సంక్రాంతి బరి నుంచి విక్టరీ వెంకటేష్ (Venkatesh) వెనక్కి తగ్గలేదు. ఆయన కథానాయకుడిగా అనిల్ రావిపూడి దర్శకత్వంలో ఓ సినిమా రూపొందుతున్న సంగతి తెలిసిందే. ఆ చిత్రానికి 'సంక్రాంతికి వస్తున్నాం' (Sankranthiki Vasthunnam Movie) అనే టైటిల్ ఖరారు చేయాలని ప్లాన్ చేస్తున్నారని సమాచారం. అది అనౌన్స్ చేయక ముందే... సంక్రాంతికి అసలు ఆ సినిమా వస్తుందా? లేదా? అనే సందేహాలు మొదలు అయ్యాయి. వాటికి ఈరోజు సినిమా యూనిట్ చెక్ పెట్టింది.
సంక్రాంతికి రాదనే సందేహాలకు కారణం ఏమిటి?
వెంకటేష్, అనిల్ రావిపూడి (Anil Ravipudi) సినిమాకు 'దిల్' రాజు నిర్మాత. శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ పతాకం మీద సోదరుడు శిరీష్ తో కలిసి ప్రొడ్యూస్ చేస్తున్నారు. అయితే... 'దిల్' రాజు నిర్మిస్తున్న మరొక సినిమా గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ 'గేమ్ చేంజర్' (Game Changer Movie). తొలుత ఆ చిత్రాన్ని క్రిస్మస్ సందర్భంగా విడుదల చేయాలని అనుకున్నా... చివరకు సంక్రాంతికి వాయిదా వేశారు.
శంకర్ దర్శకత్వంలో 'గేమ్ చేంజర్' చిత్రాన్ని భారీ నిర్మాణ వ్యయంతో 'దిల్' రాజు తీస్తున్నారు. అది పాన్ ఇండియా సినిమా కనుక, బడ్జెట్ మరీ ఎక్కువ అయింది కనుక సంక్రాంతి సీజన్ క్యాష్ చేసుకోవడానికి ఆ టైంలో మిగతా సినిమాలో లేకుండా ప్లాన్ చేస్తారని ప్రచారం జరిగింది. తన సంస్థ నుంచే మరొక సినిమాను 'దిల్' రాజు విడుదల చేస్తారని అనుకోలేదు. వెంకటేష్, అనిల్ రావిపూడి సినిమాను వాయిదా వేయచ్చు అనే ప్రచారం జరిగింది. అయితే ఈ రోజు వచ్చిన అప్డేట్ అందుకు భిన్నంగా ఉంది.
డబ్బింగ్ మొదలు... షూటింగ్ 90% పూర్తి!
వెంకటేష్ కథానాయకుడిగా అనిల్ రావిపూడి దర్శకత్వంలో 'దిల్' రాజు, ఆయన సోదరుడు శిరీష్ నిర్మిస్తున్న సినిమా యూనిట్ నుంచి వచ్చిన అప్డేట్ ఏమిటంటే... డబ్బింగ్ వర్క్స్ మొదలు పెట్టారు. దాంతో పాటు షూటింగ్ కూడా 90 శాతం పూర్తి అయ్యిందని తెలిపారు. సంక్రాంతికి థియేటర్లలోకి వస్తామని కూడా పేర్కొన్నారు. దాంతో ఈ సినిమా వాయిదా పడే అవకాశం లేదని అటు ఇండస్ట్రీ వర్గాలకు ఇటు ప్రేక్షకులకు పరోక్షంగా క్లారిటీ ఇచ్చారు.
'గేమ్ చేంజర్' సంక్రాంతికి విడుదల చేస్తున్నట్టు 'దిల్' రాజు అనౌన్స్ చేసిన తర్వాత... అనిల్ రావిపూడి దర్శకత్వంలో చేస్తున్న సినిమాను వెంకటేష్ తన చేతుల్లోకి తీసుకుంటారని, తన సోదరుడు సురేష్ బాబు ద్వారా తెలుగు రాష్ట్రాలలో డిస్ట్రిబ్యూషన్ చేయించే అవకాశాలు ఉన్నాయని నగర్ వర్గాల్లో గుసగుసల వినిపించాయి. సురేష్ సంస్థతో డిస్ట్రిబ్యూషన్ చేయిస్తున్నారో? లేదంటే 'దిల్' రాజు చేస్తారో చూడాలి. బాలకృష్ణ హీరోగా బాబీ దర్శకత్వం వహిస్తున్న సినిమా కూడా సంక్రాంతి బరిలో విడుదల కానున్న సంగతి తెలిసిందే.
Also Read: 'కల్కి 2' ఎప్పుడు మొదలవుతుంది? - ప్రభాస్ ఫ్యాన్స్‌కు క్లారిటీ ఇచ్చిన నాగ్ అశ్విన్
వెంకటేష్ భార్యగా ఐశ్వర్య రాజేష్, మాజీ లవర్ పాత్రలో మీనాక్షి చౌదరి నటించిన ఈ సినిమాకు భీమ్స్ సిసిరోలియో సంగీతం అందిస్తున్నారు. వెంకీ, అనిల్ రావిపూడి కలయికలో మూడో చిత్రమిది. ఉపేంద్ర, రాజేంద్ర ప్రసాద్, సాయి కుమార్, నరేష్, వీటీ గణేష్, మురళీధర్ గౌడ్, పమ్మి సాయి, సాయి శ్రీనివాస్, ఆనంద్ రాజ్, చైతన్య జొన్నలగడ్డ, మహేష్ బాలరాజ్, ప్రదీప్ కబ్రా తదితరులు ఇతర ప్రధాన తారాగణం.
Also Read: ప్రభాస్‌తో పాటు వీళ్లదీ బర్త్ డే... ఇద్దరు హీరోయిన్లు, ఆ నిర్మాత కూడా ఈ రోజే పుట్టారని తెలుసా?