Sidharth Malhotra and Kiara Advani: బాలీవుడ్‌లో క్యూట్ కపుల్‌గా పేరు తెచ్చుకున్నవారిలో సిద్ధార్థ్ మల్హోత్రా, కియారా అద్వానీ కూడా ఒకరు. వీరు కలిసి నటించిన ‘షెర్షా’ సినిమాలో ఈ ఇద్దరి కెమిస్ట్రీకి మంచి మార్కులే పడ్డాయి. ఆన్ స్క్రీన్ మాత్రమే కాదు.. ఆఫ్ స్క్రీన్ కూడా వీరి కెమిస్ట్రీ వర్కవుట్ అయ్యింది. అందుకే ప్రేమించి పెళ్లి కూడా చేసుకున్నారు. పెళ్లి తర్వాత ఎవరి సినిమాల్లో వారు బిజీ అయిపోయారు. ప్రస్తుతం సిద్ధార్థ్ మల్హోత్రా చేసిన పనికి కియారా ఫ్యాన్స్ డిసప్పాయింట్ అవుతున్నారు. తన అప్‌కమింగ్ మూవీ ‘యోధ’ ప్రమోషన్స్‌లో బిజీగా ఉన్న సిద్ధార్థ్.. హీరోయిన్ రాశీ ఖన్నాతో కలిసి జైపూర్‌లో చక్కర్లు కొడుతున్నాడు.


ప్రమోషన్స్‌ సమయంలోనే..


సిద్ధార్థ్ మల్హోత్రా, రాశీ ఖన్నా కాంబినేషన్‌లో తెరకెక్కిన సినిమానే ‘యోధ’. ఈ మూవీలోని మొదటి పాట ‘జిందగీ తేరే నామ్’ లాంచ్ కోసం జైపూర్‌కు వెళ్లింది మూవీ టీమ్. ఇక ప్రమోషన్స్ కోసం జైపూర్‌లో ల్యాండ్ అవ్వగానే రాశీ చేయి పట్టుకొని నడిచాడు సిద్ధార్థ్. దానికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది. ఈ విషయం నచ్చని కియారా ఫ్యాన్స్.. సిద్దార్థ్‌ను విమర్శిస్తున్నారు. సిద్ధార్థ్ చేయి పట్టుకోవడానికి రాశి ముందుకొచ్చింది. వారిద్దరూ చేతులు పట్టుకొని నడిచింది కాసేపే అయినా.. ఇది చాలామంది నెటిజన్లకు నచ్చలేదు. దీనిపై వివిధ రకాలుగా కామెంట్స్ కూడా పెడుతున్నారు.


కొందరి సపోర్ట్..


‘ఆన్ స్క్రీన్ కలిసి నటిస్తే ఆఫ్ స్క్రీన్ చేతులు పట్టుకొని నడవాల్సిన అవసరం ఏముంది’ అంటూ రాశి ఖన్నా ప్రవర్తనను ఒక నెటిజన్ విమర్శించగా.. మరొకరు మాత్రం ‘సిద్ధార్థ్ చాలా డీసెంట్. అందుకే రాశి తన చేయి పట్టుకోగానే వెంటనే వదిలించుకోకుండా ముందుగా తన చేయి పట్టుకొని తర్వాత వదిలేశాడని’ అన్నారు. ఈ విషయంపై ఒక్కొక్కరు ఒక్కొక్కరిగా విమర్శిస్తున్నారు. ఇక ఎదురవుతున్న విమర్శల విషయంలో సిద్థార్థ్ ఫ్యాన్స్.. తనకు సపోర్ట్‌గా మాట్లాడుతున్నారు. పెళ్లయితే వారి ఆఫ్ స్క్రీన్‌లో చేస్తున్న ప్రతీ విషయాన్ని గమనిస్తూ ఉండడం, వాటిపై విమర్శలు చేయడం కరెక్ట్ కాదని వారు అంటున్నారు. ఇది చాలా చిన్న విషయమని, దీనికి ఇంత డిస్కషన్ అవసరం లేదని చాలామంది తమ అభిప్రాయాన్ని వ్యక్తం చేస్తున్నారు.


పెళ్లి తర్వాత రెండో సినిమా..


2012లో విడుదలయిన ‘స్టూడెంట్ ఆఫ్ ది ఇయర్’తో హీరోగా బాలీవుడ్‌కు పరిచయమయ్యాడు సిద్ధార్థ్ మల్హోత్రా. మొదటి సినిమాతోనే బీ టౌన్‌లోకి ఒక హాట్ యంగ్ హీరో అడుగుపెట్టాడని గుర్తింపు తెచ్చుకున్నాడు. ఆ సినిమాలోనే తనతో పాటు నటించిన ఆలియా భట్‌తో కొన్నాళ్లు ప్రేమాయణం సాగించాడు ఈ హీరో. కానీ కొన్నాళ్లకే వారికి బ్రేకప్ అయిపోయింది. 2020లో ‘షెర్షా’ మూవీ షూటింగ్ సమయంలో తన కో యాక్టర్ కియారాతో సిద్ధార్థ్ ప్రేమలో పడ్డాడని రూమర్స్ వచ్చాయి. ఇక 2023లో వీరు పెళ్లితో ఒకటయ్యారు. పెళ్లి తర్వాత ‘మిషన్ మజ్ను’ అనే చిత్రంతో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు ఈ హీరో. ఇక త్వరలోనే తను నటించిన ‘యోధ’ కూడా థియేటర్లలో విడుదలకు సిద్ధమవుతోంది.


Also Read: ప్లానింగ్‌తోనే లావణ్య త్రిపాఠిని పెళ్లి చేసుకున్నాడు, వ‌రుణ్ తేజ్‌పై మెగాస్టార్ కామెంట్స్