Superstar krishna Birth anniversary: సూప‌ర్ స్టార్ కృష్ణ‌.. తెలుగు సినిమాను ఉన్న‌త స్థానంలో నిల‌బెట్టిన న‌ట శిఖ‌రం. వైవిధ్య‌మైన క‌థ‌లు, వివిధ పాత్ర‌లు ఆయ‌న‌కే సొంతం. ఎన్నో వెరైటీ క‌థ‌ల‌తో ప్రేక్ష‌కుల‌ను అల‌రించారు సూప‌ర్ స్టార్ కృష్ణ‌. ప్రేమ‌క‌థ‌లు, యాక్ష‌న్ సినిమాలు, వీరుల పాత్ర‌లు చేసి త‌మ అభిమానుల‌ను ఎప్పుడూ అల‌రించేవారు మ‌న సూప‌ర్ స్టార్. హాలీవుడ్ రేంజ్ యాక్ష‌న్ సినిమాల‌ను తెలుగు ప్రేక్ష‌కుల‌కి ప‌రిచ‌యం చేసిన హీరో. అల్లూరి సీతారామ‌రాజు, జేమ్స్ బాండ్, కౌ బాయ్ లాంటి క్యారెక్ట‌ర్లు చేసి, బాక్సాఫీస్ ద‌గ్గ‌ర కాసులు వ‌ర్షం కురిపించారు. ఆయన నటించడమే కాదు.. సాంకేతికంగానూ ఎన్నో ప్రయోగాలు చేస్తూ తెలుగు సినీ పరిశ్రమకు మార్గదర్శిగా నిలిచారు. సినీ కార్మికుల‌కు ఉపాధి కావాలంటే మ‌నం సినిమాలు చేయాలంటూ, రోజుకు మూడు షిఫ్ట్ ల‌లో ప‌నిచేసిన గొప్ప మ‌న‌సున్న హీరో కృష్ణ. మే 31న ఆయ‌న జ‌యంతి సంద‌ర్భంగా కొన్ని ఆసక్తికర విషయాలు మీ కోసం.


తెనాలిలో జ‌న్మించి.. 


సూప‌ర్ స్టార్ కృష్ణ సొంతూరు బుర్రిపాలెం గ్రామం. కృష్ణ 1942 మే 31న జ‌న్మించారు. ఈయన పూర్తిపేరు ఘట్టమనేని శివరామకృష్ణమూర్తి. తండ్రి ఘ‌ట్ట‌మ‌నేని వీర రాఘ‌వ‌య్య‌. త‌ల్లి నాగ‌ర‌త్న‌. కృష్ణ డిగ్రీ పూర్తి చేశారు. కాలేజీలో అక్కినేని నాగేశ్వ‌ర‌రావుకు స‌న్మానం చేయ‌డం చూసిన కృష్ణ ఆ ప్రేరణతో న‌ట‌న వైపు అడుగులు వేశారు. ఆదుర్తి సుబ్బారావు తొలిసారిగా కృష్ణకు సినిమాలలో అవకాశం ఇచ్చారు. ఇక అక్క‌డ నుంచి ఆయ‌న వెనుతిరిగి చూడ‌లేదు. కొత్త కొత్త ప్ర‌యోగాలు చేస్తూ, కొత్త కొత్త టెక్నాల‌జీతో ఎన్నో సినిమాలు చేశారు. 


వైవిధ్యమైన పాత్ర‌లు, కొత్త ప్ర‌యోగాలు.. 


