Urvashi Rautela Birthday: సినీ సెలబ్రిటీలపై కొందరు చూపించే అభిమానానికి హద్దులు ఉండవు. తాజాగా బాలీవుడ్ భామ ఊర్వశి రౌతెలా చేత ఏకంగా రూ.3 కోట్ల కేక్‌ను కట్ చేయించాడు తన కో స్టార్. ఈ విషయం తెలిసి ప్రేక్షకులంతా ఆశ్చర్యపోతున్నారు. తాజాగా తన 30వ పుట్టినరోజును సెలబ్రేట్ చేసుకుంది ఊర్వశి. ఆ సందర్భంగా తన చేత ఏకంగా 24 క్యారెట్ గోల్డ్ కేక్‌ను గిఫ్టుగా ఇచ్చాడు మ్యూజిక్ ఆల్బమ్ ప్రొడ్యూసర్, నటుడు యో యో హనీ సింగ్. ఈ విషయం విని నెటిజన్లు షాక్ అవుతున్నారు. అసలు గోల్డ్‌తో కేక్ ఏంటి పిచ్చి కాకపోతే అని విమర్శిస్తున్నారు కూడా. ఇక ఈ విషయంపై యో యో హనీ సింగ్ స్పందించాడు. ఊర్వశి కూడా దీనికి సంబంధించిన ఫోటోలను తన సోషల్ మీడియాలో షేర్ చేసింది.


అందుకోసమే ఆ కేక్..


ఊర్వశి రౌతెలాకు బాలీవుడ్‌లో సెపరేట్ క్రేజ్ ఉంది. తను ఎక్కువగా సినిమాల్లో కనిపించినా.. కనిపించకపోయినా.. తన ఫ్యాన్ ఫాలోయింగ్ మాత్రం తగ్గడం లేదు. అలాంటి ఊర్వశి తాజాగా తన 30వ ఏట అడుగుపెట్టింది. ‘లవ్ డోస్ 2’ సాంగ్ సెట్స్‌లో తన పుట్టినరోజు జరిగింది. దానికి సంబంధించిన కేక్ కటింగ్ ఫోటోలను సోషల్ మీడియాలో షేర్ చేయగా.. ఆ కేక్‌ను చూసి వెరైటీగా ఉందని నెటిజన్లు అనుకున్నారు. కానీ దాని ధర రూ.3 కోట్లు అని తెలిసి ఆశ్చర్చపోయారు. ఈ విషయంపై హనీ సింగ్ స్పందించాడు. ‘‘ఈ స్పెషల్ సందర్భాన్ని మరింత స్పెషల్‌గా చేయడం కోసం తనకు రూ.3 కోట్ల కేక్ ప్రజెంట్ చేయాలని నిర్ణయించుకున్నాను’’ అని చెప్పుకొచ్చాడు.


అద్భుతమైన నటి..


‘‘ఈ కేక్ కటింగ్ అనేది చరిత్రలో నిలిచిపోవాలని, ఏ కో స్టార్ తన సహ నటుల కోసం చేయలేనిది చేసి చూపించాలని అనుకున్నాను. ఊర్వశి అద్భుతమైన నటి. ఇలాంటి ట్రీట్మెంట్‌కు తను అర్హురాలు’’ అని ఊర్వశిపై ప్రశంసలు కురిపించాడు యో యో హనీ సింగ్. ఊర్వశి రౌతెలా తన బర్త్‌డేకు రూ.3 కోట్ల ధర గల 24 క్యారెట్ గోల్డ్ కేక్‌ను కట్ చేయగా నెటిజన్లు దీనిపై ఫన్నీగా స్పందిస్తున్నారు. ‘అసలు ఈ కేక్‌ను తినాలా? దాచిపెట్టుకోవాలా?’ అని ఒకరు ప్రశ్నించగా.. ‘3 కోట్ల కేక్‌ను మర్డర్ చేసింది’ అని మరొకరు అంటున్నారు. అసలు ఇంత ఖర్చుపెట్టి కేక్ కొనడం ఎందుకు డబ్బులు వేస్ట్ అని మరకొందరు తమ అభిప్రాయాలను వ్యక్తం చేస్తున్నారు.


మాటలు రావడం లేదు..


తన బర్త్‌డే సెలబ్రేషన్, గోల్డ్ కేక్ కటింగ్ ఫోటోలను ఊర్వశి రౌతెలా తన ఇన్‌స్టాగ్రామ్‌లో షేర్ చేస్తూ హనీ సింగ్‌కు థ్యాంక్స్ చెప్పుకొచ్చింది. ‘లవ్ డోస్ 2 సెట్స్‌లో బర్త్ డే సెలబ్రేషన్స్. థ్యాంక్యూ హనీ సింగ్. నీ ప్రయాణంలో నీ పరిచయానికి ఎప్పటికీ రుణపడి ఉంటాను. నాపై నువ్వు చూపించే ఆప్యాయత నా కెరీర్‌లో మర్చిపోలేని చాప్టర్‌గా గుర్తుండిపోతుంది. నీపై నా ఎమోషన్స్‌ను చెప్పడానికి మాటలు సరిపోవడం లేదు’ అని క్యాప్షన్ కూడా పెట్టింది ఊర్వశి. ‘లవ్ డోస్’ అనే పాట ఊర్వశి కెరీర్‌ను మలుపు తిప్పింది. ఆ పాట వల్లే తనకు బాలీవుడ్‌లో ఎన్నో అవకాశాలు వచ్చాయి. ఇప్పుడు అదే పాటకు హనీ సింగ్‌తో కలిసి సీక్వెల్ చేస్తోంది.






Also Read: రాశీఖన్నా చెయ్యి పట్టుకుని నడిచిన నటి కియరా భర్త - వారి కెమిస్ట్రీ చూసి కుళ్లుకుంటున్న నెటిజన్స్