Andrea Jeremiah: ఇండస్ట్రీలో అడుగుపెట్టి 20ఏళ్లు అవుతోంది..ఇప్పటికీ అదే లుక్ తో మెస్మరైజ్ చేస్తోన్న ఆండ్రియా!
రెండు దశాబ్ధాల క్రితం కందనాల్ ముదల్ మూవీతో వెండితెరపై అడుగుపెట్టింది ఆండ్రియా జెరెమియా. హీరోయిన్ గా వెలుగుతూనే సింగర్ గానూ రాణించింది. మల్టీ ట్యాలెంట్స్ తో కెరీర్లో బిజీగా ఉంది.
కోలీవుడ్ తో పాటూ టాలీవుడ్ లోనూ బిజీగా ఉన్న ఆండ్రియా.. సోషల్ మీడియాలో చాలా యాక్టివ్ గా ఉంటుంది. రీసెంట్ గా షేర్ చేసిన ఫొటోస్ చూసిన నెటిజన్లు లేడీ బాస్ లా భలేఉందంటున్నారు
ప్రస్తుతం ఆండ్రియా చేతిలో దాదాపు పది ఆఫర్ల వరకూ ఉన్నాయని టాక్. మరోవైపు సింగర్ గా షోస్ లోనూ బిజీగా ఉంటోంది. హారర్ స్టోరీలు, లేడీ ఓరియెంటెడ్ కథలకు గ్రీన్ సిగ్నల్ ఇస్తోంది
‘యుగానికి ఒక్కడు’సినిమాతో హిట్టందుకున్న ఆండ్రియా ఆ తర్వాత హీరో సిద్ధార్థ్‌తో కలిసి ‘గృహం’ సినిమాలో హాట్‌గా కనిపించింది. ఆ తర్వాత టాలీవుడ్ లో నేరుగా ‘తడాఖా’లో నటించింది.
కమల్ హాసన్ విశ్వరూపం, విశ్వరూపం 2 సినిమాలతో మరింత పాపులారిటీ సంపాదించుకుంది. ఆ తర్వాత కోలీవుడ్ లో బిజీగా మారిపోయింది.
Andrea Jeremiah (Image credit: Instagram)