Family Star Controversy: ఈరోజుల్లో థియేటర్లలో విడుదలయిన సినిమా.. ఓటీటీలోకి రాగానే నెటిజన్లలో దాని గురించి చర్చ మొదలయిపోతుంది. కొన్ని చిత్రాలపై ఓవర్ రేటెడ్, అండర్ రేటెడ్ అని కామెంట్స్ కూడా వినిపిస్తున్నాయి. తాజాగా విజయ్ దేవరకొండ నటించిన ‘ఫ్యామిలీ స్టార్’ మూవీ ఓటీటీలో విడుదలయ్యింది. ఓటీటీలోకి వచ్చేసిన రోజే ఈ మూవీని చూసిన చాలామంది ప్రేక్షకులు.. ఇందులోని ఒక సీన్‌ను తీవ్రంగా ఖండిస్తున్నారు. విజయ్ దేవరకొండపై, దర్శకుడు పరశురామ్‌పై విమర్శలు కురిపిస్తున్నారు. థియేటర్లలో ఈ సీన్‌ను పెద్దగా పట్టించుకోని ప్రేక్షకులు.. ఓటీటీలోకి రాగానే దీని గురించి తెగ ట్వీట్లు చేస్తున్నారు. (పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.)
Samantha About Childhood in Her Podcast: మయోసైటిస్ వ్యాధితో బాధపడుతున్న సమంత కొన్ని రోజులు సినిమాలకు బ్రేక్ ఇచ్చారు. అయితే, అభిమానులతో మాత్రం ఆమె టచ్ లోనే ఉంటున్నారు. సోషల్ మీడియా ద్వారా ఆమె అప్ డేట్స్ ఇస్తూనే ఉన్నారు. ఇక దాంట్లో భాగంగానే ఈ మధ్యే ఆమె యూట్యూబ్ వేదికగా ఒక పాడ్ కాస్ట్ ప్రారంభించారు. దాంట్లో తనకు సంబంధించిన విషయాలను షేర్ చేసుకుంటున్నారు సమంత. అయితే, ఇటీవల రిలీజ్ చేసిన 20వ పాడ్ కాస్ట్ లో సమంత తన చిన్నతనం గురించి మాట్లాడారు. చిన్నతనంలో లగ్జరీగా బతకలేదని అన్నారు. ఇంకా చాలా విషయాలు చెప్పారు. (పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.)
VakeelSaab Re Release In Theaters: ఇప్పుడు సినిమా ఇండస్ట్రీలో అంతా రీ రిలీజ్ ల మేనియా నడుస్తోంది. ఎన్ని కొత్త సినిమాలు వస్తున్నాయో, అన్ని రీ రిలీజ్ లు అవుతున్నాయి. ఇక ప్రేక్షకులు కూడా ఓల్డ్ ఈజ్ గోల్డ్ అంటూ ఆ సినిమాలను చూసేందుకు ఆసక్తి చూపుతున్నారు. తమ అభిమాన హీరో వింటేజ్ యాక్టింగ్‌ను, వింటేజ్ లుక్‌ని మరోసారి తెరపై చూసేందుకు ఎగబడుతున్నారు. ఇప్పటికే చాలా సినిమాలు రీ రిలీజ్ అయిన సంగతి తెలిసిందే. త్వరలో పవన్ కల్యాణ్ నటించిన 'వకీల్ సాబ్' సినిమా రీ రిలీజ్ కాబోతోంది. (పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.)
Varalaxmi Sarathkumar About Child Abuse: వెండితెరపై లేడీ విలన్స్ అనేవారు అస్సలు కనిపించని సమయంలో లేడీ విలన్‌గా వచ్చిన మొదటి ఛాన్స్‌తోనే టాలీవుడ్, కోలీవుడ్ మేకర్స్‌ను తనవైపు తిప్పుకుంది వరలక్ష్మి శరత్‌కుమార్. ఆ తర్వాత బ్యాక్ టు బ్యాక్ క్యారెక్టర్ ఆర్టిస్ట్‌గా అవకాశాలు వచ్చినా నో చెప్పకుండా చేసింది. ఇప్పుడు ఓవైపు క్యారెక్టర్ ఆర్టిస్ట్‌గా చేస్తూనే లేడీ ఓరియెంటెడ్ సినిమాల్లో హీరోయిన్‌గా కనిపిస్తోంది వరలక్ష్మి శరత్‌కుమార్. త్వరలోనే ‘శబరి’ అనే చిత్రంతో ప్రేక్షకులను అలరించడానికి సిద్ధమయ్యింది. ఈ మూవీ ప్రమోషన్స్‌లో భాగంగా తను పాల్గొన్న ఇంటర్వ్యూలో కొన్ని పర్సనల్ విషయాలు షేర్ చేసుకుంది వరలక్ష్మి. (పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.)
Sukumar About Suhas At Prasanna Vadanam Trailer Launch Event :'పుష్ప' సినిమాలో కేశవ క్యారెక్టర్ అందరికీ బాగా కనెక్ట్ అయ్యింది. హీరో పక్కనే ఉంటూ కామెడీ చేసే ఫుల్ లెంత్ క్యారెక్టర్ అది. అంతేకాకుండా కొన్ని సీన్లలో ఆ క్యారెక్టరే కీలకం కూడా. ఇక ఆ క్యారెక్టర్ లో జగదీశ్ నటించిన విషయం తెలిసిందే. అయితే, ముందు జగదీశ్ కి బదులుగా హీరో సుహాస్ ని ఆ క్యారెక్టర్ కోసం అనుకున్నారట డైరెక్టర్ సుకుమార్. సుహాస్ నటించిన 'ప్రసన్న వదనం' ట్రైలర్ లాంచ్ కి ముఖ్య అతిథిగా వచ్చిన డైరెక్టర్ సుకుమార్ సుహాస్ గురించి ఈ విషయాలు చెప్పారు. సుహాస్ అంటే తనకు చాలా ఇష్టం అని, నేచురల్ గా నటిస్తాడని కొనియాడారు. (పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.)