'హిడింబ' రివ్యూ : మనుషులను తినే గిరిజన జాతి మహానగరానికి వస్తే?


'రాజు గారి గది' సిరీస్ సినిమాలతో విజయాలు అందుకున్న కథానాయకుడు అశ్విన్ బాబు (Ashwin Babu). మధ్యలో 'నేను నాన్న నా బాయ్‌ఫ్రెండ్స్' చేశారు. ఆయన హీరోగా నటించిన సినిమా 'హిడింబ' (Hidimba Movie) ఈ నెల 20న థియేటర్లలో విడుదల అవుతోంది. ఇందులో నందితా శ్వేతా (Nandita Swetha) కథానాయిక. ఈ సినిమా ప్రచార చిత్రాలు ఆకట్టుకున్నాయి. మరి, సినిమా ఎలా ఉంది? (పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి).


మహేష్ కుమార్తె గొప్ప మనసు - బర్త్‌డేకి నిరుపేద బాలికలకు సైకిళ్లను బహుమతి ఇచ్చిన సితార


సూపర్ స్టార్ మహేష్ బాబు - నమ్రతల కూతురు సితార ఘట్టమనేని (Sitara Ghattamaneni Birthday) పుట్టినరోజు ఈ రోజు. ఈ సందర్భంగా సితార తన గొప్ప మనసును చాటుకుంది. తండ్రి మహేష్ అడుగు జాడల్లోనే నడుస్తూ తన పుట్టినరోజును చాలా సింపుల్ గా జరుపుకుంది. బుర్రిపాలెంలోని మహేష్ బాబు ఫౌండేషన్ కు చెందిన కొంతమంది అమ్మాయిలతో సితార తన బర్త్ డే సెలబ్రేట్ చేసుకుంది. వాళ్లతో కలిసి కేక్ కట్ చేసి... వాళ్ళందరికీ తినిపించింది. అంతే కాకుండా ఆ బాలికలు అందరికి సైకిళ్ళను బహుమతిగా ఇచ్చింది. ఇందుకు సంబంధించిన వీడియోను నమ్రత తన సోషల్ మీడియా వేదికగా షేర్ చేశారు (పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి).


'ప్రాజెక్ట్ కె' అంటే ఏంటి - రేసులోకి కొత్త టైటిల్? ఈ రోజు రాత్రే అనౌన్స్ చేస్తారోచ్


పాన్ ఇండియా రెబల్ స్టార్ ప్రభాస్ (Prabhas) కథానాయకుడిగా రూపొందుతోన్న సైన్స్ ఫిక్షన్ సినిమా 'ప్రాజెక్ట్ కె'. (Project K Movie). నిన్నటి వరకు 'కె' అంటే 'కాలచక్ర' (తెలుగులో 'కాలచక్రం' అనుకోవచ్చు) అని వినబడింది. అయితే, రేసులోకి కొత్త టైటిల్ వచ్చింది. ఇప్పుడు 'కె' అంటే 'కలియుగ్' (తెలుగులో 'కలియుగం' అనొచ్చు) అంటున్నారు. 'కురుక్షేత్రం' టైటిల్ కూడా వినబడుతోంది (పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి).


తమన్నా ముద్దు పేరుతో చిరంజీవి పాట పాడితే


ఉత్తరాది అందాల భామ తమన్నా భాటియా (Tamannaah Bhatia)కు మన తెలుగు ప్రేక్షకులు ఇచ్చిన ముద్దు పేరు 'మిల్కీ బ్యూటీ' (Milky Beauty). ఆమె పాలరాతి శిల్పంలా ఉంటుందని అలా అంటుంటారు. అప్పుడు ఆ ముద్దు పేరు మీద ఓ పాట రాశారు. దానికి తమన్నాతో పాటు చిరంజీవి స్టెప్పులు వేశారు. ఆ పాట ఎలా ఉంటుందో రేపు అందరికీ తెలుస్తుంది (పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి).


ఏపీలో ‘బ్రో’ చిత్రానికి ఇబ్బందులు ఎదురవుతాయా?-నిర్మాత టీజీ విశ్వ ప్రసాద్ ఆసక్తికర వ్యాఖ్యలు!


పవర్ స్టార్ పవన్ కల్యాణ్, ఆయన మేనల్లుడు సాయి ధరమ్ తేజ్ కలిసి నటిస్తున్న లేటెస్ట్ సినిమా ‘బ్రో’. ఈ మల్టీ స్టారర్ మూవీకి నటుడు సముద్ర ఖని దర్శకత్వం వహిస్తున్నారు. దర్శకుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ స్క్రీన్ ప్లే, డైలాగ్స్ అందిస్తున్నారు. పీపుల్స్ మీడియా ఫ్యాక్టరీ బ్యానర్ పై టీజీ విశ్వప్రసాద్, వివేక్ కూచిబొట్ల ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్నారు. త్వరలో ఈ సినిమా విడుదలకానున్న నేపథ్యంలో నిర్మాత టీజీ విశ్వప్రసాద్ పలు విషయాలు వెల్లడించారు. మెగా ఫ్యామిలీకి చెందిన ఇద్దరు పెద్ద హీరోలతో కలిసి పని చేయడం ఎలా ఉంది? ఈ సినిమా తమ దగ్గరికి ఎలా వచ్చింది? పవన్ కల్యాణ్ ఈ సినిమాకు ఎలా ప్లస్ కాబోతున్నారు? అనే అంశాల గురించి వివరించారు (పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి).





ముఖ్యమైన, మరిన్ని ఆసక్తికర కథనాల కోసం ‘టెలిగ్రామ్’లో ‘ఏబీపీ దేశం’లో జాయిన్ అవ్వండి.
Join Us on Telegram: https://t.me/abpdesamofficial