Upasana Konidela Meets Yogi Adityanath: మెగా కోడలు ఉపాసన కొణిదెల.. ఒక బిజినెస్ ఫ్యామిలీ నుండి వచ్చారు. ఆమెకు వ్యాపారాలపై చాలా అవగాహన ఉంది. అందుకే స్వయంగా కొన్ని ఫ్యామిలీ బిజినెస్‌లను మ్యానేజ్ కూడా చేస్తున్నారు. అయితే తాజాగా ‘అత్తమ్మస్ కిచెన్’ అనే పేరుతో ఫుడ్ బిజినెస్‌లోకి కూడా అడుగుపెట్టారు ఉపాసన. మెగాస్టార్ చిరంజీవి సతీమణి సురేఖ రెసిపీలను ఇన్‌స్టంట్ ఫుడ్స్‌గా మార్చి మార్కెట్లోకి అందుబాటులోకి తీసుకొచ్చారు. అయితే ఈ ‘అత్తమ్మస్ కిచెన్’ ప్రారంభించినప్పటి నుండి దీని ప్రమోషన్స్‌పై ఫుల్ ఫోకస్ పెట్టారు ఉపాసన కొణిదెల. అందులో భాగంగానే తాజాగా ఉత్తర ప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్‌ను కలిశారు.


సీఎం చేత ప్రమోషన్..


తన ప్రొడక్ట్ అయిన ‘అత్తమ్మస్ కిచెన్’ను ప్రమోట్ చేయడం కోసం సోషల్ మీడియాలో దీని పేరుతో ఒక పేజ్‌ను క్రియేట్ చేశారు ఉపాసన. తాజాగా యోగి ఆదిత్యనాథ్‌ను కలిసిన విషయాన్ని ఆ పేజ్‌లో షేర్ చేశారు. ‘‘గౌరవనీయులైన ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్‌తో అత్తమ్మస్ కిచెన్ ప్రొడక్ట్స్‌ను షేర్ చేసుకోవడం చాలా సంతోషంగా అనిపిస్తోంది. సురేఖ కొణిదెల గారు ప్రేమ, ప్యాషన్‌తో చేసిన నిలువ ఉంచుకోగల, హోమ్ మేడ్ సౌత్ ఇండియన్ ఫుడ్ మీకోసం’’ అంటూ ఉపాసన, యోగి ఆదిత్యనాథ్‌తో కలిసి దిగిన ఫోటోలను అత్తమ్మస్ కిచెన్ ఇన్‌స్టాగ్రామ్ పేజ్‌లో షేర్ చేశారు. ఇది చూసిన వారంతా ఉపాసన.. ‘అత్తమ్మస్ కిచెన్’ కోసం ప్రమోషన్స్‌ను వేరే లెవెల్‌లో చేస్తున్నారని ప్రశంసిస్తున్నారు.






ఆరోజే లాంచ్..


ఇటీవల సురేఖ కొణిదెల పుట్టినరోజు సందర్భంగా ‘అత్తమ్మస్ కిచెన్’ ప్రొడక్ట్స్ లాంచ్ జరిగింది. ఇప్పటికే మార్కెట్లో ఇన్‌స్టంట్ ప్రొడక్ట్స్ చాలా ఉన్నాయి. వాటిలో ‘అత్తమ్మస్ కిచెన్’ ప్రొడక్ట్స్ భిన్నంగా ఉంటాయంటూ వీటి ప్రమోషన్‌లో స్పీడ్ పెంచారు ఉపాసన. సోషల్ మీడియాలో వీటి గురించే ఎక్కువగా పోస్టులు పెడుతున్నారు. సురేఖ కొణిదెల గురించి, ఆమె వంట స్టైల్ గురించి పదేపదే ప్రేక్షకులకు గుర్తుచేస్తున్నారు. సురేఖ కొణిదెల వంటకాలంటే మెగా ఫ్యామిలీని అందరికీ ప్రత్యేకమైన ఇష్టం ఉంటుంది. చిరంజీవి ఫారిన్ ట్రిప్స్‌కు వెళ్లినప్పుడు కూడా సురేఖ చేసిన ఆహారాన్ని వెంట తీసుకొని వెళ్తానని కూడా పలుమార్లు బయటపెట్టారు. ఇంటి నుండి దూరంగా ఉన్నా కూడా హోమ్ ఫుడ్ అనేది వారిని ఒక్క దగ్గర ఉన్నట్టు ఫీల్ అయ్యేలా చేస్తుందన్నదే సురేఖ ఫార్ములా. 


రామ్ చరణ్ కుకింగ్ వీడియో..


తాజాగా ఉమెన్స్ డే సందర్భంగా కూడా ‘అత్తమ్మస్ కిచెన్’ ప్రమోషన్స్‌లో భాగంగా ఒక వీడియోను తన సోషల్ మీడియాలో షేర్ చేశారు ఉపాసన కొణిదెల. అందులో తన అత్త సురేఖ కిచెన్‌లో వంట చేస్తూ కనిపించారు. ఆ తర్వాత రామ్ చరణ్ కూడా వచ్చి వంటలో సాయం చేయడానికి జాయిన్ అయ్యారు. మామూలుగా చిరంజీవి, రామ్ చరణ్ సమయం దొరికినప్పుడల్లా కిచెన్‌లో సురేఖకు సాయం చేస్తారన్నది తెలిసిన విషయమే. మరోసారి ఈ వీడియోతో అదే విషయాన్ని గుర్తుచేశారు ఉపాసన. తల్లితో కలిసి రామ్ చరణ్ కుకింగ్ వీడియో ఉమెన్స్ డే సందర్భంగా సోషల్ మీడియాలో తెగ వైరల్ అయ్యింది. అలా గ్యాప్ ఇవ్వకుండా ‘అత్తమ్మస్ కిచెన్’ ప్రొడక్ట్స్‌ను ప్రమోట్ చేస్తూనే ఉన్నారు ఉపాసన.


Also Read: ఇండియా అలా కాదు, ‘ఆర్ఆర్ఆర్’ అద్భుతమైన సినిమా - ఎడ్ షీరన్