


'హిట్', 'హిట్ 2' లాంటి క్రైమ్ ఇన్వెస్టిగేషన్ థ్రిల్లర్స్‌తో ఆకట్టుకున్న శైలేష్ కొలను 'సైంధవ్' కోసం మాఫియా, గ్యాంగ్ స్టర్ లాంటి అవుట్ డేటెడ్ లైన్ తీసుకుని దానికి ఓ మెకికల్ డ్రగ్ పాయింట్ తో పాటూ కూతురి సెంటిమెంటును జోడించాడు. ఓ సాదాసీదా జీవితాన్ని లీడ్ చేసే హీరోకి పవర్ఫుల్ ఫ్లాష్ బ్యాక్ ఉండడం అనేది గతంలోనే చాలా సినిమాల్లో వాడేసారు. సరే అదే పాయింట్ ని కొత్త క్యారెక్టరైజేషన్ తో కథ రాసుకున్నా దాన్ని హ్యాండిల్ చేయడంలో శైలేష్ కొలను తడబడ్డాడు. హీరోకు నెక్స్ట్ లెవెల్ ఫ్లాష్ బ్యాక్, అతనికి సపోర్ట్ గా నిలిచే కొన్ని క్యారెక్టర్స్, దీటైన విలన్స్.. ఇలా అన్నీ ఉన్న సినిమాలో ఏదో మిస్ అయిన ఫీలింగ్ కలుగుతుంది.


హీరో పవర్ ఫుల్ గ్యాంగ్ స్టర్ సైకో పాత్ర నుంచి సైంధవ్ గా సాదాసీదా ఫ్యామిలీ మెంబర్ గా ఎందుకు మారాడనే అంశాన్ని సరిగ్గా చూపించలేదు. సినిమాలో ఆర్య, రుహాని శర్మ, ఆండ్రియాతో పాటు చాలామంది టాలెంటెడ్ యాక్టర్స్ ఉన్నా వాళ్ళని పూర్తిస్థాయిలో వాడుకోలేదు. ఏదో పాన్ ఇండియా మార్కెట్ కోసమే వాళ్ళని తీసుకున్నట్లు అనిపిస్తుంది. ఇక సినిమాలో సైకోగా వెంకటేష్ అదరగొట్టేసారు. మరోసారి తనలోని మాస్ యాక్షన్ ని యాంగిల్ ని చూపించాడు. వెంకీ తర్వాత బాలీవుడ్ యాక్టర్ నవాజుద్దీన్ విలనిజం ఆకట్టుకుంటుంది. మొత్తంగా ఆడియన్స్‌ను పెద్దగా ఆకట్టుకుని 'సైంధవ్' సంక్రాంతికి రిలీజ్ అయిన సినిమాల్లో కనీసం బ్రేక్ ఈవెన్ కూడా అందుకోలేక నిర్మాతలకు భారీ నష్టాలను మిగిల్చింది.


Also Read : బాలయ్య మూవీలో ఛాన్స్ వచ్చినా ఎందుకు చేయలేదంటే?- అసలు విషయం చెప్పిన విశ్వక్ సేన్!