Akshay Kumar's Prithviraj Trailer: అక్షయ్ కుమార్ కథానాయకుడిగా నటించిన చారిత్రాత్మక సినిమా 'పృథ్వీరాజ్'. జూన్ 3న థియేటర్లలో విడుదల కానుంది. యుద్ధ నేపథ్యంలో రూపొందించిన చిత్రమిది. చౌహన్ రాజ వంశానికి చెందిన పృథ్వీరాజ్ చౌహన్ జీవితం ఆధారంగా తెరకెక్కిస్తున్నారు. ఈ రోజు ట్రైలర్ విడుదల చేశారు. యుద్ధభూమిలో అక్షయ్ కుమార్ చేసిన వీరోచిత పోరాటాలు, ఈ ట్రైలర్ ప్రేక్షకులను ఆకట్టుకునేలా ఉన్నాయి. 


'పృథ్వీరాజ్' ట్రైలర్ విషయానికి వస్తే... 'బంధుత్వాన్ని బట్టి కాదు, యోగ్యతను ఆధారంగా చేసుకుని పదవికి ఎంపిక చేస్తారు' అనే అర్థం వచ్చే మాటతో మొదలైంది. యుద్ధభూమిలో వీరోచిత దృశ్యాలను చూపించారు. ఆ తర్వాత ఢిల్లీ సింహాసనాన్ని పృథ్వీరాజ్ (అక్షయ్ కుమార్) అధిష్టించినట్టు చూపించారు. ఆ తర్వాత కథానాయిక మానుషీ చిల్లర్ ను పరిచయం చేశారు. ఢిల్లీపై దండెత్తిన సుల్తాన్ మహ్మద్ ఘోరీని పృథ్వీరాజ్ ఎలా అడ్డుకున్నాడు? ఎటువంటి యుద్ధం చేశాడు? అనేది ట్రైలర్ లో చూపించాడు. 'ధర్మం కోసమే జీవించారు. ధర్మం కోసం మరణిస్తాను' అని ట్రైలర్ చివర్లో అక్షయ్ కుమార్ చెప్పే డైలాగ్ పృథ్వీరాజ్ వ్యక్తిత్వాన్ని చెప్పేలా ఉంది. విజువల్స్ గ్రాండ్ గా ఉన్నాయి. ప్రొడక్షన్ వేల్యూస్ సూపర్. జూన్ 3న సినిమా ఎలా ఉంటుందో తెలుస్తుంది. 


Also Read: విజయ్ దేవరకొండ కెరీర్‌లో చేసిన సినిమాలు ఎన్ని? విజయాలు ఎన్ని?


అక్షయ్ కుమార్ సరసన మానుషీ చిల్లర్ కథానాయికగా నటించారు. ఆమెకు తొలి చిత్రమిది. 2017 అందాల పోటీల్లో మిస్ ఇండియా, మిస్ వరల్డ్ టైటిల్స్ విజేతగా మానుషీ చిల్లర్ నిలిచారు. ఇంకా ఈ సినిమాలో సంజయ్ దత్, సోనూ దత్, మానవ్ విజ్, అశుతోష్ రాణా, సాక్షి తన్వార్ తదితరులు నటించారు. యశ్ రాజ్ ఫిల్మ్స్ పతాకంపై ఆదిత్య చోప్రా నిర్మించారు. ఈ చిత్రానికి శంకర్ - ఎహసాన్ - లాయ్ సంగీత దర్శకులు.


Also Read: వెంకీకి రేచీక‌టి, వ‌రుణ్‌కు న‌త్తి - ఎక్స్‌ట్రాడినరీ ఫ‌న్‌తో 'ఎఫ్ 3' ట్రైలర్