Sundeep Kishan: ఆ సమయంలో నా పక్కనే ఉంది - రెజీనాతో రిలేషన్‌పై సందీప్ కిషన్ క్లారిటీ

Sundeep Kishan: టాలీవుడ్ యంగ్ హీరోహీరోయిన్ రెజీనా, సందీప్ కిషన్ తమ కెరీర్ మొదట్లోనే కలిసి సినిమాలు చేశారు. అప్పటినుండి వీరిద్దరూ లవ్‌లో ఉన్నారని వార్తలు వచ్చాయి. తాజాగా వీటిపై సందీప్ క్లారిటీ ఇచ్చాడు.

Continues below advertisement

Sundeep Kishan about Regina: సినీ పరిశ్రమలో హీరో, హీరోయిన్ల మధ్య ప్రేమ అనేది ఉన్నా లేకపోయినా.. ఆడియన్సే వారి క్లోజ్‌నెస్ చూసి వారిద్దరూ ప్రేమలో ఉన్నారని రూమర్స్ క్రియేట్ చేస్తుంటారు. కొన్నిసార్లు ఆ రూమర్స్.. నిజమే అయినా చాలాసార్లు మాత్రం ఇనవ్నీ కేవలం కట్టుకథలే అని తేలిపోతుంది. అలా టాలీవుడ్‌లో గత కొంతకాలంగా హీరో సందీప్ కిషన్, హీరోయిన్ రెజీనా కసాండ్ర కూడా రిలేషన్‌షిప్‌లో ఉన్నారని వార్తలు వినిపిస్తున్నాయి. వీరిద్దరూ బయట ఎక్కువగా కలిసి కనిపించకపోయినా.. సోషల్ మీడియాలో మాత్రం ఎప్పుడూ టచ్‌లోనే ఉంటారు. అది చూసిన చాలామంది ప్రేక్షకులు వీరిద్దరూ ప్రేమలో ఉన్నారని ఫిక్స్ అయిపోయారు. తాజాగా ఆ విషయంపై క్లారిటీ ఇచ్చాడు సందీప్ కిషన్.

Continues below advertisement

ఉన్నది ఉన్నట్టుగా చెప్పేశాడు..

ప్రస్తుతం సందీప్ కిషన్, రెజీనా.. ఎవరి కెరీర్‌లో వారు బిజీగా ఉన్నారు. వరుసగా సినిమాలు, ఓటీటీ కంటెంట్‌తో రెజీనా బిజీగా ఉండగా.. కొత్త కొత్త కథలను ఎంచుకుంటూ సందీప్ బిజీ అయిపోయాడు. త్వరలోనే ‘ఊరు పేరు భైరవకోన’ అనే కొత్త కథతో ప్రేక్షకుల ముందుకు రానున్నాడు. ఫిబ్రవరీ 16న ఈ సినిమా రిలీజ్‌కు సిద్ధమవుతుండగా.. ప్రమోషన్స్‌లో స్పీడ్ పెంచాడు సందీప్. అదే సమయంలో తన పర్సనల్ లైఫ్ గురించి, రిలేషన్‌షిప్స్ గురించి సందీప్‌కు ప్రశ్న ఎదురయ్యింది. ఆ ప్రశ్నలకు సందీప్ ఏ మాత్రం ఆలోచించకుండా.. ఉన్నది ఉన్నట్టుగా చెప్పేసి ఆడియన్స్‌ను షాక్‌కు గురిచేశాడు. ఆ తర్వాత రెజీనాతో ఉన్న రిలేషన్‌పై కూడా మాట్లాడాడు.

ముగ్గురు, నలుగురు అమ్మాయిలతో ప్రేమ..

ముందుగా ‘ఊరు పేరు భైరవకోన’ ప్రమోషన్స్‌లో మాట్లాడుతూ.. ఈ సినిమాను ఫిబ్రవరీ 9న విడుదల చేయాలని చాలా ప్రయత్నించామని చెప్పుకొచ్చాడు సందీప్ కిషన్. ఆరోజు విడుదల చేయడం అస్సలు కుదరలేదని, తనతో పాటు మూవీ టీమ్ అంతా కష్టపడినా కూడా రిలీజ్ వాయిదా వేయాల్సి వచ్చిందని వాపోయాడు. ఇక సినిమాలు చేయడం వరకే మన పని అని, అది ఎప్పుడు రిలీజ్ అవుతుంది వంటివి అస్సలే మన చేతిలో ఉండవని అన్నాడు. ఆ తర్వాత తన రిలేషన్‌షిప్స్ గురించి మాట్లాడాడు. తనకు చాలా లవ్ స్టోరీలు ఉన్నాయని.. ముగ్గురు, నలుగురు అమ్మాయిలను ప్రేమించానని చెప్పి షాకిచ్చాడు. ప్రతీ అమ్మాయితో కొన్నేళ్ల వరకు డిఫరెంట్ టైమ్స్‌లో రిలేషన్‌లో ఉన్నానని బయటపెట్టాడు ఈ యంగ్ హీరో.

అన్నీ తనకు తెలుసు..

ఇక రిలేషన్‌షిప్స్ గురించి ప్రస్తావన రావడంతో వెంటనే యాంకర్‌కు రెజీనా గుర్తొచ్చింది. రెజీనా పుట్టినరోజున సందీప్ చేసిన ట్వీట్‌ను తనకు చూపించాడు. అందులో ‘హ్యాపీ బర్త్ డే పాపా.. లవ్ యూ అండ్ విషింగ్ యూ ద బెస్ట్ ఆఫ్ ఎవ్రీథింగ్’ అని సందీప్ కిషన్ పోస్ట్ చేశాడు. దానిపై హీరో స్పందించాడు. రెజీనా తనకు చాలా క్లోజ్ ఫ్రెండ్ అని, తన లవ్ స్టోరీలు, బ్రేకప్ స్టోరీలు అన్నీ తనకు తెలుసని బయటపెట్టాడు సందీప్. ఆ సమయంలో తను పక్కనే ఉందని చెప్పుకొచ్చాడు. ఇక 15 ఏళ్ల నుండి ఫ్రెండ్‌షిప్ అంటే ఆ మాత్రం క్లోజ్‌నెస్ ఉండడంలో తప్పు లేదన్నాడు. 

Also Read: పిచ్చోడా చచ్చిపోతావ్ అన్నారు - డాక్టర్లే షాకయ్యారు: నటుడు సురేష్

Continues below advertisement