Rakul Preet-Jackky Bhagnani wedding: గత కొంత కాలంగా ప్రేమలో మునిగితేలుతున్న బాలీవుడ్ స్టార్స్ రకుల్ ప్రీత్ సింగ్, జాకీ భగ్నాని ఇవాళ (ఫిబ్రవరి 21న) సంసార జీవితంలోకి అడుగుపెట్టబోతున్నారు. గోవా వేదికగా ఇప్పటికే  వీరి పెళ్లి వేడుకలు అట్టహాసంగా ప్రారంభం అయ్యాయి. హల్దీ వేడుకతో ఈ సంబురం మొదలయ్యింది. సంగీత్‌తో ఇరు కుటుంబ సభ్యులు, బంధుమిత్రులతో కలిసి సరదాగా గడిపారు. నచ్చిన డ్యాన్సులు, రకరకాల ఆటలతో ఎంజాయ్ చేశారు. రకుల్, జాకీ మెహందీ, సంగీత్ వేడుకలో పలువురు బాలీవుడ్ స్టార్స్ పాల్గొని సందడి చేశారు. ఈ నూతన జంటకు దగ్గరి మిత్రుడు అయిన నటుడు వరుణ్ ధావన్ స్పెషల్ సాంగ్ కు డ్యాన్స్ చేసి అలరించాడు. 'కూలీ నంబర్ 1'లోని హుస్న్ హై సుహానా అనే పాటకు అదిరిపోయే స్టెప్పులు వేసి వారెవ్వా అనిపించాడు. వరుణ్‌తో పాటు శిల్పా శెట్టి, రాజ్ కుంద్రా, ఇతర కుటుంబ సభ్యులు కూడా సంగీత్‌లో డ్యాన్సులు చేసి ఆకట్టుకున్నారు. 


ఇవాళ వీరి వివాహ అట్టహాసంగా జరగనుంది.


పెళ్లిలో కీలక వేడుక ఇవాళ ప్రారంభం కానున్నట్లు కుటుంబ సభ్యులు తెలిపారు. ఇవాళ ఉదయం ‘చుద్దా’ అనే సంప్రదాయ కార్యక్రమం మొదలు కానుంది. మధ్యాహ్నం 3.30 గంటల తర్వాత ITC గ్రాండ్ సౌత్ గోవాలో ఒక్కటి కానున్నారు. వీరి పెళ్లి వేడుక ఆనంద్ కరాజ్, సింధీ-శైలిలో జరగనుంది. ఇరు కుటుంబ సభ్యులకు సంబంధించిన రెండు సంప్రదాయాల ప్రకారం వివాహం జరగనుంది. ఈ వేడుకలో బంధువులు, కొద్ది మంది మిత్రులతో పాటు పలువురు సినీ, రాజకీయ ప్రముఖు పాల్గొననున్నారు. నూతన జంటను ఆశీర్వదించనున్నారు. పెళ్లి తర్వాత ఈ కొత్త జంట అతిథులందరికీ ప్రత్యేకంగా పార్టీ ఇవ్వనున్నారు.  


కరోనా లాక్ డౌన్ నుంచి జాకీతో రకుల్ ప్రేమాయణం


ఢిల్లీకి చెందిన రకుల్ ప్రీత్ గ్రాడ్యుయేషన్ పూర్తి చేసిన తర్వాత మోడలింగ్ లోకి అడుగు పెట్టింది. అనంతరం సినిమా రంగంలోకి అడుగు పెట్టింది. బాలీవుడ్ లో కొన్ని సినిమాల్లో నటించింది. అయినా పెద్దగా గుర్తింపు రాలేదు. నెమ్మదిగా తెలుగు సినిమా పరిశ్రమలోకి ఎంట్రీ ఇచ్చింది. ‘వెంకటాద్రి ఎక్స్ ప్రెస్‘ మూవీతో టాలీవుడ్ ప్రేక్షకుల ముందుకు వచ్చింది. తొలి సినిమాతోనే మంచి గుర్తింపు తెచ్చుకుంది.


ఆ తర్వాత అల్లు అర్జున్, రామ్ చరణ్ లాంటి స్టార్ హీరోల సినిమాల్లో నటించి స్టార్ హీరోయిన్ గా మారిపోయింది. ప్రస్తుతం బాలీవుడ్ మీద ఫోకస్ చేసింది. ఇక ఈ ముద్దుగుమ్మ కరోనా సమయంలో బాలీవుడ్ నిర్మాత, నటుడు జాకీ భగ్నానీతో ప్రేమలో పడింది. అయితే, ఈ విషయాన్ని చాలా కాలం రహస్యంగా ఉంచింది. 2021 అక్టోబర్ లో తమ ప్రేమ విషయాన్ని బయటకు చెప్పేశారు. అప్పటి నుంచి వీళ్లదరు చెట్టాపట్టాల్ వేసుకుని కనిపించారు. పార్టీలు, పబ్బుల్లో దర్శనం ఇచ్చారు. సుమారు 3 ఏండ్ల ప్రేమాయణం తర్వాత మూడు ముళ్ల బంధంతో ఒక్కటి కాబోతున్నారు.


Read Also: త్రిషపై పొలిటిషియన్ అనుచిత వ్యాఖ్యలు - అతడిని ఖండించడం కూడా ఇష్టం లేదు.. విశాల్