'రంగస్థలం'... గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ (Ram Charan) కెరీర్‌లో స్పెషల్ ఫిల్మ్. హీరోగా ఆ సినిమాకు ముందు ఆయనకు బోలెడు విజయాలు ఉన్నాయి. ఇండస్ట్రీ హిట్ ఫిల్మ్ 'మగధీర' సైతం ఉంది. అయితే... అంతకు ముందు సినిమాల్లో కనిపించిన చరణ్ వేరు, 'రంగస్థలం'లో కనిపించిన చరణ్ వేరు. నటుడిగా ఆయన స్థాయిని, స్థానాన్ని పెంచిన సినిమాగా నిలిచింది. ఇప్పుడు ఆ 'రంగస్థలం' కాంబోలో మరో సినిమా రెడీ అవుతోంది. ఇవాళ ఆ చిత్రాన్ని (RC 17 Movie) అధికారికంగా అనౌన్స్ చేశారు.
సుక్కు దర్శకత్వంలో చరణ్...
RC 17 Film అనౌన్స్ చేశారోచ్!
రామ్ చరణ్ హీరోగా క్రియేటివ్ జీనియస్ సుకుమార్ (Sukumar) దర్శకత్వంలో ఓ పాన్ ఇండియా సినిమా రూపొందుతోంది. 'రంగస్థలం' తర్వాత వాళ్లిద్దరూ కలిసి చేస్తున్న చిత్రమిది. 'రంగస్థలం' చిత్రాన్ని నిర్మించిన మైత్రీ మూవీ మేకర్స్ సంస్థ ఈ సినిమాను సైతం ప్రొడ్యూస్ చేస్తోంది. సుకుమార్ రైటింగ్స్ సంస్థ నిర్మాణ భాగస్వామి. నవీన్ ఎర్నేని, రవిశంకర్ యలమంచిలి నిర్మాతలు.
హీరోగా రామ్ చరణ్ 17వ చిత్రమిది. అందుకని, RC 17 Movie అని పిలుస్తున్నారు. సినిమా ప్రకటనతో హీరో, దర్శకుడు దిగిన ఫోటోలను చిత్ర నిర్మాణ సంస్థ విడుదల చేసింది. ఈ చిత్రానికి దేవి శ్రీ ప్రసాద్ సంగీత దర్శకుడు. ఈ ఏడాది చిత్రీకరణ ప్రారంభించడంతో పాటు 2025 లాస్ట్ క్వార్ట్రర్ లో సినిమా విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నారు.
'ఆర్ఆర్ఆర్'తో రామ్ చరణ్ గ్లోబల్ స్టార్ అయితే... 'పుష్ప'తో సుకుమార్ ఇంటర్నేషనల్ ఆడియన్స్‌ను మెప్పించారు. ఇప్పుడు వీళ్లిద్దరి కలయికలో సినిమా అంటే నేషనల్, ఇంటర్నేషనల్ ఆడియన్స్ ఎదురు చూస్తారు. అందుకు తగ్గట్టు సుకుమార్ స్క్రిప్ట్ రెడీ చేశారని తెలిసింది.
Also Read: పృథ్వీరాజ్ సుకుమారన్ 'ది గోట్ లైఫ్' ఫస్ట్ రివ్యూ వచ్చేసింది - సినిమా ఎలా ఉందంటే?
'రంగస్థలం' తర్వాత హీరోగా రెండు సినిమాలు, ప్రత్యేక పాత్రలో ఓ సినిమా చేశారు రామ్ చరణ్. 'వినయ విధేయ రామ', 'ఆర్ఆర్ఆర్: రౌద్రం రణం రుధిరం', 'ఆచార్య' సినిమాలు విడుదల చేశారు. ప్రస్తుతం సౌత్ ఇండియన్ స్టార్ ఫిల్మ్ మేకర్ శంకర్ దర్శకత్వంలో 'గేమ్ ఛేంజర్' చేస్తున్నారు. దర్శకుడు సుకుమార్ విషయానికి వస్తే... 'రంగస్థలం' తర్వాత 'పుష్ప: ది రైజ్' ఒక్కటే విడుదల చేశారు. ప్రస్తుతం 'పుష్ప: ది రూల్' చేస్తున్నారు. ఆ సినిమా పూర్తి అయిన తర్వాత రామ్ చరణ్ కొత్త సినిమా వర్క్ స్టార్ట్ చేస్తారని తెలుస్తోంది.
రామ్ చరణ్ హీరోగా...
గురుశిష్యులు ఒకేసారి!
రామ్ చరణ్ ఇటీవల తన 16వ సినిమాను పూజా కార్యక్రమాలతో ప్రారంభించారు. ఆ సినిమాకు 'ఉప్పెన' ఫేమ్ సానా బుచ్చిబాబు దర్శకుడు. మైత్రీ మూవీ మేకర్స్ సమర్పణలో ఆ సినిమా తెరకెక్కుతోంది. 'ఉప్పెన'తో పాటు 'రంగస్థలం', 'పుష్ప' సినిమాలను సైతం మైత్రీ మూవీ మేకర్స్ ప్రొడ్యూస్ చేస్తోంది. ఇప్పుడు రామ్ చరణ్ హీరోగా గురుశిష్యులు సుకుమార్, బుచ్చి బాబులతో ఒకేసారి సినిమాలు అనౌన్స్ చేసింది. ఈ రెండు కాకుండా స్టార్ హీరోలతో పలు భారీ సినిమాలు ఆ సంస్థలో తెరకెక్కుతున్నాయి.
Also Read: మధురము కదా... విజయ్ దేవరకొండ, మృణాల్ జోడీ & శ్రేయా ఘోషల్ వాయిస్ - సాంగ్ ఎలా ఉందో విన్నారా?