Allu Arjun: ఏపీ ఎన్నికల్లో పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ విజయం సాధించారని మెగా ఫ్యామిలీ ఆ విషయాన్ని పెద్ద పండగలాగా సెలబ్రేట్ చేసుకున్నారు. ఎన్నికల్లో ఫలితాలను ప్రకటించిన మరుసటి రోజే చిరంజీవి ఇంటికి వెళ్లారు పవన్ కళ్యాణ్. అప్పటికే నాగబాబు ఫ్యామిలీ కూడా అక్కడే ఉన్నారు. కానీ అల్లు ఫ్యామిలీ నుండి మాత్రం ఆ సెలబ్రేషన్‌లో ఎవరూ పాల్గొనలేదు. ముఖ్యంగా అల్లు అర్జున్ ఈ సెలబ్రేషన్‌కు రాకపోవడం హాట్ టాపిక్‌గా మారింది. దీంతో మెగా ఫ్యామిలీలో విభేదాలు మొదలయ్యాయని అభిమానుల్లో చర్చ మొదలయ్యింది. దానికి తోడు తాజాగా ఒక మెగా హీరో.. సోషల్ మీడియాలో అల్లు అర్జున్‌ను అన్‌ఫాలో చేయడం సంచలనంగా మారింది.


స్పెషల్ ఫోటో..


మెగా ఫ్యామిలీ నుండి వచ్చిన యంగ్ హీరోల్లో సాయి ధరమ్ తేజ్ అలియాస్ సాయి దుర్గా తేజ్ ఒకరు. ఎక్కువశాతం మెగా ఫ్యామిలీతో తను సెలబ్రేట్ చేసుకున్న హ్యాపీ మూమెంట్స్ అన్నీ తన సోషల్ మీడియాలో ఎప్పటికప్పుడు షేర్ చేసుకుంటూ ఉంటాడు ఈ హీరో. తాజాగా పవన్ కళ్యాణ్.. ఏపీ ఎన్నికల్లో గెలిచిన సందర్భంగా ఆయనను హత్తుకొని ఉన్న ఒక స్పెషల్ వీడియోను ఫాలోవర్స్‌తో షేర్ చేసుకున్నాడు సాయి దుర్గా తేజ్. తాజాగా పవన్ కళ్యాణ్ గెలుపును మెగా ఫ్యామిలీ అంతా సెలబ్రేట్ చేసుకున్న ఫోటోను కూడా తన ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్ట్ చేశాడు. ఇప్పుడు ఈ హీరో.. అల్లు అర్జున్‌ను ఇన్‌స్టాగ్రామ్‌లో, ట్విటర్‌లో అన్‌ఫాలో చేయడం హాట్ టాపిక్‌గా మారింది.


మెగా పవర్ సెలబ్రేషన్..


ఎన్నికల్లో గెలవడంతో పవన్ కళ్యాణ్, తన భార్య ఆన్నా, చిరంజీవి, సురేఖ.. ఇలా అందరూ కలిసి మెగా ఇంట్లో కేక్ కట్ చేశారు. ఆ సందర్భంలో సాయి దుర్గా తేజ్ అల్లరి మామూలుగా లేదు. అదే ఫోటోను తన ఇన్‌స్టాగ్రామ్‌లో కూడా షేర్ చేశాడు ఈ మెగా హీరో. ‘నా, మీ, మన విజిల్ వేయండి మూమెంట్ ఇది. నిజం కోసం, ధర్మం కోసం నిలబడి గెలిచినందుకు ఇది మన మెగా పవర్ సెలబ్రేషన్’ అంటూ ఈ ఫోటోను పోస్ట్ చేశాడు. కానీ అల్లు అర్జున్ ఎక్కడ అనే కామెంట్స్ మాత్రం అంతటా కనిపిస్తూనే ఉన్నాయి.






విమర్శలు..


మెగా ఫ్యామిలీ నుండి దాదాపు ప్రతీ హీరో స్వయంగా వెళ్లి పిఠాపురంలో పవన్ కళ్యాణ్ కోసం ప్రచారాలు చేశారు. కానీ అల్లు అర్జున్ మాత్రం వైసీపీ నంద్యాల ఎమ్మెల్యే అభ్యర్థి శిల్పా రవికి మద్దతు తెలుపుతూ ఆయన ఇంటికి వెళ్లారు. పవన్ కళ్యాణ్‌కు సపోర్ట్ చేయకపోయినా పర్వాలేదు కానీ ఒక మెగా హీరో.. వైసీపీ అభ్యర్థికి సపోర్ట్ చేయడమేంటి అని విమర్శించడం మొదలుపెట్టారు. అల్లు అర్జున్ చేసిన ఈ పని వల్ల మెగా ఫ్యామిలీలో విభేదాలు తప్పవని ప్రేక్షకులు అప్పుడే ఫిక్స్ అయిపోయారు.


Also Read: మీ ఇంట్లో ఆడవాళ్లు లేరా, మీరేం చేస్తారో చేసుకోండి - అల్లు అర్జున్‌కు కిరాక్ ఆర్పీ ఛాలెంజ్