ప్ర‌యోగాల‌కు కేరాఫ్ అడ్ర‌స్ కృష్ణ‌. ఆయ‌న కెరీర్ లో ఎన్నో వైవిధ్య‌మైన పాత్ర‌లు పోషించారు . అల్ల‌ూరి సీతారామారాజు, కౌబాయ్, జేమ్స్ బాండ్ లాంటి కొత్త కొత్త పాత్ర‌ల‌ను తెలుగు ప్రేక్ష‌కుల‌కు ప‌రిచ‌యం చేశారు ఆయ‌న‌. 1974లో మొద‌టి సినిమా స్కోప్ 'అల్లూరి సీతారామ‌రాజు' సినిమా చేశారు కృష్ణ‌. టాలీవుడ్ లో మొద‌టి ఈస్ట్ మాన్ క‌ల‌ర్ ఫిలిమ్ చేసింది ఆయనే. 1982లో ఆ సినిమా చేశారు. 1986 లో ఆయ‌న న‌టించిన 'సింహాసనం' 70 ఎంఎంలో రిలీజైన మొద‌టి సినిమా. 1995లో డీటీఎస్ ఫిలిమ్ 'తెలుగు వీర లేవ‌ర‌', 'మోస‌గాడికి మోస‌గాడు'లో కౌ బాయ్ క్యారెక్ట‌ర్ లో న‌టించారు కృష్ణ‌. ఆ త‌ర్వాత 1966లో 'గూఢ‌చారి' సినిమా తీసి, అది భారీ స‌క్సెస్ సాధించ‌డంతో జేమ్స్ బాండ్ క్యారెక్ట‌ర్ తో ఎన్నో సినిమాలు తీశారు ఆయ‌న‌. అలా సినిమా ఇండ‌స్ట్రీలో కొత్త కొత్త టెక్నాల‌జీ, కొత్త కొత్త విధానాలు తీసుకొచ్చారు. 


యాక్ట‌ర్ మాత్ర‌మే కాదు.. 


సూప‌ర్ స్టార్ కృష్ణ యాక్ట‌ర్ గా మాత్ర‌మే కాదు డైరెక్ట‌ర్ గా, ప్రొడ్యూస‌ర్ గా కూడా వ్య‌వ‌హ‌రించి ఎన్నో హిట్ సినిమాలు తీశారు. ఆయ‌న కెరీర్ లో దాదాపు 17 సినిమాల‌ను ఆయ‌న డైరెక్ట్ చేశారు. అంతేకాకుండా ప‌ద్మాల‌య స్టూడియోస్ నిర్మించి త‌న సోద‌రులు ఆది శేష‌గిరిరావు, హ‌నుమంత‌రావుల‌తో క‌లిసి ఎన్నో సినిమాల‌ను కూడా ప్రొడ్యూస్ చేశారు కృష్ణ‌. మ‌హేశ్ బాబుతో క‌లిసి ఐదు సినిమాల్లో న‌టించారు ఆయ‌న‌. 


కార్మికులకు మంచి జ‌ర‌గాల‌ని.. 


సూప‌ర్ స్టార్ కృష్ణ సినిమా లేకుండా ఏ ఏడాది గ‌డ‌వ‌దు ఆ కాలంలో. క‌చ్చితంగా ఆయ‌న సినిమా ఏదో ఒక‌టి రిలీజ్ కావాల్సిందే. 1972లో ఏకంగా 18 సినిమాలు రిలీజ్ అయ్యాయి. ఆయ‌న ఎంత క‌ష్ట‌ప‌డేవారో ఆలోచించొచ్చు. కృష్ణ రోజుకి 3 షిఫ్ట్ లు ప‌నిచేసేవార‌ట‌. కార‌ణం.. సినీ కార్మికులు మ‌న‌ల్నే న‌మ్ముకుని ఉన్నారు. వాళ్ల‌కు ప‌నికావాలంటే మ‌నం సినిమాలు చేయాలి అనేవార‌ట ఆయ‌న‌. 


రెమ్యున‌రేష‌న్ లోనూ టాప్.. 


