డేరింగ్ అండ్ డైనమిక్ స్టార్ విష్ణు మంచు (Vishnu Manchu) కథానాయకుడిగా రూపొందుతున్న భారీ మైథలాజికల్ ఫాంటసీ ఫిల్మ్ 'కన్నప్ప' (Kannappa Movie). ఇది ఆయన డ్రీమ్ ప్రాజెక్ట్ కావడంతో ఏ విషయంలోనూ రాజీ పడటం లేదు. ఒక్కో పాత్రకు పేరున్న నటీనటులను తీసుకోవడం నుంచి టెక్నికల్ పరంగానూ హై స్టాండర్డ్స్ మైంటైన్ చేస్తున్నారు. ఇంత జాగ్రత్త తీసుకుని చేస్తున్న సినిమాను ప్రేక్షకుల ముందుకు ఎప్పుడు తీసుకు వస్తారు? ఆ విషయం ఈ రోజు అధికారికంగా వెల్లడించారు.


డిసెంబర్ 2024లో 'కన్నప్ప' విడుదల!
Vishnu Manchu Tweet On Kannappa Release: ఈ ఏడాది (2024) ఎండింగ్‌లో 'కన్నప్ప' విడుదల అవుతుందని జూన్ నెలలో వార్తలు వచ్చాయి. ఇప్పుడు ఆ విషయాన్ని సోషల్ నెట్వర్కింగ్ సైతం 'ఎక్స్' (ట్విట్టర్) ద్వారా విష్ణు మంచు కన్ఫర్మ్ చేశారు. 'డిసెంబర్ 2024 కన్నప్ప. హర హర మహాదేవ్' అని ఆయన పేర్కొన్నారు.


డిసెంబర్ నెలలో 'కన్నప్ప'ను ప్రేక్షకుల ముందుకు తీసుకు వస్తామని విష్ణు మంచు చెప్పారు కానీ... ఏ తేదీన థియేటర్లలోకి వస్తామనేది మాత్రం ఆయన చెప్పలేదు. డిసెంబర్ 6న 'పుష్ప: ది రూల్' విడుదల చేయనున్నట్లు కొన్ని రోజుల క్రితం అనౌన్స్ చేశారు. అయితే, ఇప్పుడు ఆ సినిమా విడుదల వాయిదా పడే ఛాన్స్ ఉందని రూమర్లు వినబడుతున్నాయి. ఈ తరుణంలో విష్ణు మంచు 'కన్నప్ప' రిలీజ్ డేట్ కన్ఫర్మ్ చేయడం విశేషం.


Also Readడార్లింగ్ ఫస్ట్ రివ్యూ... నభాతో ప్రియదర్శి పెళ్లి కష్టాలు, ఆ కామెడీ సీన్లు ఎలా ఉన్నాయంటే?






'కన్నప్ప' చిత్రాన్ని అవా ఎంటర్‌టైన్‌మెంట్స్, 24 ఫ్రేమ్స్ ఫ్యాక్టరీ సంస్థల మీద లెజెండరీ నటుడు, 'పద్మ శ్రీ' పురస్కార గ్రహీత డా. మోహన్ బాబు ప్రొడ్యూస్ చేస్తున్నారు. దీనికి ముఖేష్ కుమార్ సింగ్ దర్శకత్వం వహిస్తున్నారు. స్టీఫెన్ దేవస్సీ సంగీతం అందిస్తుండగా... రెబల్ స్టార్ ప్రభాస్, మలయాళ మెగాస్టార్ మోహన్ లాల్, బాలీవుడ్ ఖిలాడీ అక్షయ్ కుమార్, మోహన్ బాబు, బ్రహ్మానందం, ప్రీతి ముకుందన్, కాజల్ అగర్వాల్ వంటి భారీ తారగణం కీలక పాత్రల్లో నటించారు.


Also Readబాహుబలి నటుడు నిర్మించిన సినిమా... పేకమేడలు ఫస్ట్ రివ్యూ... మిడిల్ క్లాస్ ఎమోషన్స్ ప్లస్ ఫుల్ కామెడీతో ఎలా ఉందో తెల్సా?



తిన్నడు వాడిన విల్లు గురించి తెలుసా?
Vishnu Manchu Role In Kannappa Movie: 'కన్నప్ప' సినిమాలో తిన్నడు పాత్రలో విష్ణు మంచు నటించారు. ఆల్రెడీ విడుదలైన టీజర్ చూస్తే... ఆయన చేతిలో ఒక ప్రత్యేకతతో కూడిన విల్లు ఉంటుంది. దాని విశిష్టత గురించి కొన్ని రోజుల క్రితం విష్ణు వివరించారు. ''ఆ విల్లు ఓ ఆయుధం మాత్రమే కాదు... ధైర్యానికి, తండ్రీ కొడుకుల మధ్య బంధానికి సూచిక. కన్నప్ప తండ్రి నాధనాథ చేతులతో తయారు చేసిన ఆ విల్లు కుటుంబ వారసత్వ ప్రతీక కూడా! ఆ విల్లుతోనే యుద్ధభూమిలో కన్నప్ప అసమాన పోరాట ప్రతిభ, బహుముఖ ప్రజ్ఞ ప్రదర్శిస్తారు. ఐదేళ్ల వయసులో అడవిలో క్రూరమైన పులిని సాధారణ కర్రతో ఎదుర్కొన్న తన కుమారుడి ధైర్య సాహసాలు చూసి నాధనాథ ప్రత్యేకమైన విల్లు తయారు చేస్తాడు. పులి ఎముకలు, దంతాలతో చేసిన ఆ విల్లును రెండుగా విరిస్తే కత్తులు తరహాలో ఉంటాయి. దాంతో యుద్ధంలో పోరాడవచ్చు'' అని తెలిపారు. న్యూజిలాండ్‌ దేశానికి చెందిన కళా దర్శకుడు క్రిస్ దానిని తయారు చేశారని చెప్పారు.