టాలీవుడ్ అగ్ర దర్శకుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ ప్రస్తుతం సూపర్ స్టార్ మహేష్ బాబుతో 'గుంటూరు కారం' అనే సినిమా చేస్తున్న విషయం అందరికీ తెలిసిందే. ప్రస్తుతం షూటింగ్ దశలో ఉన్న ఈ సినిమాని హారిక అండ్ హాసిని క్రియేషన్స్ బ్యానర్ పై రాధాకృష్ణ నిర్మిస్తున్నారు. అయితే తాజాగా ఈ సినిమా కోసం మహేష్ బాబు తీసుకున్న రెమ్యూనరేషన్ వివరాలు బయటకు వచ్చాయి. లేటెస్ట్ టాలీవుడ్ రిపోర్ట్స్ ప్రకారం 'గుంటూరు కారం' సినిమా కోసం మహేష్ బాబు GST తో కలిపి ఏకంగా రూ.78 కోట్ల రెమ్యూనరేషన్ తీసుకున్నట్లు సమాచారం. టాలీవుడ్ సినీ ఇండస్ట్రీలోనే ఈ భారీ మొత్తం నాన్ ఇండియా సినిమాలకి సరికొత్త బెంజ్ మార్క్ ని క్రియేట్ చేసింది. దాని ప్రకారం నాన్ ఇండియా సినిమాకి అత్యధిక పారితోషికం తీసుకునే హీరోల్లో ఒకరిగా నిలిచారు సూపర్ స్టార్ మహేష్ బాబు.


అంతేకాకుండా ఇప్పటివరకు మహేష్ బాబు కెరియర్ లోనే ఇది హైయెస్ట్ రెమ్యూనరేషన్ అని చెప్పొచ్చు. దీంతో ప్రస్తుతం ఈ వార్త వైరల్ అవ్వగా, 'గుంటూరు కారం' కోసం మహేష్ ఈ రేంజ్ రెమ్యూనరేషన్ అందుకోవడం ఇండస్ట్రీలోనే హాట్ టాపిక్ గా మారింది. నాన్ ఇండియా సినిమాకి ఈ రేంజ్ రెమ్యునరేషన్ తీసుకున్నారంటే నెక్స్ట్ రాజమౌళితో పాన్ వరల్డ్ లెవెల్ లో మూవీ ఉంది. ఈ సినిమా కోసం మహేష్ ఇంకెంత రెమ్యూనరేషన్ తీసుకుంటారో అంటూ ఈ విషయం తెలిసిన పలువురు సినీ విశ్లేషకులు తమ అభిప్రాయాలను వ్యక్తం చేస్తున్నారు. కాగా ఇక ఈ సినిమాలో మహేష్ బాబు సరసన శ్రీ లీల, మీనాక్షి చౌదరి హీరోయిన్స్ గా నటిస్తున్నారు. వీరితోపాటు సినిమాలో మరి కొంతమంది ప్రముఖ నటీనటులు వివిధ కీలక పాత్రలు పోషిస్తున్నారు. ఎస్, ఎస్ తమన్ ఈ సినిమాకి సంగీతం అందిస్తున్నారు.


సుమారు రూ.200 కోట్ల భారీ బడ్జెట్ తో రూపొందుతున్న ఈ సినిమా 2024 సంక్రాంతి కానుకగా జనవరి 14 న ఆడియన్స్ ముందుకు రానుంది. కాగా ఇప్పటికే ఈ సినిమా నుంచి విడుదలైన టీజర్ గ్లిమ్స్ కి ప్రేక్షకుల నుంచి అనూహ్య స్పందన వచ్చింది. మహేష్ బాబును ఈసారి పక్కా మాస్ రోల్ లో త్రివిక్రమ్ చూపించబోతున్నట్లు గ్లిమ్స్ ద్వారా చెప్పకనే చెప్పారు. అంతేకాకుండా త్రివిక్రమ్ ఈ సినిమాని కమర్షియల్ ఫ్యామిలీ అండ్ యాక్షన్ గా రూపొందిస్తున్నారు.


'అతడు', 'ఖలేజా' వంటి సినిమాల తర్వాత మహేష్ -  త్రివిక్రమ్ కాంబినేషన్లో వస్తున్న సినిమా కావడంతో ఈ మూవీపై ప్రారంభ దశ నుంచి భారీ స్థాయిలో అంచనాలు నెలకొన్నాయి. ఇక ఆ అంచనాలకు తగ్గట్టే త్రివిక్రమ్ శ్రీనివాస్ ఈ సినిమాలో అన్ని కమర్షియల్ అంశాలను జోడించినట్లు తెలుస్తోంది. ఇప్పటికే మహేష్, త్రివిక్రమ్ కాంబోలో వచ్చిన 'అతడు', 'ఖలేజా' బాక్సాఫీస్ వద్ద కమర్షియల్ గా సక్సెస్ కాలేకపోయాయి. దీంతో ఈసారి ఎలాగైనా మహేష్ 'గుంటూరు కారం' తో భారీ కమర్షియల్ హిట్ అందుకోవాలని చూస్తున్నారు త్రివిక్రమ్. మరి ఈ సినిమా ఎలాంటి సక్సెస్ ని అందుకుంటుందో చూడాలి.


Also Read : మరో వెబ్ సిరీస్‌లో దగ్గుబాటి రానా - ఈసారి హిస్టారికల్ బ్యాక్ డ్రాప్‌తో!







Join Us on Telegram: https://t.me/abpdesamofficial