Vijay Devarakonda 11 First Look: విజయ్ దేవరకొండ అభిమానులకు గుడ్ న్యూస్. కొత్త సినిమా నుంచి ఆయన ఫస్ట్ లుక్ సరిగ్గా వారం రోజుల్లో ప్రేక్షకుల ముందుకు రానుంది. మే 16న VD 11 First Look విడుదల చేయనున్నట్టు మైత్రీ మూవీ మేకర్స్ సంస్థ ప్రకటించింది.
ప్రస్తుతం శివ నిర్వాణ దర్శకత్వంలో విజయ్ దేవరకొండ ఒక సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే. కశ్మీర్‌లో సినిమా షూటింగ్ జరుగుతోంది. తన పుట్టినరోజును సైతం రౌడీ బాయ్ అక్కడే సెలబ్రేట్ చేసుకున్నారు. ఆయన బర్త్ డే సందర్భంగా సినిమా ఫస్ట్ లుక్ గురించి అప్‌డేట్ ఇచ్చారు. మే 16న విడుదల చేయనున్నట్టు వెల్లడించారు. కశ్మీర్ షెడ్యూల్ మేకింగ్ వీడియో కూడా విడుదల చేశారు. బర్త్ డే సెలబ్రేషన్స్ ఎలా జరిగినదీ చూపించారు.
VD 11లో విజయ్ దేవరకొండ సరసన సమంత కథానాయికగా నటిస్తున్న సంగతి తెలిసిందే. మైత్రీ మూవీ మేకర్స్ పతాకంపై నవీన్ యేర్నేని, రవిశంకర్ యలమంచిలి నిర్మిస్తున్నారు. ఈ చిత్రానికి 'ఖుషి' (Khushi Title For Vijay Devarakonda Samantha Movie) టైటిల్ ఖరారు చేసినట్టు భోగట్టా. అయితే, ఇంకా అధికారికంగా ప్రకటించలేదు.
Also Read: విజయ్ దేవరకొండ కెరీర్‌లో చేసిన సినిమాలు ఎన్ని? విజయాలు ఎన్ని?
జయరాం, సచిన్ ఖేడేకర్, మురళీ శర్మ, లక్ష్మీ, అలీ, రోహిణి, 'వెన్నెల' కిశోర్, రాహుల్ రామకృష్ణ, శ్రీకాంత్ అయ్యంగార్, శరణ్య ప్రదీప్ తదితరులు నటిస్తున్న ఈ చిత్రానికి ఫైట్స్: పీటర్ హెయిన్, సంగీత దర్శకుడు : హిషామ్ అబ్దుల్ వాహాబ్, సీఈవో : చెర్రీ, ఛాయాగ్రహణం: జి. మురళి.
Also Read: ఎస్పీ బాలును గుర్తు చేసిన తనయుడు చరణ్ - 'సీతా రామం'లో తొలి పాట విన్నారా?