Upasana - Ramcharan Planning for Second kid: రామ్ చరణ్, ఉపాసన టాలీవుడ్ లో క్యూట్ జంట. ఇక ఉపాసన కొణిదెల పరిచయం అక్కర్లేని పేరు. హీరోయిన్లకు కంటే ఎక్కువ ఫ్యాన్ బేస్ ఉంది ఆమెకి. ఆమె ఎంతోమందికి ఇన్ స్పిరేషన్ కూడా. సోషల్ మీడియాలో ఎప్పుడూ యాక్టివ్ గా ఉండే ఉపాసన ఎప్పటికప్పుడు అన్ని విషయాలపై అవగాహన కల్పిస్తూ ఉంటారు. ముఖ్యంగా స్త్రీల ఆరోగ్యం గురించి ఆమె ఎప్పటికప్పుడు అలర్ట్ చేస్తూ ఉంటారు. చాలా విషయాలను ప్రాక్టికల్ గా ఆలోచిస్తూ డెసిషన్స్ తీసుకుంటారు. పిల్లల విషయంలో కూడా అంతే ఆలోచించారు ఉపాసన. ఇక ఇప్పుడు ఓ అవగాహన కార్యక్రమంలో పాల్గొన్న ఆమె.. సెకండ్ కిడ్ ప్లానింగ్ గురించి ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేశారు.
రెండో బిడ్డను కనేందుకు సిద్ధం
రామ్ చరణ్ ఉపాసన పెళ్లైన 11 ఏళ్లకు బిడ్డకు జన్మనిచ్చారు. గత ఏడాది జూన్ 20న మెగా వారసురాలు పుట్టింది. ఆమెకి క్లీంకార అని పేరు పెట్టారు. పిల్లల విషయంలో జాగ్రత్తగా ప్లానింగ్ చేసుకున్నామని ఉపాసన చాలా సందర్భాల్లో చెప్పారు. తాము సెటిల్ అయ్యాకనే పిల్లల్ని ప్లాన్ చేసుకోవాలనే ఉద్దేశంతో ఉన్నామని ఉపాసన గతంలో చెప్పారు. అలా 11 ఏళ్ల తర్వాత పిల్లల్ని ప్లాన్ చేసుకుంది ఈ జంట. అయితే, ఇప్పుడు సెకండ్ కిడ్ విషయంలో మాత్రం గ్యాప్ తీసుకోవడం లేదు అంట. ఇప్పుడు రెండో బిడ్డకు జన్మనిచ్చేందుకు తాను సిద్ధంగా ఉన్నాను అంటూ చెప్పారు.
మహిళల ఆరోగ్యానికి సంబంధించి ఎండో మార్చ్ ప్రోగ్రామ్ లో పాల్గొన్నారు ఉపాసన. ఈ ఈవెంట్లో ఆమె మహిళా సాధికారత గురించి మాట్లాడారు. స్త్రీకి ఏది కావాలో అది సాధించుకునే హక్కు ఉందని ఈ సందర్భంగా అన్నారు ఉపాసన. పిల్లల్ని లేటుగా కనాలని అనుకున్నాను కాబట్టే అలా ప్లాన్ చేసుకున్నానని, కానీ.. ఇప్పుడు సెకండ్ కిడ్‌ను కనేందుకు సిద్ధంగా ఉన్నానని చెప్పారు. ప్రస్తుతం ఆమె చేసిన ఈ కామెంట్స్ వైరల్ గా మారాయి. దీంతో మెగా అభిమానులు సంబరాలు చేసుకుంటున్నారు. మెగా ప్రిన్సెస్ క్లీంకారకి త్వరలో చెల్లో, తమ్ముడో రాబోతున్నారు అనమాట అంటూ కామెంట్లు పెడుతున్నారు.
రామ్ చరణ్ భార్య, చిరంజీవి కోడలు ఉపాసన. ఈ గుర్తింపే కాకుండా ఆమెకు ఒక స్పెషల్ ఫేమ్ ఉంది. అదే.. ఒక మంచి వ్యాపారవేత్తగా. అపోలో హాస్పిటల్స్ ని ఆమె సక్సెస్ ఫుల్ గా రన్ చేస్తున్నారు. అయితే, కేవలం ఆపోలో హాస్పిటల్స్ మాత్రమే కాకుండా ప్రస్తుతం ఆమె ఫుడ్ బిజినెస్ లోకి ఎంటర్ అయ్యారు. అత్తమ్మా కిచెన్ పేరుతో ఆమె ఒక బిజినెస్ మొదలుపెట్టారు. చిరంజీవి భార్య సురేఖ రెసిపీస్‌తో, ఆమె పుట్టిన రోజే ఈ బిజినెస్ మొదలుపెట్టారు ఉపాసన.
సురేఖ కొణిదెల వంటకాలు మెగా ఫ్యామిలీలో ప్రతి ఒక్కరికి ప్రత్యేకం. ఫారిన్ షూటింగ్స్‌కు వెళ్లేటప్పుడు చిరంజీవి సురేఖ చేసిన ఆహారాన్ని వెంట తీసుకుని వెళ్తానని చాలాసార్లు చెప్పారు. కొణిదెల ఇంట్లో చేసే ఎన్నో వంటకాలను ‘అత్తమ్మ కిచెన్’ అనే పేరుతో పులిహోర, రసం, ఉప్మాలాంటివి ఇన్‌స్టంట్‌గా చేసుకోవడానికి ఉపయోగపడే ప్రొడక్ట్స్ మార్కెట్లోకి అందుబాటులోకి తీసుకొచ్చారు ఉపాసన.