Adiseshagiri Rao About Super Star Krishna Accident: టాలీవుడ్‌లో సూపర్ స్టార్ కృష్ణ చేసినన్ని ప్రయోగాలు మరే హీరో చేసి ఉండరు. డిఫరెంట్ క్యారెక్టర్లు చేస్తూ ఆ క్యారెక్టర్లలో ఒదిగిపోయే వారు ఆయన. భౌతికంగా దూరమైనా అభిమానుల గుండెల్లో మాత్రం పదిలమైన స్థానాన్ని ఏర్పర్చుకున్నారు కృష్ణ. అభిమానులు, కుటుంబ సభ్యులు ఇంకా ఆయన మరణించారనే వార్తను జీర్ణించుకోలేక పోతున్నారు. ఇప్పుడు ఆయన తమ్ముడు ఆది శేషగిరిరావు ఇచ్చిన ఒక ఇంటర్వ్యూలో కృష్ణ గురించి మాట్లాడారు. ఆయనను స్మరించుకుంటూ కొన్ని విషయాలు పంచుకున్నారు.
గన్ ఫైర్ అయ్యింది.. అందరం భయపడ్డాం
కృష్ణ చిన్న తమ్ముడు ఘట్టమనేని ఆది శేషగిరిరావు. కృష్ణ నటించిన ఎన్నో చిత్రాలకు ఆదిశేషగిరిరావు ప్రొడ్యూసర్ గా వ్యవహించారు. కృష్ణ సినిమాలకి సంబంధించి షూటింగ్‌లకు ఆయన దాదాపు వెళ్తుంటారు. ఈ సందర్భంగా ఊటీలో జరిగిన ఒక ప్రమాదం గురించి, కృష్ణ వ్యక్తిత్వం గురించి ఇలా చెప్పారు. "అన్నయ్య చాలా కూల్ గా ఉంటారు. ఏ విషయానికి పెద్దగా భయపడరు, కుంగిపోరు. హనుమంతరావు మరణించినప్పుడు చాలా బాధపడ్డారు. అంతేగానీ.. సినిమాలు ఫ్లాప్ అయినా హిట్ అయినా అస్సలు పట్టించుకోరు. మనసులో ఏమీ ఉంచుకోరు. ఏది అనిపిస్తే అది చెప్పేస్తారు. కోపం వచ్చి తిట్టినా వెంటనే మర్చిపోతారు" అని కృష్ణ వ్యక్తిత్వం గురించి చెప్పారు ఆయన.
గన్ మిస్ ఫైర్ - అంతా భయపడిపోయాం
"ఏ విషయంలో ఆయన వెనకడుగు వేయరు. యాక్షన్ సీన్లు తీసేటప్పుడు ఎప్పుడూ ప్రమాదం జరగలేదు. ఒకసారి మాత్రం ఊటీలో షూటింగ్ జరుగుతుంటే.. గన్ మిస్ ఫైర్ అయ్యింది. బుల్లెట్ వెనక్కి వచ్చి తగిలింది. అప్పుడు చాలా భయపడ్డాం. కోయంబత్తూర్ లో ట్రీట్మెంట్ అందించారు. నెల రోజులు రెస్ట్ తీసుకున్నారు. ఆ తర్వాత ఒకసారి హార్స్ రైడింగ్ చేసేటప్పుడు కిందపడ్డారు అంతే. ఎక్కువ ప్రమాదాలు మాత్రం జరగలేదు" అని చెప్పారు శేషగిరిరావు.
ఆస్తి గొడవలేవీ లేవు
ఇక ఇదే ఇంటర్వ్యూలో ఆయన మరిన్ని విషయాలపై క్లారిటీ ఇచ్చారు. కృష్ణ మరణించిన తర్వాత ఆస్తికి సంబంధించిన విషయాలపై చాలా వార్తలు రాగా.. క్లారిటీ ఇచ్చారు.. ఎలాంటి ఆస్తి గొడవలు లేవని అన్నారు. ఇక నరేశ్ విషయం తాము ఎప్పుడూ పట్టించుకోము అని చెప్పారు. నరేశ్ మూడో భార్య కృష్ణ మరణించినప్పటి నుంచి వీడియో రిలీజ్ చేసిందనే విషయం తనకు తెలీదని, కానీ, ఆరోజు ఆయన దగ్గర తన కొడుకు, తన మేనల్లుడు చాలామంది ఉన్నారని చెప్పుకొచ్చారు శేషగిరిరావు. ఇక కృష్ణ చివరి చూపు విషయంలో నెలకొన్న కన్ ఫ్యూజన్ పై మాట్లాడుతూ.. మంచు కురిసిందని, బాడీ పాడవుతుందనే ఉద్దేశంతోనే పద్మాలయకు తరలించామన్నారు. మహాప్రస్థానంలో అంత్యక్రియలు నిర్వహించినప్పటికీ.. మెమోరియల్ పద్మాలయ స్టూడియోలో ఏర్పాటు చేస్తున్నామన్నారు.
కృష్ణ చిన్న తమ్ముడు ఘట్టమనేని ఆదిశేషగిరిరావు. ఆదిశేషగిరిరావు నిర్మాతగా ఎన్నో సినిమాలు చేశారు. చిత్రసీమలో ఆయన్ను ప్రతి ఒక్కరు ‘బంగారయ్య’ అని పిలుస్తారు. ఇక ‘పద్మాలయా’ సంస్థ ఇండియా మొత్తం ఫేమస్ అయ్యేందుకు కృష్ణ తమ్ముళ్ళు హనుమంతరావు, ఆదిశేషగిరిరావు ఇద్దరూ కృషి చేశారు. అందుకు తగ్గ విజయం సాధించారు. చిన్నప్పటి నుంచీ అన్న కృష్ణ వెంటనే ఉన్నారు ఆదిశేషగిరిరావు. అన్నంటే తనకు ప్రాణం అని ఎన్నో సందర్భాల్లో చెప్పారు శేషగిరిరావు.
Also Read: ‘ఆపరేషన్ వాలంటైన్’, ‘ఫైటర్’ సినిమాల మధ్య పోలికపై స్పందించిన డైరెక్టర్