Varalaxmi Sarathkumar Wedding Photos Goes Viral: నటి వరలక్ష్మి శరత్‌ కుమార్ వివాహ బంధంలోకి అడుగుపెట్టింది. తన ప్రియుడు, ముంబైకి చెందిన ఆర్ట్‌ గ్యాలరీ నిర్వహకుడు నికోలాయ్‌ సచ్‌దేవ్‌తో ఏడడుగులు వేసింది. థాయిలాండ్‌లో జరిగిన వీరి డెస్టినేషన్‌ వెడ్డింగ్‌కి సంబంధించిన ఫోటోలు తాజాగా బయటకు వచ్చాయి. నిన్న జూలై 10న వీరి పెళ్లి అంగరం వైభవంగా జరిగినట్టు తెలుస్తుంది. కేవలం ఇరు కుటుంబ స‌భ్యులు, బంధువులు, కొద్ది మంది స‌న్నిహితుల స‌మ‌క్షంలో వరలక్ష్మి, నికోలాయ్‌ సచ్‌దేవ్‌లు మూడుమూళ్ల బంధంతో ఒక్కటయ్యారు.


తాజాగా వీరి పెళ్లి ఫోటోలు బయటకు రాగా.. ఈ కొత్త జంటకు సోషల్‌ మీడియాలో శుభకాంక్షలు వెల్లువెత్తున్నాయి. కాగా మార్చి 1న వీరి నిశ్చితార్థం జ‌రిగిన సంగ‌తి తెలిసిందే. ఈ పెళ్లి ఫోటోల్లో వరలక్ష్మి ఎరుపు రంగు చీర, ఒంటినిండ ఆభరణాలతో మెరిసిపోగా.. సచ్‌దేవ్‌ క్రిం కలర్‌ పంచకట్టులో కనిపించాడు. సంప్రదాయ బద్ధంగా జరిగిన వీరిపెళ్లిలో థాయ్‌లాండ్‌కు చెందిన వీరి సన్నిహితులు కూడా హాజరయ్యారు. వరలక్ష్మి పెళ్లికి సంబంధించిన ఫోటోలు ప్రస్తుతం నెట్టింట వైరల్‌ అవుతున్నాయి. అయితే ఇంకా వరలక్ష్మి కానీ, తన తండ్రి నుంచి అధికారిక సమాచారం రాలేదు. వరలక్ష్మి కూడా ఇంకా తన పెళ్లి ఫోటోలు షేర్‌ చేయకపోవడం గమనార్హం. 


కాగా గత కొద్ది రోజులుగా వరలక్ష్మి పెళ్లిపైనే అంత చర్చించుకుంటున్నారు. నిశ్చితార్థం సీక్రెట్‌ చేసుకున్న వరు పెళ్లయిన ముందుగా ప్రకటించి చేసుకుంటుందేమో అనుకున్నారు అంతా. పెళ్లి వేడుకులకు సంబంధించిన విశేషాలను పంచుకుంటూనే ఉంది. నెల రోజుల ముందు నుంచే ఇండస్ట్రీ వర్గాలకు తన పెళ్లి ఆహ్వాన పత్రికలను పంచుతున్న ఫోటోలు సోషల్‌ మీడియాలో పంచుకుంది. కానీ, పెళ్లి ఎప్పుడు, ఎక్కడనేది మాత్రం గొప్యంగా ఉంచింది. ఈ క్రమంలో జూలై 2న థాయ్‌లాండ్‌లో ఆమె పెళ్లి అని ముందునుంచి ఓ వార్త ప్రచారంలో ఉంది. కానీ, బుధవారం (జూలై 10) పెళ్లి చేసుకుని ట్విస్ట్ ఇచ్చింది. ఇదిలా ఉంటే నికోలాయ్‌కి ఇదివరకు పెళ్లయిన సంగతి తెలిసిందే. కవిత అనే మోడల్‌ను పెళ్లి చేసుకున్నాడు. వీరిద్దరికి మనస్పర్థలు రావడం వీడిపోయారు.



వీరికి 15 ఏళ్ల కూతురు కూడా ఉంది. ఇక విడాకులు అనంతరం ఒంటరిగా ఉంటున్న నికోలాయ్‌ వరలక్ష్మితో ప్రేమలో పడ్డాడు. కొన్నేళ్లుగా రిలేషన్‌లో ఉన్న వీరిద్దరు తాజాగా పెళ్లి బంధంతో ఒక్కటయ్యారు. ఇక వరలక్ష్మి సినిమాల విషయానికి వస్తే.. లేడీ విలన్‌గా సౌత్‌లో మంచి గుర్తింపు తెచ్చుకున్న వరలక్ష్మి మొదట హీరోయిన్‌గా పరిచయం అయ్యింది. నటుడు శరత్‌ కుమార్‌ నట వారసురాలిగా ఇండస్ట్రీలో అడుగుపెట్టింది. 'పొడా పొడి' సినిమాతో హీరోయిన్‌గా ఎంట్రీ ఇచ్చిన ఆమె తమిళంతో పాటు కన్నడ, మలయాళ భాషల్లోనూ నటించింది. ఆ తర్వాత ఆమె ఆఫర్స్‌ తగ్గడంతో సినిమాలకు కాస్తా బ్రేక్‌ తీసుకుంది. ఇక లాంగ్‌ గ్యాప్‌ తర్వాత తెలుగులో 'తెనాలి రామకృష్ణ ఎల్‌ఎల్‌బీ' సినిమాతో లేడీ విలన్‌గా రీఎంట్రీ ఇచ్చింది. ఆ తర్వాత 'జాంబి రెడ్డి', 'నాంది', 'యశోద', 'వీరసింహా రెడ్డి' వంటి సినిమాల్లోనూ విలన్‌గా నటించి తెలుగు ఆడియన్స్‌ని మెప్పించింది. 


Also Read: కూతురు క్లింకార, భార్య ఉపాసనతో ముంబైకి రామ్‌ చరణ్‌ - టాలీవుడ్‌ నుంచి ఒకేఒక్కడు.. ఎందుకో తెలుసా?