Rashmika Mandanna: సౌత్, నార్త్ అనే తేడా లేకుండా వరుస సినిమాలతో దూసుకుపోతున్న ముద్దుగుమ్మ రష్మిక మందన్న. దేశ విదేశాల్లో ఈమెకు పెద్ద సంఖ్యలో అభిమానులు ఉన్నారు. రష్మికకు సంబంధించి ఏ చిన్న అప్ డేట్ వచ్చినా క్షణాల్లో సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. తాజాగా ఈమెకు సంబంధించిన ఫేక్ వీడియో ఒకటి నెట్టింట్లో హల్ చల్ చేసింది. ఈ వీడియోపై పలువురు తీవ్రంగా స్పందించారు. ఇలాంటి వీడియోలను రూపొందించే వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. ఈ నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం రియాక్ట్ అయ్యింది. ఇలాంటి మార్ఫింగ్ వీడియోలు అత్యంత ప్రమాదకరమైన చర్య గా అభివర్ణించింది. మార్ఫింగ్ వీడియోలను కట్టడి చేయాల్సిన బాధ్యత సదరు సామాజిక మాధ్యమాలదేనని స్పష్టం చేసింది.
రష్మిక ఫేక్ వీడియోలో ఏం ఉందంటే?
నిన్నటి నుంచి సోషల్ మీడియాలో రష్మిక కు సంబంధించిన ఫేక్ వీడియో బాగా సర్క్యులేట్ అవుతుంది. ఈ వీడియోలో ఆమె డీప్ నెక్ బ్లాక్ డ్రెస్ వేసుకుని లిఫ్ట్ లోకి వచ్చినట్లు మార్ఫింగ్ వీడియోను క్రియేట్ చేశారు. ఈ వీడియోను చూసి నెటిజన్లు షాక్ అయ్యారు. అయితే, ఈ వీడియో నిజం కాదని ఓ జర్నలిస్టు వెల్లడించారు. అంతేకాదు, ఒరిజినల్ వీడియోను, ఫేక్ వీడియోను ఆయన పోస్టు చేశారు. వాస్తవానికి ఈ వీడియో జరా పటేల్ అనే యువతిదని చెప్పారు. ఆ అమ్మాయి ఫేస్ ను ఎడిట్ చేసి రష్మిక ఫేస్ పెట్టారని చెప్పారు. ఈ నేపథ్యంలో సదరు వీడియోపై నెటిజన్లు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. తప్పుడు వీడియోలను రూపొందించే వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.
రష్మిక వీడియో వ్యవహారంపై స్పందించిన కేంద్ర ఐటీ శాఖ
రష్మిక మార్ఫింగ్ వీడియోపై కేంద్ర ప్రభుత్వం స్పందించింది. ఇంటర్నెట్‌ను వినియోగించే వారందరికీ భద్రత కల్పించే విషయంలో మోదీ ప్రభుత్వం కఠినంగా వ్యవహరిస్తుందని కేంద్ర ఐటీ శాఖ సహాయ మంత్రి రాజీవ్ చంద్రశేఖర్ వెల్లడించారు. ఈ ఏప్రిల్‌లో జారీ చేసిన ఐటీ నిబంధల ప్రకారం.. సోషల్ నెట్వర్కింగ్ సైట్లు చట్ట పరమైన బాధ్యతలను పాటించాల్సి ఉంటుందని చెప్పారు. ఏ వినియోగదారు కూడా తమ అకౌంట్ నుంచి నకిలీ లేదంటే తప్పుడు సమాచారాన్ని పోస్టు చేయకుండా చూసుకోవాలని వెల్లడించారు. ఒకవేళ తప్పుడు సమాచారాన్ని పోస్టు చేసినా, దాన్ని 36 గంటల్లోగా తొలగించాలని చెప్పారు. ఈ నింబధనలు పాటించకపోతే చట్టపరమైన చర్యలకు గురి కావాల్సి వస్తుందని చెప్పారు. మార్ఫింగ్ అనేది అత్యంత ప్రమాదకరమైన చర్యగా అభివర్ణించిన రాజీవ్.. ఈ సమస్యను సోషల్ నెట్వర్కింగ్ సైట్లే పరిష్కరించాలని తేల్చి చెప్పారు.
అటు ఈ వీడియో వ్యవహారంపై బాలీవుడ్ ఆగ్ర హీరో అమితాబ్ బచ్చన్ కూడా స్పందించారు. ఈ ఫేక్ వీడియో క్రియేట్ చేసిన వారిపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలన్నారు. మున్ముందు ఇలాంటి ఘటనలు జరగకుండా తగు చర్యలు తీసుకోవాలని కోరారు.
Read Also: సోషల్ మీడియోలో రష్మిక వీడియో వైరల్, అమితాబ్ బచ్చన్ ఆగ్రహం, కఠిన చర్యలు తీసుకోవాలంటూ ట్వీట్
ముఖ్యమైన, మరిన్ని ఆసక్తికర కథనాల కోసం ‘టెలిగ్రామ్’లో ‘ఏబీపీ దేశం’లో జాయిన్ అవ్వండి.
Join Us on Telegram: https://t.me/abpdesamofficial