డార్లింగ్ అంటే తెలుగు ఆడియన్స్ అందరికీ ముందుగా గుర్తుకు వచ్చే పేరు రెబల్ స్టార్ ప్రభాస్. ఆయన్ను అభిమానులు ముద్దుగా 'డార్లింగ్' అని పిలుస్తారు. ఆయన కూడా సన్నిహితులను అలాగే పిలుస్తారు. ఆ పేరుతో ఓ సినిమా కూడా చేసారు. ఆ టైటిల్ మరోసారి ప్రేక్షకుల ముందుకు వస్తోంది. 


టాలెంటెడ్ ఆర్టిస్ట్ కమ్ కథానాయకుడు ప్రియదర్శి పులికొండ (Priyadarshi Pulikonda) నటించిన తాజా సినిమా 'డార్లింగ్' (Darling Movie 2024). ఇందులో నభా నటేష్ (Nabha Natesh) హీరోయిన్. 'హనుమాన్' వంటి భారీ పాన్ ఇండియన్ బ్లాక్ బస్టర్ అందించిన ప్రైమ్ షో ఎంటర్‌టైన్‌మెంట్ పతాకంపై కె నిరంజన్ రెడ్డి, ఆయన సతీమణి చైతన్య రెడ్డి నిర్మించారు. జూలై 19న... అంటే ఈ శుక్రవారం 'డార్లింగ్' థియేటర్లలోకి వస్తోంది. ఒక్క రోజు ముందు ప్రీమియర్ షోలు వేస్తున్నారు. అంత కంటే ముందు కొంత మంది సినిమా చూశారు. వాళ్ళు చెప్పిన దాని ప్రకారం ఈ సినిమా ఎలా ఉందో చూడండి. 


ప్రియదర్శి, నభా నటేష్ క్యారెక్టర్లు ఏమిటంటే?
Nabha Natesh and Priyadarshi characters in Darling: 'డార్లింగ్' (2024) సినిమాలో హీరో హీరోయిన్ల క్యారెక్టర్ల విషయానికి వస్తే... రాఘవ్ (ప్రియదర్శి పులికొండ) ఒక ట్రావెల్ ఏజెన్సీలో ఉద్యోగి. పెళ్లైన తర్వాత భార్యతో కలిసి హనీమూన్ టూర్ కోసం పారిస్ వెళ్లాలని కలలు కంటూ ఉంటాడు. అటువంటి యువకుడు అనుకోని పరిస్థితుల్లో ఆనంది (నభా నటేష్)ను పెళ్లి చేసుకోవాల్సి వస్తుంది. ఆమెకు స్ప్లిట్ పర్సనాలిటీ ఉంది. ఒక్క ముక్కలో చెప్పాలంటే లేడీ అపరిచితురాలు. అటువంటి అమ్మాయిని పెళ్లి చేసుకున్న తర్వాత ఆనంద్ ఎన్ని కష్టాలు పడ్డాడు? అనేది సినిమా చూసి తెలుసుకోవాలి. 


క్లీన్ కామెడీ ఎంటర్‌టైనర్... ఎమోషనల్ క్లైమాక్స్!
Darling Movie 2024 First Review: కుటుంబం అంతా కలిసి చూసే క్లీన్ కామెడీ ఫ్యామిలీ ఎంటర్‌టైనర్ 'డార్లింగ్' అని సినిమా చూసిన ఇండస్ట్రీ జనాలు చెబుతున్నారు. భార్య భర్తల నేపథ్యంలో కొన్ని సినిమాలు తెలుగులో వచ్చినప్పటికీ... 'డార్లింగ్'లో టచ్ చేసిన పాయింట్ ఇప్పటి వరకు ఎవరూ టచ్ చేయలేదని, లేడీ అపరిచితురాలు కాన్సెప్ట్ నేపథ్యంలో వచ్చిన కామెడీ సీన్లు అన్నీ హిలేరియస్ ఉన్నాయని చెబుతున్నారు.


Also Read: బాహుబలి నటుడు నిర్మించిన సినిమా... పేకమేడలు ఫస్ట్ రివ్యూ... మిడిల్ క్లాస్ ఎమోషన్స్ ప్లస్ ఫుల్ కామెడీతో ఎలా ఉందో తెల్సా?


స్ప్లిట్ పర్సనాలిటీ కాన్సెప్ట్, కామెడీకి తోడు క్లైమాక్స్ బాగా వర్కవుట్ అయ్యిందట. అక్కడ డిస్కస్ చేసిన ఎమోషనల్ పాయింట్ అందరినీ ఆలోచింపజేసేలా ఉందని తెలిసింది. ప్రియదర్శి కామెడీ టైమింగ్, నటన పలు సన్నివేశాలకు బలంగా నిలిచిందని 'డార్లింగ్' (2024) చూసిన జనాలు చెబుతున్నారు. నభా నటేష్ సైతం యాక్షన్ సీన్లలో ఇరగదీశారట. వివేక్ సాగర్ పాటలు, నేపథ్య సంగీతం సైతం అందరికీ ఆకట్టుకునేలా ఉన్నాయి.


Also Readబికినీలో రామ్ చరణ్ హీరోయిన్ అందాల విందు... బాబోయ్ ఇప్పుడు హాట్ కంటే పెద్ద పదం వెతకలేమో, ఈ హీరోయిన్ మీకు తెలుసా?