Salman Khan house firing Case Charge Sheet Details: బాలీవుడ్ హీరో స‌ల్మాన్ ఖాన్ ఇంటి ద‌గ్గ‌ర కాల్పులు జ‌రిగిన విష‌యం తెలిసిందే. అయితే, ఆ కేసుకు సంబంధించి సంచ‌ల‌న విష‌యాలు బ‌య‌టికి వ‌స్తున్నాయి. కేసుకు సంబంధించి ఛార్జ్ షీట్ దాఖ‌లు చేసిన ముంబై పోలీసులు దాంట్లో చాలా విష‌యాలు పొందుప‌రిచారు. అన్మోల్, విక్కీ కుమార్ గుప్త మ‌ధ్య జ‌రిగిన ఆడియో ట్రాన్స్ స్క్రిప్ష‌న్ గురించి పేర్కొన్నారు. కేసులో ప్ర‌ధాన నిందితుడు అన్మోల్ విక్కీకి చాలా సూచ‌న‌లు చేశాడు. భ‌య‌ప‌డొద్ద‌ని, ధైర్యంగా కాల్చాల‌ని కూడా సిగ్న‌ల్ యాప్ ద్వారా చెప్పిన‌ట్లు పోలీసులు ఛార్జ్ షీట్ లో చెప్పారు. 


ఛార్జ్ షీట్ లో ఏముందంటే? 


స‌ల్మాన్ ఖాన్ ఇంటి ద‌గ్గ‌ర జ‌రిగిన కాల్పులకు ముందురోజే అన్మోల్ బిష్నోయ్ అనే వ్య‌క్తి కాల్పులు జ‌రిపిన వ్య‌క్తితో సిగ్న‌ల్ యాప్ ద్వారా మాట్లాడిన‌ట్లు పోలీసులు గుర్తించారు. కాల్పుల‌కు సంబంధించి సూచ‌న‌లు చేసిన‌ట్లు చెప్పారు. “హెల్మెట్ వేసుకోకుండా.. సిగ్రెట్ తాగుతూ.. భ‌యం లేకుండా కాల్చు. అర నిమిషమైనా, నిమిష‌మైనా సిగ‌రెట్ తాగుతూ కాలిస్తే.. సీసీటీవీలో అది రికార్డ్ అవుతుంది. అప్పుడు నువ్వు ఎలాంటి భ‌యం లేకుండా ఈ ప‌నిచేసిన‌ట్లు వాళ్ల‌కి తెలుస్తుంది. మ‌నం భ‌య‌ప‌డ‌టం లేదు అనేది అవ‌త‌లి వాళ్ల‌కు తెలియాలి” అని అన్మోల్ చెప్పిన‌ట్లుగా ట్రాన్స్ స్క్రిప్ట్ ద్వారా చెప్పిన‌ట్లు పోలీసులు ఛార్జ్ షీట్ లో చెప్పారు. గుప్తా, సాగ‌ర్ తో అన్మోల్ ఈ సిగ్న‌ల్ యాప్ ద్వారానే ట‌చ్ లో ఉన్న‌ట్లు పోలీసులు పేర్కొన్నారు. అంతేకాకుండా ఒక‌నొక‌టైంలో నిందితులు ఇద్ద‌రు గుజ‌రాత్ జైల్ లో ఉన్న లారెన్స్ బిషోయ్ తో కూడా మాట్లాడిన‌ట్లు గుర్తించిన‌ట్లు పోలీసులు ఛార్జ్ షీట్ లో చెప్పారు. కాల్పులు జ‌రిపితే పెద్ద పేరు వ‌స్తుంద‌ని, మీడియాలో కూడా బాగా క‌వ‌ర్ చేస్తార‌ని దాంతో మీరు హీరోలు అవ్వొచ్చు అని అన్మోల్ విక్కీ, సాగ‌ర్ కి చెప్పార‌ని అన్నారు. ఇలా చేస్తే ముంబైలో వాళ్ల గ్యాంగ్ కి ఫేమ్ వ‌స్తుంద‌ని, దాని కోస‌మే ఈ దాడి చేసిన‌ట్లుగా కూడా తెలుస్తోంద‌ని అన్మోల్ గ్యాంగ్ భావించిన‌ట్లు పోలీసులు చెప్పారు. 


ఛార్జ్ షీట్ లో ఆరుగురి పేర్లు.. 


ముంబై పోలీసులు ఛార్జ్ షీట్ లో ఆరుగురు పేర్ల‌ను ఉంచారు. వారిలో గుప్తా, పాల్, గుజ‌రాత్ జైల్ లో ఉన్న లారెన్స్, అన్మోల్, రాతార‌మ్ స్వామి ప్ర‌ధాన నిందితులు. 2023లోనే కాల్పుల‌కు ప్లాన్ చేశార‌ని పోలీసులు గుర్తించారు. ఇదే విష‌యాన్ని ఛార్జ్ షీట్ లో కూడా చెప్పారు. అన్మోల్ పాల్, గుప్త ని ఒక పెద్ద ప‌నికోసం క‌లిశార‌ని అన్నారు. ఇక నిందితులు ఇద్ద‌రు కాల్పులు జ‌రిపిన త‌ర్వాత అక్క‌డ నుంచి గుజ‌రాత్ కి త‌ప్పించుకుని వెళ్లి.. అన్మోల్ తో వీడియో కాల్స్ ద్వారా కాంటాక్ట లో ఉన్నార‌ని పోలీసులు చెప్పారు. 


ఇది ఇలా ఉంటే గ్యాంగ్ స్ట‌ర్ లారెన్స్ బిష్ణోయ్ త‌న‌ను చంపేందుకు చూశాడ‌ని స‌ల్మాన్ కామెంట్స్ చేశాడు. తనను చంపేందుకే ఇంటి ముందు కాల్పులు జరిపించాడని చెప్పాడు. తనతో పాటు తన కుటంబం మొత్తాన్ని హత్య చేయాలని చూసినట్టు వివరించాడు. ముంబయి క్రైమ్ బ్రాంచ్‌కి వాంగ్మూలం ఇచ్చాడు స‌ల్మాన్. ఇక ఇప్పుడు లారెన్స్ తో నిందితులు కాంటెక్ట్ లోకి వ‌చ్చార‌ని పోలీసులు ఛార్జ్ షీట్ లో దాఖ‌లు చేశారు. ఈ ఏడాది ఏప్రిల్ 14న స‌ల్మాన్ ఖాన్ ఇంటి ద‌గ్గ‌ర కొంత‌మంది కాల్పుల‌కు తెగ‌బ‌డ్డ విష‌యం తెలిసిందే. 


Also Read: పేరు మార్చుకున్న పూరి జగన్నాథ్ తనయుడు - ఇప్పటికైనా కలిసి వచ్చేనా?