Vishal React On AIADMK Leader Comments: స్టార్ హీరోయిన్ త్రిషపై పొలిటిషియన్ చేసిన అనుచిత వ్యాఖ్యాలు సినీ ఇండస్ట్రీలో తీవ్ర దుమారం రేపుతున్నాయి. అన్నాడీఎంకే మాజీ లీడర్ ఏవీ రాజు త్రిషను ఉద్దేశించి అసభ్యకరంగా వ్యాఖ్యానించాడు. గతంలో ఓ ఎమ్మెల్యే త్రిషకు డబ్బులిచ్చి రిసార్టుకు తీసుకొచ్చాడంటూ అసభ్యకరంగా వ్యాఖ్యానించాడు. ప్రస్తుతం అతడి కామెంట్స్ సంచలనంగా ఆరాయి. ఇందుకు సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్‌గా కావడంతో ఏకే రాజుపై నెటిజన్లు, ఆమె ఫ్యాన్స్ విరుచుకుపడుతున్నారు. అంతేకాదు ఇంస్ట్రీకి చెందిన ప్రముఖులు, స్టార్ హీరోలు కూడా అతడిపై మండిపడుతున్నారు.
ఈ క్రమంలో త్రిషకు మద్దతుగా నిలుస్తూ ఆమెకు ధైర్యం చెబుతున్నారు. ఇవి నిరాధరామైన ఆరోపణలని.. త్రిషకు మేము ఉన్నామంటూ ఆమెకు సపోర్టు ఇస్తున్నారు. ఈ క్రమంలో హీరో విశాల్ సదరు రాజకీయ నేతను ఉద్దేశిస్తూ ఓ ట్వీట్ చేశాడు. ఈ సందర్భంగా అతడు ఇలాంటి వ్యాఖ్యలు ఎలా చేస్తారని, మనిషిగా ఉన్నప్పుడు కొద్ది పాటి సంస్కరం ఉండాలంటూ అతడిపై ఘాటు వ్యాఖ్యలు చేశాడు. విశాల్ తన ట్వీట్ "ఓ రాజకీయ పార్టీకి చెందిన ముర్ఖుడు మన సినీ ఇండస్ట్రీకి చెందిన ఒకరి గురించి ఇలా అసహ్యంగా మాట్లాడారని విన్నా. ఇది పబ్లిసిటీ కోసం చేసిన వ్యాఖ్యలని స్పష్టంగా తెలుస్తోంది. కాబట్టి ఆయన పేరు ప్రస్తావించను. అలాగే అతడు టార్గెట్ చేసిన వ్యక్తి పేరు కూడా చెప్పను. ఎందుకంటే ఆ వ్యక్తి నేను మంచి స్నేహితలమే కాదు సహానటీనటులం కూడా.
ఈ భూమిపై ఉన్న ఇలాంటి రాక్షసుడిపై ప్రతీకారం తీర్చుకోవడానికి ట్వీట్ చేయడం నాకు ఇష్టం లేదు. మీరు చేసిన ఈ వ్యాఖ్యల తర్వాత మీ ఇంటి ఆడవాళ్లు క్షేమంగా ఇంటికి రావాలి కోరుకుంటున్నా. ఇలాంటి వాడి గురించి ఇలా ఓ పోస్ట్ పెట్టావాల్సి రావడం నిజంగా నాకు బాధ కలిగించింది. మీరు ప్రవర్తన, మీరు చేసిన చెండాలం పనిని గురించి మాట్లాడేందుకు కూడా మాటలు రావడం లేదు. నిజాయితీగా చెప్పాలంటే నిన్ను ఖండించడం కూడా నాకు ఇష్టం లేదు. ఎందుకంటే నువ్వు చేసిన పనికి ఇలా దూషించడం కూడా తక్కువే అవుతుంది. ఇలాంటి తప్పుడు పనుల వల్ల మీరు నరకంలో కుళ్లిపోవాలని కోరుకుంటున్నా. కళాకారుల సంఘం ప్రధాన కార్యదర్శిగా ఈ ప్రకటన చేయాలనే ఉద్దేశం నాకు లేదు.
కానీ, ఒక మనిషిగా చెబుతన్నా.. మీరు భూమిపై ఉన్నంత కాలం మినిషిలా ఎప్పటికీ ఉండలేరు. డబ్బుల కోసమే అయితే ఇకపై ఇలాంటి నీచపు వ్యాఖ్యలు చేసి డబ్బుల సంపాదించడం మానుకోని.. సక్రమమైన మార్గంలో డబ్బు సంపాదించండి. లేదా ఉద్యోగం చేయండి. అదీ కాదంటే కనీసం బిచ్చగాడిగానైనా కెరీర్ ప్రారంభించండి" అంటూ విశాల్ తన ట్వీట్‌లో రాసుకొచ్చాడు. ఇండస్ట్రీ నుంచి తనకు మద్దుతు రావడం చూసి త్రిష ఏకే రాజు కామెంట్స్‌పై స్పందించి తీవ్ర స్థాయిలో మండిపడింది. "ఫేమస్ కావడం కోసం ఎంతటి నీచానికైనా దిగజారిపోయే జీవితాలు. పదే పదే ఇలాంటి నీచమైన మనుషులను చూస్తుంటే అసహ్యం వేస్తుంది. దీనిపై త్వరలోనే చట్టపరమైన చర్యలు తీసుకుంటాను. నా లీగల్ డిపార్ట్‌మెంట్‌తో మాట్లాడి తదుపరి చర్యలు తీసుకుంటాను" అంటూ పోస్ట్ చేసింది.