Varalaxmi Sarathkumar About Vishal Political Entry: ఈరోజుల్లో సినీ సెలబ్రిటీలు ఎక్కడికి వెళ్లినా.. పాలిటిక్స్ గురించే ప్రశ్నలు ఎదురవుతున్నాయి. యంగ్ హీరోహీరోయిన్లు కూడా రాజకీయాల్లోకి ఎప్పుడు వస్తారు అనే ప్రశ్నలను ఎదుర్కోవాల్సి ఉంటుంది. ప్రస్తుతం తన అప్‌కమింగ్ మూవీ ‘శబరి’ ప్రమోషన్స్‌లో బిజీగా ఉన్న వరలక్ష్మి శరత్‌కుమార్‌కు అదే పరిస్థితి ఎదురవుతోంది. తను చేస్తున్న దాదాపు ప్రతీ ప్రమోషన్‌లో తన పెళ్లి గురించి, పాలిటిక్స్ గురించే సమాధానాలు ఇస్తూ వస్తోంది వరలక్ష్మి. అంతే కాకుండా ఒకప్పుడు తనకు, విశాల్‌కు మధ్య ఉన్న రిలేషన్‌షిప్‌ను దృష్టిలో పెట్టుకొని కూడా విశాల్‌కు సంబంధించిన ప్రశ్నలను కూడా ఎక్కువగా అడుగుతున్నారు.
మైండ్‌సెట్‌తో సంబంధం లేదు..
తాజాగా విశాల్.. ‘రత్నం’ అనే మూవీతో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. ఆ సినిమా ప్రమోషన్స్ సమయంలో రాజకీయాల గురించి, తన పొలిటికల్ ఎంట్రీ గురించి పలు ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు విశాల్. ఇప్పుడు విశాల్ పొలిటికల్ ఎంట్రీపై తన అభిప్రాయం ఏంటని వరలక్ష్మి శరత్‌కుమార్‌కు ప్రశ్న ఎదురయ్యింది. ‘‘రాజకీయాలకు మైండ్‌సెట్‌తో సంబంధం లేదు. తనకు ఓటు వేయమని జనాలను ఒప్పించాలి. అలా అయితేనే గెలుస్తారు. ఇందులో అసలు మైండ్‌సెట్ ప్రస్తావనే ఉండదు. ఒకరు వచ్చి లీడర్ అవ్వడానికి మనల్ని ఒప్పిస్తున్నారు అంటే వారు మంచి లీడర్ అవుతారు అని మనం నమ్ముతామా లేదా అన్నదే ప్రశ్న’’ అని సూటిగా తన అభిప్రాయాన్ని బయటపెట్టింది వరలక్ష్మి శరత్‌కుమార్. తన పొలిటికల్ ఎంట్రీ గురించి మాట్లాడుతూ సమయం వచ్చినప్పుడు రాజకీయాల్లోకి వస్తానని క్లారిటీ ఇచ్చింది.
నాకు నచ్చదు..
‘‘అన్నింటికి ఒక టైమ్ ఉంటుంది. యాక్టర్ అంటే యాక్టింగ్ చేయాలి. డైరెక్టర్ అంటే డైరెక్షన్ చేయాలి. అలా అన్నింటికి ఒక టైమ్ ఉంటుంది. ఒకటి తర్వాత ఒకటిగా అన్నీ జరుగుతాయి’’ అని చెప్పుకొచ్చారు వరలక్ష్మి శరత్‌కుమార్. ప్రస్తుతం ఉన్న పొలిటికల్ పార్టీల్లో దేనికైనా సపోర్ట్ చేస్తారా, ఎవరి తరపున అయినా ప్రచారం చేస్తారా అని అడగగా.. ‘‘నా పొలిటికల్ అభిప్రాయాలు బయటపెట్టడం నాకు నచ్చదు. నేను వెళ్లి ఓటు వేస్తాను అంతే’’ అని సింపుల్‌గా ఆ ప్రశ్నకు సమాధానమిచ్చింది వరలక్ష్మి.
తల్లీకూతుళ్ల అనుబంధంపై..
పెళ్లి ఎప్పుడు అనే ప్రశ్నకు కూడా వరలక్ష్మి శరత్‌కుమార్ సమాధానమిచ్చింది. సమయం వచ్చినప్పుడు జరుగుతుంది అని క్లారిటీ ఇచ్చింది. ఇక వరలక్ష్మి శరత్‌కుమార్ లీడ్ రోల్ చేస్తున్న ‘శబరి’ మూవీ మే 3న థియేటర్లలో విడుదలకు సిద్ధమయ్యింది. ఈ సినిమాలో తల్లీకూతుళ్ల అనుబంధంతో పాటు మంచి సైకలాజికల్ థ్రిల్లర్ కథను చేర్చినట్టు ఇప్పటికే మూవీ టీమ్ బయటపెట్టింది. ఇందులో వరలక్ష్మి శరత్‌కుమార్‌తో పాటు గణేష్ వెంకట్రామన్, శశాంక్, మైమ్ గోపి, సునయన, రాజశ్రీ నాయర్, మధునందన్, రషిక బాలి, వైవా రాఘవ, ప్రభు, భద్రం, కృష్ణతేజ, బిందు పగిడిమర్రి, ఆశ్రిత వేముగంటి, హర్షిని కోడూరు, అర్చన అనంత్, ప్రమోదిని బేబీ నివేక్ష, బేబీ కృతిక.. ఇతర కీలక పాత్రల్లో కనిపించనున్నారు.
Also Read: మే డే, 22 ఏళ్ల క్రితం వీడియో షేర్ చేసిన చిరంజీవి - ఆకట్టుకుంటున్న స్పెషల్ పోస్ట్