వరుణ్ సందేశ్ (Varun Sandesh) కథానాయకుడిగా రూపొందుతున్న కొత్త సినిమా 'నింద' (Ninda Telugu Movie). కాండ్రకోట మిస్టరీ... ఇదీ ఉప శీర్షిక. అది చూస్తే సినిమా గురించి ఓ ఐడియా వస్తుంది. ఏపీలోని పెద్దాపురం మండలంలో గల ఊరు కాండ్రకోట. అందులో దెయ్యాలు, ఆత్మలు ఉన్నాయని విపరీతమైన ప్రచారం జరిగింది. ఆ మిస్టరీ నేపథ్యంలో తెరకెక్కిస్తున్న చిత్రమిది. ఈ రోజు వరుణ్ సందేశ్ ఫస్ట్ లుక్ విడుదల చేశారు.
మే 15న 'నింద' టీజర్ విడుదల
Ninda Movie Teaser Release On May 15th: 'నింద' చిత్రానికి రాజేష్ జగన్నాథం దర్శకత్వం వహిస్తున్నారు. అంతే కాదు... ది ఫర్వెంట్ ఇండీ ప్రొడక్షన్స్ పతాకంపై స్వయంగా ప్రొడ్యూస్ చేస్తున్నారు. కథ, కథనం ఆయనే అందిస్తున్నారు. వరుణ్ సందేశ్ ఫస్ట్ లుక్ పోస్టర్ చూస్తే... ఆయన సాధారణ యువకుడి పాత్ర చేసినట్లు అర్థం అవుతోంది. మరి, ఆ యువకుడి వెనుక హుడీ వేసుకున్న వ్యక్తి ఎవరు? ఆ నీడ ఎవరిది? అనేది తెలియాలంటే కొన్ని రోజులు ఆగక తప్పదు.
మే 15న సినిమా టీజర్ విడుదల చేయనున్నట్లు దర్శక నిర్మాత రాజేష్ జగన్నాథం తెలిపారు. వరుణ్ సందేశ్ లుక్ కింద ఇంతకు ముందు టైటిల్ పోస్టర్ విడుదల చేసినప్పుడు అందులో చూపించిన న్యాయదేవత విగ్రహాన్ని తలకిందులుగా ఉంచారు. టీజర్ విడుదలైన తర్వాత సినిమా గురించి ప్రేక్షకులకు మరింత క్లారిటీ వస్తుందని తెలిపారు. ఆల్రెడీ ఇండస్ట్రీలో కొందరు ప్రముఖులకు ఈ సినిమా చూపించారు. మూవీకి మంచి ఫీడ్ బ్యాక్ వచ్చిందట.
Also Read: చిత్రం చూడర మూవీ రివ్యూ: ETV Winలో వరుణ్ సందేశ్ సినిమా - బావుందా? లేదా?
'హ్యాపీ డేస్', 'కొత్త బంగారు లోకం', 'ఏమైంది ఈవేళ' వంటి సినిమాలతో వరుస విజయాలు అందుకున్న వరుణ్ సందేశ్ (Varun Sandesh)కు కొన్నాళ్లుగా సరైన విజయాలు లేవు. సోలో హీరో నుంచి పక్కకు వచ్చి 'మైఖేల్', 'ఆర్గానిక్ మామ హైబ్రిడ్ అల్లుడు'లో డిఫరెంట్ రోల్స్ చేశారు. ఆయనకు సోలో హీరోగా 'నింద' కమ్ బ్యాక్ మూవీ అవుతుందని యూనిట్ వర్గాలు నమ్మకంగా ఉన్నాయి.
Also Read: యాంకర్ కాపురంలో కలహాలు - విడాకుల దిశగా అందాల భామ అడుగులు
Telugu Movie Ninda Cast And Crew: వరుణ్ సందేశ్ కథానాయకుడిగా రూపొందుతున్న 'నింద'లో 'బేబీ' యానీ, తనికెళ్ల భరణి, భద్రమ్, సూర్య కుమార్, 'ఛత్రపతి' శేఖర్, 'మైమ్' మధు, సిద్దార్థ్ గొల్లపూడి, అరుణ్ దలై, శ్రేయా రాణి రెడ్డి, క్యూ మధు, శ్రీరామ్ సిద్దార్థ్ కృష్ణ, రాజ్ కుమార్ కుర్రా, దుర్గా అభిషేక్ ప్రధాన తారాగణం. ఈ చిత్రానికి కూర్పు: అనిల్ కుమార్, ఛాయాగ్రహణం: రమీజ్ నవీత్, సంగీతం: సంతు ఓంకార్, నిర్మాణ సంస్థ: ది ఫర్వెంట్ ఇండీ ప్రొడక్షన్స్, రచన - నిర్మాణం - దర్శకత్వం: రాజేష్ జగన్నాథం.
Also Read: రామ్ చరణ్ డెనిమ్ షర్టులో ఏమున్నాడ్రా బాబూ - గ్లోబల్ స్టార్ క్యాజువల్ లుక్ కిర్రాక్ అంతే!