True Lover Movie OTT: ఈరోజుల్లో ప్రేక్షకులకు.. ముఖ్యంగా యూత్‌కు కనెక్ట్ అయ్యే సినిమాలే ఎక్కువగా హిట్స్‌ను అందుకుంటున్నాయి. ఎక్కువగా ప్రమోషన్స్ లేకపోయినా.. సైలెంట్‌గా వచ్చి సూపర్ హిట్స్ అవుతున్నాయి. అలాంటి కేటగిరికి చెందిన సినిమానే ‘ట్రూ లవర్’. తమిళంలో ‘లవర్’ అనే టైటిల్‌తో, తెలుగులో ‘ట్రూ లవర్’ అనే టైటిల్‌తో ఈ సినిమా విడుదలయ్యింది. తమిళ నటుడు మణికందన్ లీడ్ రోల్‌లో నటించిన ఈ మూవీ.. యూత్‌ను బాగా ఆకట్టుకుంటోంది. అబ్బాయి, అమ్మాయి మధ్య ప్రేమలో వచ్చే సమస్యలపై ఈ సినిమా తెరకెక్కింది. తాజాగా థియేటర్లలో విడుదలయిన ‘ట్రూ లవర్’.. ఏ ఓటీటీలోకి వస్తుందా అని చర్చలు మొదలయ్యాయి.
‘గుడ్ నైట్’ తరహాలోనే..
ప్రభురామ్ వ్యాస్ దర్శకత్వం వహించిన ‘ట్రూ లవర్’ ఇటీవల థియేటర్లలో విడుదలయ్యింది. ఎన్నో తెలుగు సినిమాల మధ్య పోటీగా ఈ తమిళ డబ్బింగ్ చిత్రం విడుదలయినా కూడా యూత్ చాలామంది దీనిని చూడడానికి థియేటర్లకు వెళుతున్నారు. అందుకే యూత్ అటెన్షన్‌ను సంపాదించిన ఈ సినిమా ఓటీటీ స్ట్రీమింగ్ హక్కులను డిస్నీ ప్లస్ హాట్‌స్టార్ దక్కించుకున్నట్టు తెలుస్తోంది. తక్కువ బడ్జెట్ సినిమానే అయినా.. ‘ట్రూ లవర్’ ఓటీటీ రైట్స్ కోసం హాట్‌స్టార్ భారీగానే ఖర్చు పెట్టిందట. మణికందన్ హీరోగా నటించిన చివరి చిత్రం ‘గుడ్ నైట్’ కూడా ఈ ఓటీటీలోనే స్ట్రీమ్ అయ్యింది. ఇప్పుడు ‘ట్రూ లవర్’ హక్కులను కూడా ఈ ఓటీటీనే దక్కించుకోవడం విశేషం.
ఆ రూల్ ప్రకారం..
‘ట్రూ లవర్’ ఓటీటీ హక్కులను హాట్‌స్టార్ దక్కించుకుందని తెలిసినా.. స్ట్రీమింగ్ ఎప్పటినుండి ప్రారంభమవుతుందో ఇంకా క్లారిటీ లేదు. మామూలుగా ఈరోజుల్లో థియేటర్లలో సినిమా విడుదలయిన 30 రోజుల్లోనే ఓటీటీలోకి వచ్చేస్తోంది. ఆ ప్రకారం చూస్తే.. ‘ట్రూ లవర్’ కూడా మార్చి రెండో వారంలో ఓటీటీ సబ్‌స్క్రైబర్స్ ముందుకు వచ్చే అవకాశం కనిపిస్తోంది. ఈ మూవీలో మణికందన్‌కు జోడీగా తెలుగమ్మాయి శ్రీ గౌరీ ప్రియా నటించింది. ఇప్పటికే ఈ భామ.. ‘రైటర్ పద్మభూషణ్’లో కీలక పాత్ర పోషిస్తూ వెండితెరకు పరిచయమయ్యింది. తాజాగా విడుదలయిన యూత్‌ఫుల్ ఎంటర్‌టైనర్ ‘మ్యాడ్’లో కూడా ఒక హీరోయిన్‌గా అలరించింది. ఇప్పుడు ఏకంగా సోలో హీరోయిన్‌గా కోలీవుడ్‌లో అడుగుపెట్టింది.
తెలుగు మార్కెట్‌పై ఫోకస్..
ఇక ఈ సినిమా విషయానికొస్తే.. 'ట్రూ లవర్'లో యువతీ యువకులు రిలేట్ అయ్యే మూమెంట్స్ ఉన్నాయి. సీన్లతో కనెక్ట్ కావచ్చు. కానీ, కథతో కనెక్ట్ కావడం కష్టం. కాంటెంపరరీగా తీశారు కానీ కథను కన్విన్సింగ్‌గా చెప్పలేదు. హీరో హీరోయిన్లు బాగా చేశారు. మ్యూజిక్ బావుంది. ప్రచార చిత్రాలు, పాటలు చూసి ఎక్కువ అంచనాలు పెట్టుకోవద్దు. యువతను మెప్పించే, వాళ్లతో విజిల్స్ వేయించే సన్నివేశాలకు 'ట్రూ లవర్'లో లోటు లేదు. మణికందన్ హీరోగా నటించిన ‘గుడ్ నైట్’ చిత్రాన్ని హాట్‌స్టార్‌లో తెలుగులో చూసి తెలుగు ప్రేక్షకులు సైతం ఫిదా అయిపోయారు. అందుకే ఇతర తమిళ హీరోల్లాగా తాను కూడా టాలీవుడ్ మార్కెట్‌పై ఫోకస్ చేయాలనే ఉద్దేశ్యంతో తమిళంలో ‘లవర్’గా తెరకెక్కించిన సినిమాను తెలుగులో ‘ట్రూ లవర్’ పేరుతో విడుదల చేశాడు.
Also Read: ఆ సమయంలో నా పక్కనే ఉంది - రెజీనాతో రిలేషన్‌పై సందీప్ కిషన్ క్లారిటీ