Raj Tarun Case: హీరో రాజ్ తరుణ్, లావణ్యల వివాదం గత కొన్ని నెలలుగా టాలీవుడ్ లో హాట్ టాపిక్ గా నడుస్తోంది. రాజ్ తరుణ్ తనతో సహజీవనం చేసి ఇప్పుడు వదిలించుకోవాలని చూస్తున్నాడంటూ లావణ్య అనే యువతి ఇటీవల నార్సింగి పోలీసులకు ఫిర్యాదు చేసిన సంగతి తెలిసిందే. ఈ మేరకు ఆధారాలు సమర్పించడతో రాజ్ తరుణ్ పై పోలీసులు కేసు నమోదు చేశారు. అయితే తనకు జరిగిన అన్యాయాన్ని ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ దృష్టికి తీసుకెళ్తానని లావణ్య చెబుతోంది.


లావణ్య ఓ ఇంటర్వూలో ఇంటర్వ్యూలో మాట్లాడుతూ.. "నాకు దేవుళ్లలో శివుడు అంటే చాలా ఇష్టం. అదే విధంగా మనుషులలో పవన్ కల్యాణ్ అంటే చాలా ఇష్టం. ఆయన సీఎం అవ్వాలని కోరుకున్నా. ఎంత తిట్టినా ఏం చేసినా ఆయన ఏదొక రోజు సీఎం అవుతాడనే నమ్మకం ఉంది. వాట్సాప్ డీపీల దగ్గర నుంచి కార్ల వెనక ఫోటోలు అంటించుకునే దాకా.. ఆయన సినిమా రిలీజైతే ఫస్ట్ డే పేపర్లు ఎగరేసేంత ఇష్టం ఉంది. తప్పకుండా ఆఫీస్ కు వెళ్లి ఆయన్ను కలవాలని అనుకుంటున్నాను" అని తెలిపింది.


రాజ్ తరుణ్ తనని నమ్మించి మోసం చేసి పారిపోయాడనే విషయాన్ని పవన్ కళ్యాణ్ దృష్టికి తీసుకు వెళ్లాలని అనుకుంటున్నానని లావణ్య చెప్పింది. "పవన్ కల్యాణ్ కి కూడా రెండు మూడు పెళ్లిళ్లు అయ్యాయి. ఆయన తన భార్యలకు ఎంతో ప్రాధాన్యత ఇచ్చి, విలువ ఇచ్చి గౌరవంగా బాధ్యతగానే చూసుకుని ఉంటారని నేను ఖచ్చితంగా చెప్పగలను. కానీ ఇక్కడ రాజ్ తరుణ్ అలా కాదు. నాకు, పిల్లలకు కనీసం తిండికి కూడా డబ్బులు ఇవ్వడం లేదు. అందుకే నాకు హెల్ప్ కావాలి" అని లావణ్య తెలిపింది.


"రాజ్ తరుణ్ ఇస్తున్న అలవెన్సెస్ అన్నీ ఒక్కసారిగా కట్ చేసాడు. నెట్ ఫ్లిక్స్, అమెజాన్ లాంటి అకౌంట్స్ కూడా తీసేసాడు. నాకు తోడుగా ఉండి ప్రొటెక్ట్ చెయ్యాల్సిన మనిషి ఇలా చేసాడు" అంటూ లావణ్య ఆవేదన వ్యక్తం చేసింది. రాజ్ తరుణ్ తో తనకు సెటిల్ మెంట్ ఏమీ వద్దని, దాని కోసం తాను ఇలా చేయడం లేదని తెలిపింది. ఇదంతా డబ్బు కోసమే చేస్తున్నాననే విధంగా జనాల్లోకి ఎలా నెగిటివ్ గా వెళ్లిందో తెలియడం లేదని అంటోంది. రాజ్ తరుణ్ తనకి ఇల్లు రాసిస్తానని, 15 కుక్కలు 4 పిల్లులను చూసుకోడానికి మెయింటైన్స్ ఇస్తానని చెప్పాడని లావణ్య చెబుతోంది. 
 
ఇదిలా ఉంటే రాజ్ తరణ్ 21 ఏళ్లు డేటింగ్ చేసి ఇప్పుడు తనని మోసం చేసి, హీరోయిన్ మాల్వీ మల్హోత్రాతో సహజీవనం చేస్తున్నాడని ఆరోపిస్తూ పోలీసులకు కంప్లెయింట్ చేసింది లావణ్య. దీనికి సంబంధించి తన దగ్గరున్న ఫోటోలు, వీడియోలు, కాల్ రికార్డింగ్స్, బ్యాంక్ స్టేట్మెంట్స్ ఆధారాలుగా సమర్పించింది. అంతేకాదు తనకు ఓసారి గర్భం వస్తే అబార్షన్ చేయించుకునేలా రాజ్ తరుణ్ తనపై ఒత్తిడి తీసుకొచ్చారని ఆరోపించింది. లావణ్య ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసిన పోలీసులు..  ఏ-1 గా రాజ్‌ తరుణ్‌ ను, ఏ-2గా మాల్వి మల్హోత్రా, ఏ-3గా మయాంక్‌ మల్హోత్రాలను చేర్చారు. మరోవైపు లావణ్య ఆరోపణలపై స్పందించిన రాజ్ తరుణ్, మాల్వి.. ఈ వివాదాన్ని చట్టపరంగానే పరిష్కరించుకుంటామని ఇటీవల మీడియాతో అన్నారు.


Also Read: వెంకటేష్, అనిల్ రావిపూడిల సినిమా షూటింగ్ ప్రారంభం - టాలీవుడ్‌లోకి 'యానిమల్' నటుడు ఎంట్రీ, ఇదిగో మేకింగ్ వీడియో