VenkyAnil3: 'వెంకిఅనిల్‌3' మూవీలో 'యానిమల్‌' నటుడు - సందీప్‌ రెడ్డి వంగాకు థ్యాంక్స్‌ చెప్పిన డైరెక్టర్

Animal Actor in VenkAnil3 Movie: అనిల్‌ రావిపూడి, హీరో 'విక్టరి' వెంకటేష్‌ కాంబినేషన్‌లో వస్తున్న చిత్రంలో 'యానిమల్'‌ నటుడు కీలక పాత్ర పోషిస్తున్నాడు. ఈ విషయంపై స్వయంగా డైరెక్టర్‌ క్లారిటీ ఇచ్చాడు. 

Continues below advertisement

Animal Actor Upendra Limaye On Boad in VenkyAnil3 Movie: డైరెక్టర్‌ అనిల్‌ రావిపూడి, విక్టరి వెంకటేష్‌ కాంబినేషన్‌లో మూడో సినిమా తెరకెక్కనున్న సంగతి తెలిసిందే. ఇటీవల ఈ సినిమాపై అధికారికి ప్రకటన వచ్చింది. ఇక ఈ సినిమాకు సంబంధించి తాజాగా అనిల్‌ రావిపూడి ఓ ఆసక్తికర అప్‌డేట్‌ ఇచ్చారు. ఇందులో కీలక నటించబోయే నటుడు ఎవరో చెబుతూ యానిమల్‌ డైరెక్టర్‌ సందీప్‌ రెడ్డి వంగాకు థ్యాంక్స్‌ చెప్పాడు.

Continues below advertisement

ఇంతకి అసలు విషయం ఏంటంటే.. సందీప్‌ రెడ్డి వంగా దర్శకత్వంలో బాలీవుడ్‌ హీరో రణ్‌బీర్‌ కపూర్‌, రష్మిక మందన్నా జంటగా నటించిన చిత్రం 'యానిమల్‌'. గతేడాది డిసెంబర్‌లో విడుదలైన ఈ చిత్రం ఎంతటి విజయం సాధించిందో ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. తండ్రి-కొడుకు సెంటిమెంట్‌తో ఎమోషనల్‌ డ్రామాగా వచ్చిన ఈ సినిమా పలు కాంట్రవర్సీలకు కూడా దారి తీసింది. ఇందులోని పదజాలం, రణ్‌వీర్‌ న్యూడ్‌గ కనిపించిన సన్నివేశాలపై ఓ వర్గం ప్రేక్షకులు, సామాజికి సంఘాల నుంచి అభ్యంతరాలు వ్యక్తం అయ్యాయి. అయినా కూడా యానిమల్‌ మూవీ బాక్సాఫీసు వద్ద కాసుల వర్షం కురిపించింది. సుమారు ఈ సినిమా రూ.900లకు పైగా గ్రాస్‌ వసూళ్లు చేసింది.

బ్లాక్‌బస్టర్‌ విజయం సాధించిన ఈ సినిమాలోని ఓ పాత్ర అందరిని బాగా ఆకట్టుకుంది. అదే యానిమల్‌ రణ్‌బీర్‌ కపూర్‌ స్వయంగా చేయించుకున్న గన్‌ డెలివరి చేసేందుకు వచ్చిన ఫ్రెడ్డి పాత్ర. 'వాట్‌ ఏ విజయ్‌, వాట్‌ ఏ థాట్‌' అనే డైలాగ్‌ ఆడియన్స్‌ని ఆకట్టుకున్నాడు. సోషల్‌ మీడియాలోనూ ఆయన ఫేస్‌ ఎన్నో మిమ్స్‌ పుట్టుకొచ్చాయి. కనిపించింది కాసేపే అయినా తన నటనతో ఫిదా చేశాడు. ఆయన పేరు ఉపేంద్ర లేమాయి. ఆయన మారాఠ నటుడు. తాజాగా ఆయననే తన సినిమాలో తీసుకుంటున్న అనిల్‌ రావిపూడి ప్రకటించాడు. అంతేకాదు ఇంతటి టాలంటెడ్‌ యాక్టర్‌ని మన అందరికి పరిచయం చేసిన సందీప్‌ రెడ్డి వంగాకు అనిల్‌ రావిపూడి ధన్యవాదాలు తెలిపాడు. 

జీవీ అనే అతను అనిల్‌ రావిపూడి యానిమల్‌ నటుడు ఉపేంద్ర లేమాయి.. వెంకటేష్‌-అనిరావిపూడిల మూడవ చిత్రంలో ఓ కీలక పాత్రకు తీసుకుంటున్నట్టుగా ట్వీట్‌ చేశారు. దీనికి అనిల్ రావిపూడి స్పందిస్తూ.. అవును జీవి గారు. అంతటి టాలంటెడ్‌ నటుడిని 'యానిమల్‌' చిత్రం ద్వారా మనందరికి పరిచయం చేసిన మై ఫ్రెండ్‌ సందీప్‌ రెడ్డి వంగాకు ముందుగా థ్యాంక్స్‌ చెప్పుకుంటున్నారు. ఉపేంద్ర లేమాయి మా చిత్రంలో ఓ కీలక పాత్రలో పోషించనున్నారు. ఆయన పాత్ర చాలా ఆసక్తిగా ఉంటుందని కూడా పేర్కొన్నాడు. ఇదిలా ఉంటే ఇటీవల అనిల్‌ రావిపూడి, వెంకటేష్‌ సినిమాను గ్రాండ్ లాంచ్ చేశారు. శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ లో 'దిల్' రాజు నిర్మిస్తున్న ఈ సినిమాలో వెంకటేష్ కు జోడిగా మీనాక్షి చౌదరి హీరోయిన్‌గా నటిస్తుంది.

Also Read: సోషల్‌ మీడియా కీచకుడు ప్రణీత్‌ హనుమంతుపై 'పోక్సో'‌ చట్టం - మరో ముగ్గురిపై కేసు

Continues below advertisement