సినిమాలు తీయ‌డంలోనే కాదు.. రెమ్యున‌రేష‌న్ తీసుకోవ‌డంలోనూ ఆయ‌న టాప్ లో ఉండేవార‌ట‌. 1970ల్లో అత్యంత ఎక్కువ రెమ్యున‌రేష‌న్ తీసుకున్న హీరో కృష్ణ‌. ఇక హీరోయిన్ల విష‌యానికొస్తే.. ఆయ‌న అత్య‌ధికంగా విజ‌య నిర్మ‌ల‌తో 48 సినిమాల్లో న‌టించారు. ఆ త‌ర్వాత జ‌య‌ప్ర‌ద‌తో 47 సినిమాల్లో, శ్రీ‌దేవితో 29 సినిమాలు చేశారు. 37 ఏళ్లు వ‌రుస‌గా హీరో చేసిన ఘ‌న‌త కూడా ఆయ‌న‌దే. 


అవార్డులు, రివార్డులు.. 


సూప‌ర్ స్టార్ కృష్ణ‌కి ఎన్నో అవార్డులు కూడా వ‌చ్చాయి. 2009లో కేంద్ర ప్ర‌భుత్వం ఆయ‌నను ప‌ద్మ‌భూష‌ణ్ అవార్డుతో స‌త్క‌రించింది. 1972లో పండంటి కాపురం సినిమాకి ఆయ‌న‌కు నేష‌న‌ల్ అవార్డు ద‌క్కింది. 1974లో అల్లూరి సీతారామ‌రాజు సినిమాకి ఉత్తమ నటుడిగా నంది పురస్కారం అందుకున్నారు ఆయ‌న‌. 1976లో కేంద్ర కార్మికశాఖ నటశేఖర్ అనే బిరుదుతో సత్కరించింది. 1997లో ఫిల్మ్‌ఫేర్ సౌత్ జీవిత సౌఫల్య పురస్కారం అందుకున్నారు. ఆ త‌ర్వాత 2003లో కృష్ణకు ఎన్టీఆర్ జాతీయ పురస్కారం ద‌క్కింది. ఇక 1984లో రాజీవ్‌గాంధీ పిలుపుతో కాంగ్రెస్ పార్టీలో చేరారు.1989లో ఏలూరు నుంచి కాంగ్రెస్ తరపున ఎంపీగా పోటీ చేసి విజయం సాధించారు. రాజీవ్‌గాంధీ మరణంతో కృష్ణ ప్రత్యక్ష రాజకీయాలకు దూరమయ్యారు. అలా సినీ, రాజ‌కీయ రంగాల్లో ఒక వెలుగు వెలిగారు కృష్ణ‌. 


సూప‌ర్ స్టార్ కృష్ణ మొదటి భార్య ఇందిర‌. వీరికి ఇద్ద‌రు కొడుకులు, ముగ్గురు కూతుళ్లు ఉన్నారు. అయితే, కృష్ణ ఇందిర‌ను పెళ్లి చేసుకున్న నాలుగేళ్ల‌కే త‌న స‌హన‌టి విజ‌య నిర్మ‌ల‌ను రెండోపెళ్లి చేసుకున్నారు. కాగా.. 2019జూన్ లో విజ‌య నిర్మ‌ల మ‌ర‌ణించ‌గా.. 2023 సెప్టెంబ‌ర్ లో కృష్ణ మొద‌టి భార్య ఇందిర‌, అదే ఏడాది న‌వంబ‌ర్ 15న కృష్ణ త‌నువు చాలించారు. కృష్ణ మ‌ర‌ణాన్ని ఇప్ప‌టికీ జీర్ణించుకోలేక‌పోతున్నారు ఆయ‌న వేలాది మంది అభిమానులు. కృష్ణ జ‌యంతి సంద‌ర్భంగా ఆయ‌న‌కు నివాళులు అర్పిస్తున్నారు. 


Also Read: గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి ఆడియన్స్ రివ్యూ: పుష్ప ఫాస్ట్ ట్రాక్... ఎన్టీఆర్‌తో తీస్తే ఇంకా బాగుండేదా? జనాలు గొర్రెలు డైలాగ్ ఏంట్రా బాబూ!