Rakul Preet Singh and Jackky Bhagnani Net Worth: గత కొద్ది సంవత్సరాలుగా ప్రేమలో మునిగితేలున్నారు బాలీవుడ్ స్టార్స్ రకుల్ ప్రీత్ సింగ్, జాకీ భగ్నానీ. కరోనా లాక్ డౌన్ సమయంలో ప్రేమలో పడ్డ ఈ జంట ఇప్పటి వరకు లవ్ ట్రాక్ కొనసాగించారు. తాజాగా వివాహ బంధంతో ఓ ఇంటివారు కాబోతున్నారు. గోవా వేదికగా ఇవాళ రకుల్, జాకీ పెళ్లి వేడుక అట్టహాసంగా జరగనుంది. ITC గ్రాండ్ గోవా రిసార్ట్ & స్పాలో వీరిద్దరి వెడ్డింగ్ జరగనుంది. బంధుమిత్రులు, సినీ, రాజకీయ ప్రముఖులు ఈ వేడుకలో పాల్గొననున్నారు. నూతన వధూవరులను ఆశీర్వదించనున్నారు.


రకుల్, జాకీ ఆస్తుల విలువ ఎంతంటే?


ఇక రకుల్, జాకీ చాలా కాలంగా సినిమా పరిశ్రమలో కొనసాగుతున్నారు. అంతేకాదు, బాలీవుడ్ లోని సంపన్న జంటలో వీరూ ఒకరుగా నిలువబోతున్నారు. తాజా సమాచారం ప్రకారం వీరిద్దరి నికర ఆస్తుల విలువ రూ.84 కోట్లు. రకుల్ ఆస్తుల విలువ రూ. 49 కోట్లు కాగా, ఆమె జీవిత భాగస్వామి జాకీ ఆస్తుల విలువ రూ.35 కోట్లు.    


ముంబై, హైదరాబాద్ లో బంగళాలు


రకుల్ ‘గిల్లీ’ (2009) అనే కన్నడ సినిమాతో ఇండస్ట్రీలోకి అడుగు పెట్టింది. రకుల్‌ ఇటీవలే హిందీ చిత్ర పరిశ్రమలో దశాబ్దకాలం పూర్తి చేసుకున్నది. అంతేకాదు, బాలీవుడ్‌లో ఒకే ఏడాదిలో ఆమె ఐదు చిత్రాల్లో నటించి మెప్పించారు. ఇక తెలుగు, తమిళ సినిమా పరిశ్రమలలో స్టార్ హీరోయిన్ గా కొనసాగింది. గత 15 ఏండ్లలో సినిమాలతో పాటు ఎండార్స్ మెంట్స్ తో బాగా డబ్బు సంపాదించింది. కరోనాకు ముందు ముంబైలో ఓ లగ్జరీ అపార్ట్మెంట్ ను కొనుగోలు చేసింది. హైదరాబాద్‌లో దాదాపు రూ.3 కోట్ల విలువైన విలాసవంతమైన 3 BHK బంగళాను కలిగి ఉంది. హైదరాబాద్, వైజాగ్ లో మూడు జిమ్స్ ఉన్నాయి. వీటితో పాటు మెర్సిడెజ్ బెంజ్,  రేంజ్ రోవర్ స్పోర్ట్స్, బీఎండబ్ల్యూ 520డీ, ఆడీ Q3,  మెర్సిడెజ్ మెబాజ్ జీఎల్ఎస్600 సహా పలు లగ్జరీ కార్లను కలిగి ఉంది. మొత్తంగా రకుల్ దగ్గర రూ.49 కోట్లు విలువైన ఆస్తులు ఉన్నాయి.   


బాంద్రాలో విలాసవంతమైన నివాసం, లగ్జరీ కార్లు


ఇక రకుల్ భర్త జాకీ దగ్గర కూడా బోలెడు ఆస్తులు ఉన్నాయి. 1995లో పూజా ఎంటర్‌టైన్‌మెంట్‌ అనే నిర్మాణ సంస్థను స్థాపించాడు. ముంబై బాంద్రాలో 6,000 చదరపు అడుగుల విశాలమైన బంగళాను కలిగి ఉన్నాడు. దీని విలువ కోట్లల్లో ఉంటుంది. పోర్స్ కేయన్ని, మెర్సిడెజ్ బెంజ్ సీఎల్ఎస్, మెర్సిడెజ్ బెంజ్ ఎస్ క్లాస్, రేంజ్ రోవల్ వోగ్ సహా పలు కార్లు ఉన్నాయి. మొత్తంగా జాకీ దగ్గర రూ.35 కోట్ల విలువైన నికర ఆస్తులు ఉన్నాయి.






 Read Also: ఇవాళే బాయ్ ఫ్రెండ్‌తో రకుల్ వెడ్డింగ్ - రెండు సంప్రదాయాలో పెళ్లి, ఇంకా ఎన్నో ప్రత్యేకతలు