After the success of Tillu Square, Anupama Parameswaran strategically signs new films: 'టిల్లు స్క్వేర్'లో అనుపమ పరమేశ్వరన్ కొత్తగా కనిపించారు. సినిమా విడుదలకు ముందు ట్రైలర్, పోస్టర్లలో ఆవిడ గ్లామర్ షో గురించి జరిగిన రచ్చ అంతా ఇంతా కాదు. 'టిల్లు స్క్వేర్' తర్వాత అనుపమ ఏ హీరోతో సినిమా చేస్తుందా? గ్లామర్ రోల్స్ కంటిన్యూ చేస్తుందా? లేదా? అని ఆడియన్స్, ఫ్యాన్స్ ఆమె అప్ కమింగ్ మూవీస్ కోసం వెయిట్ చేస్తున్నారు. అనుపమ సైన్ చేస్తున్న ఫిలిమ్స్ చూస్తుంటే స్ట్రాటజీ ఛేంజ్ చేసినట్టు ఉన్నారు.


బ్యాక్ టు కేరళ... మాలీవుడ్ ఫిలిమ్స్!
Anupama Parameswaran goes to Mollywood: అనుపమ పరమేశ్వరన్ మలయాళీ అమ్మాయి. కెరీర్ కూడా మలయాళ బ్లాక్ బస్టర్ 'ప్రేమమ్'తో స్టార్ట్ చేసింది. వెంటనే 'జేమ్స్ & ఆలిస్'లో గెస్ట్ రోల్ చేసింది. ఆ సినిమా రిలీజ్ అయ్యాక 'అ ఆ' మూవీతో తెలుగు ఫిల్మ్ ఇండస్ట్రీకి వచ్చింది. అప్పటి నుంచి తెలుగు ఫిలిమ్స్ ఎక్కువ చేసింది. మధ్యలో రెండు మూడు మలయాళ ఫిలిమ్స్ చేసిందంతే. ఇప్పుడు మళ్ళీ మాలీవుడ్ మీద కాన్సంట్రేట్ చేసినట్టు ఉన్నారు.


'టిల్లు స్క్వేర్' ట్రైలర్స్, వాటిలో అనుపమ గ్లామర్ షో చూసి నెక్స్ట్ నుంచి ఆవిడ అటువంటి రోల్స్ చేస్తారని ఎక్స్‌పెక్ట్ చేశారంతా. కానీ, అనుపమ అలా చెయ్యడం లేదు. రెండు మలయాళ సినిమాలకు సైన్ చేసింది. అందులో సీనియర్ హీరో సురేష్ గోపి ఫిల్మ్ ఒకటి. ఇప్పుడు ఇంకో సినిమా అనౌన్స్ చేసింది.


Also Readనాగ చైతన్య, అల్లు అరవింద్ సేఫ్ - కర్మ అనేది వదిలి పెట్టదురా పెట్ల!



'ది పెట్ డిటెక్టివ్'లో అనుపమ!
Anupama Parameswaran next movie in Malayalam: అనుపమ పరమేశ్వరన్ ఈ రోజు సోషల్ మీడియాలో మలయాళ ఫిల్మ్ 'ది పెట్ డిటెక్టివ్' పోస్టర్ రిలీజ్ చేసింది. నెక్స్ట్ ఫిల్మ్ అని చెప్పింది. అందులో యాక్ట్ చేస్తుందని మీనింగ్ అన్నమాట. మలయాళ సినిమాల్లో యాక్టింగ్ స్కోప్ ఎక్కువ. గ్లామర్ రోల్స్ తక్కువ. 'టిల్లు స్క్వేర్' పబ్లిసిటీ ప్రోగ్రాముల్లో గ్లామర్ రోల్స్ గురించి అనుపమ క్లారిటీ ఇచ్చింది. బిర్యానీ ఇష్టమని రోజూ తినలేమని, మధ్య మధ్యలో తింటామన్నట్టు చెప్పుకొచ్చింది. 'టిల్లు స్క్వేర్'లో గ్లామర్ రోల్ వేరియేషన్ కోసం అన్నమాట. తన యాక్టింగ్ ప్రూవ్ చేసుకోవడం కోసం మాలీవుడ్ ఫిలిమ్స్ సైన్ చేసిందని ఇండస్ట్రీ అనలిస్టుల అభిప్రాయం.


Also Readఆ హిట్ సినిమాలు మిక్సీలో వేస్తే వచ్చిన కిచిడీ 'ఫ్యామిలీ స్టార్' - రామ రామ... ఏంటిది పరశురామా?






అనుపమకు క్యూ కడుతున్న టాలీవుడ్ ఆఫర్లు!'టిల్లు స్క్వేర్' తర్వాత అనుపమ పరమేశ్వరన్ మీద టాలీవుడ్ కన్ను పడింది. కొత్త సినిమాల్లో ఆమెను తీసుకోవాలని రైటర్స్, డైరెక్టర్స్, ప్రొడ్యూసర్స్ ట్రై చేస్తున్నారు. కానీ అనుపమ స్క్రిప్ట్స్ విషయంలో చూజీగా ఉంటోందట. అనుపమ నెక్స్ట్ టాలీవుడ్ ఫిల్మ్ ఏదో తెలుసుకోవాలంటే కొన్ని రోజులు వెయిట్ చెయ్యక తప్పదు. ప్రజెంట్ ఈ రింగుల జుట్టు అమ్మాయి చేతిలో రెండు మాలీవుడ్ ఫిలిమ్స్ ఉన్నాయి. ఆ రెండు ఈ ఇయర్ రిలీజ్ అవుతాయి.