Urvashi Rautela Bathroom Video Leaked: ఎన్నో తెలుగు సినిమాల్లో, చిరంజీవి, ప‌వ‌న్ క‌ల్యాణ్ లాంటి ప్ర‌ముఖ హీరోల సినిమాల్లో ఐట‌మ్ సాంగ్స్ తో అద‌ర‌గొట్టిన బాలీవుడ్ బ్యూటీ ఊర్వశి రౌతెలా. ఎన్నో కాంట్ర‌వ‌ర్సీల్లో ఇరుక్కుంది ఈ భామ‌. ఎప్పుడూ సెన్సేష‌న్స్ క్రియేట్ చేస్తూనే ఉంటుంది. ఇక ఇప్పుడు ఆమె మ‌రోసారి ఇంట‌ర్నెట్ సెన్సేష‌న్ అయ్యింది. ఆమెకు సంబంధించి ఒక వీడియో ఇప్పుడు నెట్టింట వైర‌ల్ అవుతోంది. అది కూడా మాములు వీడియో కాదు.. ఆమెకు సంబంధించిన ఒక బాత్‌రూమ్ వీడియో. దీంతో ఇప్పుడు నెట్టింట పెద్ద ర‌చ్చ న‌డుస్తుంది. కొంత‌మంది నెటిజ‌న్లు ఆమె మీద ఫైర్ అవుతుంటే.. ఇంకొంత‌మంది మాత్రం అయ్యో పాపం అంటున్నారు. అస‌లు ఏం జ‌రిగిందంటే? 


వైర‌ల్ వీడియో..


ఊర్వ‌శి రౌతెలా ఎప్పుడూ వార్త‌ల్లో నిలుస్తూనే ఉంటుంది ఈ భామ. రిష‌బ్ పంత్ పై కామెంట్లు, ఆ త‌ర్వాత బంగారు కేక్ కోయ‌డం లాంటి విష‌యాల్లో ఇప్ప‌టికే చాలాసార్లు వార్త‌ల్లోకి ఎక్కారు. ఇక ఇప్పుడు ఆమె ఒక వీడియో ద్వారా మ‌రోసారి వైర‌ల్ అయ్యారు. ఆమె బాత్ రూమ్ లోకి రావ‌డం, ఆ తర్వాత తన డ్రెస్ విప్పడానికి ప్రయత్నించ‌డం అంతా ఆ వీడియోలో ఉంది. స‌రిగ్గా కుర్తా విప్పిన తర్వాత సడెన్ గా వీడియో ఆగిపోయింది. ఈ వీడియో సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది. 


చెత్త ప‌బ్లిసిటీ.. 






ఇక ఈ వీడియో చూసిన నెటిజ‌న్లు.. ఆమెపై ఫైర్ అవుతున్నారు. ఇవ‌న్నీ ప‌బ్లిసిటీ స్టంట్లు అంటూ కామెంట్లు పెడుతున్నారు. ఇలాంటి చెత్త ప‌బ్లిసిటీ స్టంట్ తాము ఎప్పుడూ చూడ‌లేద‌ని మండిప‌డుతున్నారు. ఇంకొంత‌మంది మాత్రం ఆమె ప్రైవేట్ వీడియో బ‌య‌టికి రావ‌డం ఏంటి? ఈ ప‌ని ఎవ‌రు చేశారో శిక్షించాలి అంటూ కామెంట్లు పెడుతున్నారు. ఊర్వ‌శి మెడ‌లో తాలిబొట్టు ఉంది. దీన్ని బ‌ట్టి చూస్తుంటే ఆమె రాబోయే సినిమా కోసం ఇది క‌చ్చితంగా ప‌బ్లిసిటీ అయ్యి ఉంటుంది. త్వ‌ర‌లోనే దీనికి సంబంధించి వివ‌ర‌ణ ఇస్తారు అంటూ రాసుకొచ్చారు చాలామంది. ఈ రోజుల్లో ఇలాంటి చెత్త ప‌బ్లిసిటీలు కామ‌న్ అయిపోయాయి అంటూ తిడుతున్నారు ప్రేక్ష‌కులు. అయితే, దీనిపై ఆమె సోష‌ల్ మీడియా టీమ్, ఆమె ఎవ్వ‌రూ స్పందించ‌లేదు. ఎలా జ‌రిగిందో కూడా వివ‌ర‌ణ ఇవ్వ‌లేదు. 


ఇక సినిమాల విష‌యానికొస్తే.. ప్ర‌స్తుతం ఆమె బాలకృష్ణ నటిస్తున్న ఎన్‌బీకే 109లోనూ కనిపించనుంది. దాంతో పాటు బ్లాక్ రోజ్ అనే మరో తెలుగు సినిమా కూడా ఆమె చేస్తోంది. వాటితో పాటు చాలా వెబ్ సిరీస్ లలోనూ నటిస్తోంది. గ‌తంలో చాలా ఐట‌మ్ సాంగ్స్ లో న‌టించింది ఈ భామ‌. అలా కోట్లామంది ఫ్యాన్స్ ని సంపాదించుకుంది. త‌న పుట్టిన రోజుకి మూడు కోట్ల రూపాయ‌ల విలువ చేసే బంగారు కేక్ క‌ట్ చేసి ఫేమ‌స్ అయ్యింది. ఇక ఇప్పుడు ఈ బాత్ రూమ్ వీడియో లీక్ తో మ‌రోసారి వార్త‌ల్లో నిలిచింది. 


Also Read: ఇండస్ట్రీలో అడుగుపెట్టి 20ఏళ్లు అవుతోంది..ఇప్పటికీ అదే లుక్ తో మెస్మరైజ్ చేస్తోన్న ఆండ్రియా!