Toxic Producers About Rumours: ‘కేజీఎఫ్’ సినిమాతో దేశ వ్యాప్తంగా గుర్తింపు నటుడు యష్. ఒకే ఒక్క సినిమాతో ఇండియన్ మూవీ లవర్స్ ను కనీవినీ ఎరుగని రీతిలో మెస్మరైజ్ చేశాడు. ప్రస్తుతం యష్ హీరోగా మలయాళ డైరెక్టర్ గీతూ మోహన్ దాస్ ‘టాక్సిక్’ అనే సినిమాను తెరకెక్కిస్తున్నారు. ఈ సినిమాను అనౌన్స్ చేసి చాలా రోజులు అవుతున్నా, ఎలాంటి అప్ డేట్స్ రావట్లేదు. రీసెంట్ గా ఈ సినిమాకు సంబంధించి చాలా ఊహాగానాలు వినిపిస్తున్నాయి. ఈ సినిమాలో హీరోయిన్లుగా నటిస్తున్న వాళ్లు వీరేనంటూ బోలెడు పేర్లు వినిపిస్తున్నాయి. ఈ సినిమాలో యష్ కు జోడీగా కియారా అద్వానీ హీరోయిన్ గా నటిస్తుందని తొలుత వార్తలు వచ్చాయి. ఆ తర్వాత శృతి హాసన్ నటిస్తున్నట్లు టాక్ వినిపిస్తుంది. గత కొద్ది రోజులుగా వీరిద్దరు కాదని సాయి పల్లవి, కరీనా కపూర్ పేర్లు వినిపిస్తున్నాయి. ఈ నేపథ్యంలోఈ ఊహాగానాలపై చిత్ర నిర్మాణ సంస్థ క్లారిటీ ఇచ్చింది.  


నటీనటుల వివరాలను అధికారికంగా ప్రకటిస్తామన్న నిర్మాణ సంస్థ


‘టాక్సిక్’ సినిమా గురించి సినీ అభిమానులలో ఉన్న క్యూరియాసిటీ చూస్తుంటే సంతోషంగా ఉందని చెప్పిన నిర్మాణ సంస్థ.. ఈ సినిమాలో హీరోయిన్ల గురించి వస్తున్న ఊహాగానాలను నమ్మకూడదని వెల్లడించింది. “’టాక్సిక్‌’ సినిమా కోసం మీ ఆసక్తిని గమనిస్తుంటే చాలా సంతోషంగా ఉంది. ఈ సినిమాలో నటీనటుల గురించి చాలా వార్తలు సోషల్ మీడియాలో హల్ చల్ చేస్తున్నాయి. అయితే, ఈ వార్తలకు ఎలాంటి ఆధారాలు లేవు. ఇవన్నీ కేవలం ఊహాగానాలు మాత్రమే. ఇలాంటి ఊహాగానాలను ఎవరూ నమ్మకూడదని కోరుతున్నాం. ‘టాక్సిక్’ మూవీకి సంబంధించి ఇప్పటికే నటీనటుల ఎంపిక పూర్తయ్యింది. త్వరలోనే అధికారికంగా ప్రకటిస్తాం. ఈ సినిమాను అద్భుతంగా తెరకెక్కించేందుకు చిత్రబృందం ప్రయత్నిస్తోంది. అఫీషియల్ అనౌన్స్ మెంట్ కోసం వేచి చూడాలని కోరుతున్నాం” అని వెల్లడించింది.   


2025 ఏప్రిల్ 10న ‘టాక్సిక్’ సినిమా విడుదల


యష్ కెరీర్ లో 19వ చిత్రంగా ‘టాక్సిక్’ తెరకెక్కుతోంది. ‘ఏ ఫెయిరీ టేల్‌ ఫర్‌ గ్రోన్‌ అప్స్‌’ అనే ట్యాగ్ లైన్ పెట్టారు. ‘KGF’ తర్వాత వస్తున్న సినిమా కావడంతో ప్రేక్షకులలో భారీగా అంచనాలు నెలకొన్నాయి. ఇప్పటికే ఈ సినిమాకు సంబంధించి విడుదలైన గ్లింప్స్ సినిమాపై భారీగా అంచనాలు పెంచాయి. వచ్చే ఏడాది(2025) ఏప్రిల్ 10న ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది. కెవిఎన్ ప్రొడక్షన్స్ ఈ చిత్రాన్ని ప్రతిష్టాత్మకంగా తెరకెక్కిస్తోంది. డ్రగ్స్‌ మాఫియా నేపథ్యంలో సాగే యాక్షన్‌ ఓరియెంటెడ్‌ చిత్రంగా ఈ మూవీ రూపొందుతోంది.  ప్రస్తుతం ప్రీ ప్రొడక్షన్ పనులు కొనసాగుతున్నాయి. త్వరలోనే ఈ సినిమా సెట్స్ మీదకు వెళ్లే అవకాశం ఉంది.     






Read Also: ‘టిల్లు స్వ్కేర్’ to ‘ది గోట్ లైఫ్’- ఈవారం థియేటర్లతో పాటు ఓటీటీలో అలరించే సినిమాలివే!