Release Date Of Varalaxmi Sarathkumar's Sabari Movie: వరలక్ష్మీ శరత్ కుమార్ జీవితంలో 2024 మెమరబుల్ ఇయర్ అవుతుందని ఎటువంటి సందేహం లేకుండా చెప్పవచ్చు. పాన్ ఇండియా సెన్సేషనల్ సక్సెస్ ఫుల్ ఫిల్మ్ 'హను-మాన్'తో ఇయర్ స్టార్టింగ్ బావుంది. మనసుకు నచ్చిన వ్యక్తిని పెళ్లాడటానికి రెడీ అయ్యింది. తమకు ఎంగేజ్‌మెంట్ అయినట్టు చెప్పింది. ఆమె జీవితంలో బ్యాక్ టు బ్యాక్ రెండు గుడ్ థింగ్స్ జరిగాయి. మేలో మరో గుడ్ న్యూస్ వినటానికి రెడీ అవుతోంది వరలక్ష్మీ శరత్ కుమార్.


మే 3న వరలక్ష్మి 'శబరి' పాన్ ఇండియా రిలీజ్
నటనకు, పాత్రకు ప్రాముఖ్యం ఉన్న క్యారెక్టర్ ఆర్టిస్ట్ రోల్స్ ఒక వైపు చేస్తూ... మరో వైపు ప్రధాన పాత్రలో సినిమాలు కూడా వరలక్ష్మీ శరత్ కుమార్ చేస్తోంది. ఆవిడ మెయిన్ లీడ్ రోల్ చేసిన సినిమా 'శబరి'. తెలుగుతో పాటు తమిళ, మలయాళ, హిందీ, కన్నడ భాషల్లో తెరకెక్కించారు. పాన్ ఇండియా ఫిల్మ్ అన్నమాట. మహా మూవీస్ పతాకంపై మహేంద్రనాథ్ కూండ్ల ప్రొడ్యూస్ చేసిన ఈ సినిమాకు మహర్షి కూండ్ల ప్రజెంటర్. అనిల్ కాట్జ్ దర్శకత్వం వహించారు. ఆయన మొదటి సినిమా ఇది. మే 3న పాన్ ఇండియా లెవల్ రిలీజ్ చేస్తున్నట్టు ప్రొడ్యూసర్ అనౌన్స్ చేశారు.


Also Readనాగ చైతన్య, అల్లు అరవింద్ సేఫ్ - కర్మ అనేది వదిలి పెట్టదురా పెట్ల!



సరికొత్త కథాంశంతో తీసిన సినిమా 'శబరి' అని ప్రొడ్యూసర్ మహేంద్రనాథ్ కూండ్ల తెలిపారు. ఇంకా ఆయన మాట్లాడుతూ... ''స్ట్రాంగ్ ఎమోషన్స్ ఉన్న థ్రిల్లర్ ఫిల్మ్ 'శబరి'. వరలక్ష్మీ శరత్ కుమార్ గారితో మేం ఈ సినిమా చెయ్యడం మాకు చాలా సంతోషంగా ఉంది. ఇప్పటి వరకు ఆవిడ నటించిన సినిమాలకు కంప్లీట్ డిఫరెంట్ సినిమా ఇది. వరలక్ష్మి గారి నటన చూశాక ఆడియన్స్ 'వావ్' అంటారు. ఐదు భాషల్లో ఫస్ట్ కాపీ రెడీ అయ్యింది. ఆల్రెడీ 'వరల్డ్ ఆఫ్ శబరి' పేరుతో విడుదల చేసిన వీడియోకి ఫెంటాస్టిక్ రెస్పాన్స్ వచ్చింది. మే 3న దేశవ్యాప్తంగా చిత్రాన్ని విడుదల చేస్తున్నాం. అందరికీ సినిమా నచ్చుతుందనే నమ్మకం ఉంది'' అని అన్నారు.


Also Readఆ హిట్ సినిమాలు మిక్సీలో వేస్తే వచ్చిన కిచిడీ 'ఫ్యామిలీ స్టార్' - రామ రామ... ఏంటిది పరశురామా?



వరలక్ష్మీ శరత్ కుమార్ ప్రధాన పాత్రలో తెరకెక్కిన 'శబరి' సినిమాలో గణేష్ వెంకట్రామన్, శశాంక్, 'మైమ్' గోపి, సునయన, రాజశ్రీ నాయర్, మధునందన్, రషిక బాలి (Bombay), 'వైవా' రాఘవ (హర్ష చెముడు), ప్రభు, భద్రమ్, కృష్ణతేజ, బిందు పగిడిమర్రి, ఆశ్రిత వేముగంటి (బాహుబలి - యాత్ర ఫేమ్), హర్షిని కోడూరు, అర్చన అనంత్, ప్రమోదిని బేబీ నివేక్ష, బేబీ కృతిక ఇతర ప్రధాన తారాగణం. 'శబరి' చిత్రానికి రచనా సహకారం: సన్నీ నాగబాబు, పాటలు: రహమాన్ - మిట్టపల్లి సురేందర్, ప్రొడక్షన్ ఎగ్జిక్యూటివ్: లక్ష్మీపతి కంటిపూడి, పోరాటాలు: నందు - నూర్, నృత్య దర్శకత్వం: సుచిత్ర చంద్రబోస్ - రాజ్ కృష్ణ, కళా దర్శకుడు: ఆశిష్ తేజ పూలాల, కూర్పు: ధర్మేంద్ర కాకరాల, ఛాయాగ్రహణం: రాహుల్ శ్రీవాత్సవ - నాని చమిడిశెట్టి, ఎగ్జిక్యూటివ్ నిర్మాత: సీతారామరాజు మల్లెల, సంగీతం: గోపీసుందర్, సమర్పణ: మహర్షి కూండ్ల, నిర్మాత: మహేంద్ర నాథ్ కూండ్ల, కథ - కథనం - మాటలు - దర్శకత్వం: అనిల్ కాట్జ్.