'బాహుబలి' సినిమాతో దేశవ్యాప్తంగా గుర్తింపు తెచ్చుకున్న దగ్గుపాటి రానా ప్రస్తుతం తనదైన సినిమాలతో ప్రేక్షకులను ఆకట్టుకుంటున్నాడు. సినిమాలతో పాటు ఈమధ్య వెబ్ సిరీస్లలో నటిస్తున్నాడు. ఇటీవల బాబాయ్ విక్టరీ వెంకటేష్ తో కలిసి ఈ హీరో నటించిన 'రానా నాయుడు' వెబ్ సిరీస్ మంచి రెస్పాన్స్ ని అందుకుంది. ఇదొక బోల్డ్ వెబ్ సిరీస్. దీనిపై ఎన్నో రకాల విమర్శలు, వివాదాలు తలెత్తాయి. కానీ వాటితోనే ఈ వెబ్ సిరీస్ భారీ స్పందనను కనబరిచింది. అయితే త్వరలోనే రానా మరో వెబ్ సిరీస్ తో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నారు. ఈసారి ఏకంగా హిస్టారికల్ బ్యాక్ డ్రాప్ తో వెబ్ సిరీస్ తీయబోతున్నట్లు తెలుస్తోంది. తాజాగా దగ్గుపాటి రానా ప్రభాస్ 'ప్రాజెక్ట్ K' మూవీ టీం తో కలిసి అమెరికా వెళ్ళిన సంగతి తెలిసిందే.
ప్రఖ్యాత శాన్ డీగో కామిక్ కాన్ వేదికపై 'ప్రాజెక్ట్ కె' టైటిల్ గ్లింప్స్ ని ఎంతో గ్రాండ్ గా విడుదల చేయబోతున్నారు మేకర్స్. ఈ క్రమంలోనే తన ఫ్రెండ్ ప్రభాస్ ని సపోర్ట్ చేసేందుకు రానా అమెరికా వెళ్లారని అందరూ అనుకున్నారు. కానీ అసలు విషయం వేరే ఉంది. ఇంతకీ మేటర్ ఏంటంటే.. రానా గ్లోబల్ వైడ్ గా తాను చేయబోయే నెక్స్ట్ ప్రాజెక్ట్స్ ని అనౌన్స్ చేసేందుకు వెళ్లినట్లు తెలుస్తుంది. ఈ క్రమంలోనే తన నెక్స్ట్ ప్రాజెక్ట్స్ గురించి వెల్లడించారు. అందులో చాళుక్యుల సామ్రాజ్యంపై స్వయంగా ఓ వెబ్ సిరీస్ చేస్తున్నట్లు తెలిపారు. చాళుక్యుల చరిత్ర నేపథ్యంలో 'లార్డ్స్ ఆఫ్ ది డెక్కన్' అనే పేరుతో వెబ్ సిరీస్ ని రాణా నిర్మించబోతున్నట్లు సమాచారం.
ఇక ఈ సిరీస్ ని ప్రఖ్యాత రచయిత అనిరుధ్ కన్నిసెట్టి రచించిన 'లార్డ్స్ ఆఫ్ ది డెక్కన్: సదరన్ ఇండియా ఫ్రమ్ చాళుక్యుస్ టు చోళస్' అనే బుక్ ఆధారంగా రూపొందిస్తున్నట్లు తెలుస్తోంది. కొన్ని దశాబ్దాలుగా దక్షిణ భారతదేశాన్ని పరిపాలించిన రాజవంశీయులు చాళుక్యుల పుట్టుక నుండి పరిపాలన కాలంలో జరిగిన ప్రధాన ఘట్టాలను ఈ వెబ్ సిరీస్ లో చూపించబోతున్నట్లు తెలుస్తోంది. ఇక వెబ్ సిరీస్ కోసం ఎంచుకున్న 'లార్డ్స్ ఆఫ్ ది డెక్కన్' అనే పుస్తకం 2022లో ఎక్కువగా ప్రాచుర్యం పొందుంది. అంతేకాదు ముంబై లిట్‌ఫెస్ట్‌లో బుక్ ఆఫ్ ది ఇయర్ (నాన్-ఫిక్షన్) అవార్డును కూడా గెలుచుకుంది. కాగా ప్రముఖ ఓటీటీ సంస్థ సోనీ లీవ్ తో కలిసి దగ్గుపాటి రానా ఈ వెబ్ సిరీస్ ని స్పిరిట్ మీడియా బ్యానర్ పై నిర్మించబోతున్నట్లు సమాచారం.
ఫుల్ యాక్షన్ మోడ్లో ఈ వెబ్ సిరీస్ ఉండనుందట. అంతేకాకుండా సోనీ లీవ్ లోనే ఈ వెబ్ సిరీస్ స్ట్రీమింగ్ కానునట్లు తెలుస్తోంది. ఇక ఈ సిరీస్ తో పాటు దగ్గుపాటి రానా టైటిల్ రోల్ లో 'హిరణ్యకశ్యపా' అనే ప్రాజెక్టులో నటిస్తున్నారు. ఎంతో కాలంగా ఆలస్యం అవుతూ వస్తున్న ఈ ప్రాజెక్టును దగ్గుపాటి రానా త్వరలోనే సైట్స్ పైకి తీసుకెళ్లబోతున్నట్లు తెలుస్తోంది. ప్రముఖ కామిక్ స్టోరీ 'అమర్ చిత్ర కథ' స్పూర్తితో ఈ ప్రాజెక్టుని రూపొందిస్తున్నారట. టాలీవుడ్ స్టార్ డైరెక్టర్ త్రివిక్రమ్ శ్రీనివాస్ ఈ సినిమా కథను అందిస్తూ ఉండడం విశేషం. నిజానికి గతంలో దర్శకుడు గుణశేఖర్ రానాతో ఈ ప్రాజెక్టుని చేయాలి. కానీ ఇప్పుడు ఆయన స్థానంలో త్రివిక్రమ్ పేరు తెరపైకి రావడం గమనార్హం.
Also Read : నిర్మాతగా మారిన కృతి సనన్ - కాజోల్ తో కలిసి మిస్టరీ థ్రిల్లర్!