Twisters Box Office Collections: ఇండియన్ బాక్సాఫీస్ వద్ద హాలీవుడ్ సినిమాల హవా ఎప్పటినుండో కొనసాగుతోంది. ఇంగ్లీష్ సినిమాలు ఇక్కడ భారీ ఎత్తులో విడుదల అవ్వడం కామన్‌గా జరిగేదే. ఒకవేళ అలా విడుదలయిన సినిమాలకు మంచి మౌత్ టాక్ లభిస్తే.. వాటి కలెక్షన్స్‌కు అడ్డు ఉండదు. ఏకంగా ఇండియన్ సినిమాలను ఇండియన్ బాక్సాఫీస్ వద్దే ఓడించేంత రేంజ్‌లో కలెక్షన్స్ సాధిస్తాయి. ప్రస్తుతం ఒక ఇంగ్లీష్ మూవీ పరిస్థితి అలాగే ఉంది. ఏకంగా నాగ్ అశ్విన్, ప్రభాస్ కాంబినేషన్‌లో తెరకెక్కిన ‘కల్కి 2898 ఏడీ’ కలెక్షన్స్‌నే క్రాస్ చేసి దూసుకుపోతోంది ఈ మూవీ. అంతే కాకుండా మరికొన్ని ఇండియన్ సినిమాలను కూడా వెనక్కి తోసింది.


నార్త్ అమెరికాలో హవా..


తాజాగా ఇంగ్లీష్ సినిమా అయిన ‘ట్విస్టర్స్’ దేశవ్యాప్తంగా విడుదలయ్యింది. జులై 19న ఈ మూవీ విడుదల అనగానే ప్రేక్షకులు దీని గురించి పెద్దగా పట్టించుకోలేదు. కానీ మెల్లగా మౌత్ టాక్ వల్ల ఫస్ట్ వీకెండ్‌లో ఈ మూవీకి వెళ్లినవారి సంఖ్య పెరిగిపోయింది. అలా ఇప్పుడు ఈ సినిమా ఒక రేంజ్‌లో కలెక్షన్స్‌తో దూసుకుపోతోంది. 1996లో విడుదలయిన ‘ట్విస్టర్స్’కు ఇది సీక్వెల్. నార్త్ అమెరికాలో పలు చిత్రాల రికార్డులను బీట్ చేస్తోంది ఈ మూవీ. ఇప్పటికే అక్కడ 4,151 థియేటర్లలో ఈ సినిమా రన్ అవుతోంది. దానివల్ల 80.5 మిలియన్ డాలర్ల కలెక్షన్స్ సాధించింది. కేవలం నార్త్ అమెరికాలోనే ఇప్పటికీ ‘ట్విస్టర్స్’ 90 మిలియన్ డాలర్ల కలెక్షన్స్ సాధించింది.


ఇండియన్ సినిమాలకు పోటీ..


ఓవర్సీస్‌లో ‘ట్విస్టర్స్’కు 44 మిలియన్ కలెక్షన్స్ దక్కాయి. మొత్తంగా ఈ మూవీ నాలుగు రోజుల్లోనే ప్రపంచవ్యాప్తంగా 134 మిలియన్ డాలర్ల కలెక్షన్స్ సాధించింది. అంటే ఇండియన్ కరెన్సీలో దీని విలువ రూ.1171 కోట్లు. షారుఖ్ ఖాన్ హీరోగా నటించిన ‘పఠాన్’ ప్రపంచవ్యాప్తంగా రూ.1048 కోట్ల కలెక్షన్స్ కొల్లగొట్టగా.. ‘జవాన్’ రూ.1150 కోట్ల కలెక్షన్స్ సాధించింది. రణబీర్ కపూర్ ‘యానిమల్’కు ప్రపంచవ్యాప్తంగా రూ.930 కోట్ల కలెక్షన్స్ దక్కాయి. ‘కల్కి 2898 ఏడీ’కి రూ.1000 కోట్ల మార్క్ టచ్ అవ్వడానికి నెల రోజులు పట్టింది. దీన్నిబట్టి చూస్తే ‘ట్విస్టర్స్’ ఒక్కసారిగా అన్ని ఇండియన్ సినిమాల రికార్డులను బ్రేక్ చేసిందని ప్రేక్షకులు ఆశ్చర్యపోతున్నారు.


నిపుణులు షాక్..


‘ట్విస్టర్స్’ ఫస్ట్ వీకెండ్ కలెక్షన్స్ చాలామంది ఇండస్ట్రీ నిపుణులను షాక్‌కు గురిచేశాయి. వాళ్లు ఊహించిన దానికంటే ఈ సినిమా 30 మిలియన్ డాలర్లు ఎక్కువగా కలెక్ట్ చేసిందని అంటున్నారు. ఈ సినిమా పర్ఫార్మెన్స్ చూస్తుంటే గతేడాది ఇదే సమయానికి విడుదలయిన ‘ఓపెన్‌హైమర్’ గుర్తొస్తుందని చెప్తున్నారు. కలెక్షన్స్ విషయంలో ఒకేలాగా ఉన్నా.. ఈ రెండూ వేర్వేరు సినిమాలు అని స్పష్టం చేస్తున్నారు. 1996లో విడుదలయిన ‘ట్విస్టర్స్’ హిట్ అవ్వడంతో దాని సీక్వెల్‌గా తెరకెక్కిన ఈ ‘ట్విస్టర్స్’పై ప్రేక్షకుల్లో అంచనాలు భారీగానే ఉన్నాయి. ఈ మూవీని లీ ఐసాక్ చంగ్ డైరెక్ట్ చేశారు. ఇందులో గ్లెన్ పావెల్, డైసీ ఎడ్జర్ జోన్స్ లీడ్ రోల్స్‌లో నటించారు.


Also Read: ఇండియాలో ‘డెడ్‌పూల్ అండ్ వోల్వరైన్‌’కు సూపర్ క్రేజ్ - ప్రీ బుకింగ్స్ విషయంలో సినిమా రికార్డ్