Upasana Konidela Tweet: ఇటీవల ఆంధ్రప్రదేశ్ ఎన్నికల్లో ఘనవిజయం సాధించినవారంతా ప్రమాణ స్వీకారాలు చేశారు. ఈ ప్రమాణ స్వీకార కార్యక్రమం చాలా ఘనంగా జరిగింది. ముఖ్యంగా ముఖ్యమంత్రిగా చంద్రబాబు నాయుడు, ఎమ్మెల్యేగా పవన్ కళ్యాణ్ ప్రమాణ స్వీకారాన్ని చూడడం కోసం దాదాపు మెగా ఫ్యామిలీ అంతా వచ్చారు. నేరుగా ఈ కార్యక్రమానికి హాజరు కాలేనివారు సోషల్ మీడియాలో తమ సంతోషాన్ని బయటపెట్టారు. అందులో రామ్ చరణ్ భార్య ఉపాసన కొణిదెల కూడా ఒకరు. కానీ ఉపాసన.. పవన్ కళ్యాణ్‌కు విషెస్ చెప్తూ తనను బాబాయ్ అనడంపై ట్విటర్‌లో పెద్ద చర్చే మొదలయ్యింది.


కంగ్రాచులేషన్స్ పవన్ కళ్యాణ్ బాబాయ్..


ప్రమాణ స్వీకార కార్యక్రమంలో మెగా ఫ్యామిలీకి మాత్రమే కాకుండా మెగా ఫ్యాన్స్‌కు కూడా గుర్తుండిపోయే మూమెంట్ ఒకటి ఉంది. స్టేజ్ కింద ఉన్న చిరంజీవిని స్టేజ్‌పైకి పిలిచి నరేంద్ర మోదీతో మాట్లాడించారు పవన్. అదే సమయంలో అనూహ్యంగా చిరంజీవి, పవన్ కళ్యాణ్ చేతులను పట్టుకొని పైకి లేపారు మోదీ. అలా ముగ్గురు కలిసి నవ్వుతూ ఉన్న ఫోటో.. సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది. ఈ ఫోటోను ఉపాసన కూడా షేర్ చేశారు. ‘కంగ్రాచులేషన్స్ పవన్ కళ్యాణ్ బాబాయ్. జనాలు చాలా బాగా ఆలోచించి జనసేన పార్టీని ఎన్నుకున్నారు. జై హింద్’ అంటూ ట్వీట్ చేశారు.






ఫన్నీ కామెంట్స్..


ఉపాసన కొణిదెల షేర్ చేసిన ఈ ట్వీట్‌లో చిరంజీవిని మాత్రం మామయ్య అని, పవన్ కళ్యాణ్‌ను బాబాయ్ అనడంపై నెటిజన్లు ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు. పవన్‌ను కూడా మామయ్య అనాలి కదా.. బాబాయ్ అంటున్నారేంటి అని చర్చించుకుంటున్నారు. మరికొందరు అయితే ‘గాంధీ తాత అందరికీ తాతయ్య అయినట్టు పవన్ కళ్యాణ్ అందరికీ బాబాయే’ అంటూ ఫన్నీగా కామెంట్స్ పెడుతున్నారు. ఇంతకు ముందు కూడా ఒక సందర్భంలో ఉపాసన.. పవన్ కళ్యాణ్‌ను మామయ్య అనకుండా బాబాయ్ అన్నారని గుర్తుచేసుకున్నారు. ఇప్పటికైనా పవన్‌ను కూడా మామయ్య అని పిలవడం అలవాటు చేసుకోమని సలహా ఇస్తున్నారు.


ఎంతోమంది టాలీవుడ్ సెలబ్రిటీలు..


ఇప్పటికే ఏపీ ఎన్నికల్లో పవన్ కళ్యాణ్ గెలుపుపై సంతోషం వ్యక్తం చేశారు ఉపాసన. అంతే కాకుండా తను, రామ్ చరణ్, క్లిన్ కారా, పవన్ కళ్యాణ్ ఉన్న ఫోటోను షేర్ చేస్తూ పవన్‌ను చూసి గర్వంగా ఉందన్నారు. ఇక చిరంజీవితో పాటు రామ్ చరణ్ కూడా ప్రమాణ స్వీకార కార్యక్రమానికి హాజరయ్యారు. మెగా ఫ్యామిలీ అంతా ఒక బస్సులో అక్కడికి ట్రావెల్ చేసిన ఫోటోలను కూడా షేర్ చేశారు. మెగా ఫ్యామిలీ మాత్రమే కాకుండా మరెందరో టాలీవుడ్ సెలబ్రిటీలు కూడా ఈ కార్యక్రమానికి హాజరవ్వడం విశేషం. ఇక అల్లు అర్జున్.. ఇప్పుడు కూడా ఎక్కడా కనిపించకపోవడం మరోసారి చర్చనీయాంశంగా మారింది.


Also Read: అల్లు అర్జున్‌ను అన్‌ఫాలో చేసిన ఆ మెగా హీరో - ఫ్యామిలీలో విభేదాలు మొదలయ్యాయా?