అడ్వాన్సులు వెనక్కి తిరిగిచ్చేసిన సమంత - ‘ఖుషీ’ తర్వాత సినిమాలకు బ్రేక్?


లీవుడ్ లేడీ సూపర్ స్టార్ సమంత ప్రస్తుతం తన షూటింగ్ షెడ్యూల్ ను పూర్తి చేయనుంది. ఆమె ఇప్పుడు విజయ్ దేవరకొండతో ‘ఖుషి’ సినిమా చేస్తుంది. ఈ సినిమా మరో కొన్ని రోజుల్లో షూటింగ్ ముగియనుంది. అలాగే ఆమె హిందీ వెబ్ సిరీస్ ‘సిటాడెల్’ కి కూడా పనిచేస్తుంది. ఈ సిరీస్ షూటింగ్ కూడా అతి త్వరలో పూర్తి కానుంది. ఈ షూటింగ్ లు పూర్తి కాగానే సమంత సినిమాలకు బ్రేక్ చెప్పనుందట. ఇప్పుడీ వార్త సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. సమంత సినిమాలకు మళ్లీ బ్రేక్ చెప్పనుందని తెలియడంతో ఆమె ఫ్యాన్స్ ఆందోళన వ్యక్తం చేస్తున్నారు సమంతకు ఏమైంది అంటూ సోషల్ మీడియాలో ఆరా తీస్తున్నారు (పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి). 


‘డెవిల్’ మూవీ గ్లింప్స్: సీక్రెట్ ఏజెంట్‌గా కళ్యాణ్ రామ్, గూడచారి అలాగే ఉండాలట!


గతేడాది ‘బింబిసార’ సినిమాతో బిగ్గెస్ట్ హిట్ అందుకున్నారు నందమూరి కళ్యాణ్ రామ్. ఈ సినిమా ఆయన కెరీర్ కు బిగ్ బూస్టర్ అనే చెప్పాలి. ఈ సినిమాతో కళ్యాణ్ రామ్ మళ్లీ ఫామ్ లోకి వచ్చారు. ఈ మూవీ తర్వాత ఈ ఏడాది ‘అమిగోస్’ సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చినా ఈ మూవీ అంతగా ఆకట్టుకోలేకపోయింది. తాజాగా కళ్యాణ్ రామ్ మరో భారీ ప్రాజెక్టుతో రాబోతున్నారు. జులై 5 కళ్యాణ్ రామ్ పుట్టినరోజు సందర్భంగా ఆయన కొత్త సినిమా ‘డెవిల్’ మూవీ గ్లింప్స్  వీడియోను రిలీజ్ చేశారు. ఈ మూవీకు నవీన్ అనే కొత్త దర్శకుడు పనిచేస్తున్నారు. ‘బింబిసార’ లో కళ్యాణ్ రామ్ తో జతకట్టిన సంయుక్తం మీనన్ ఈ మూవీలో కూడా హీరోయిన్ గా నటిస్తోంది. తాజాగా విడుదల చేసిన గ్లింప్స్ ఆకట్టుకుంటోంది (పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి). 


ప్రేక్షకులకు, అభిమానులకు క్షమాపణలు చెప్పిన నిఖిల్ - కారణం అదేనా?


'కార్తికేయ 2'తో పాన్ ఇండియా హీరోగా మారిన నిఖిల్ తాజాగా 'స్పై' అనే యాక్షన్ థ్రిల్లర్ తో ప్రేక్షకుల ముందుకు వచ్చిన విషయం తెలిసిందే. జూన్ 29న ప్రపంచవ్యాప్తంగా విడుదలైన ఈ సినిమా ప్రేక్షకుల నుంచి మిశ్రమ స్పందన అందుకుంది. అయితే సినిమా టాక్ గురించి పక్కన పెడితే ఈ సినిమాకి భారీ ఓపెనింగ్స్ దక్కాయి. విడుదలైన మొదటి రోజే సుమారు రూ.11 కోట్ల గ్రాస్ వచ్చినట్లు మూవీ టీం అధికారికంగా తెలియజేసింది. దాంతో హీరో నిఖిల్ కెరియర్ లోనే బిగ్గెస్ట్ ఓపెనింగ్స్ అందుకున్న చిత్రంగా 'స్పై' నిలిచింది.  రెండవ రోజు నుంచి ఈ సినిమా డీలా పడుతూ వచ్చింది. ముఖ్యంగా సినిమా కథనం ప్రేక్షకులను ఆకట్టుకోలేకపోయింది. అంతేకాకుండా దేశవ్యాప్తంగా 'స్పై' అన్ని భాషల్లో రిలీజ్ కాకపోవడం గురించి కూడా ప్రస్తావిస్తూ.. అందుకు తాను చింతిస్తున్నానని, ఇకపై అలా జరగకుండా ఉండేలా చూసుకుంటానని వెల్లడించారు (పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి).


గుడిలో విజయ్ దేవరకొండ, సమంత - 'ఖుషి' కోసం యాగం, వైరల్ వీడియో


ఇప్పుడు విజయ్ దేవరకొండ (Vijay Devarakonda), సమంత (Samantha) ఎక్కడ ఉన్నారో తెలుసా? ఏపీలోని ద్రాక్షారామంలో! ఏం చేస్తున్నారో తెలుసా? పంచారామ క్షేత్రాలలో ఒకటైన ద్రాక్షారామం శివాలయంలో జరుగుతున్న యాగంలో పాల్గొన్నారు. ఎందుకో తెలుసా? 'ఖుషి' సినిమా కోసమే (పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి)!


మహేష్ బాబు మీద భారీ యాక్షన్ సీన్ - బీహెచ్ఈఎల్‌లో...


సూపర్ స్టార్ మహేష్ బాబు ఘట్టమనేని (Mahesh Babu) కథానాయకుడిగా మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ (Trivikram) దర్శకత్వంలో తెరకెక్కుతోన్న తాజా చిత్రం 'గుంటూరు కారం' (Guntur Kaaram Movie). ప్రస్తుతం సినిమా షూటింగ్ స్టేటస్ ఏమిటి? ఏం జరుగుతోంది? ఏమిటి? అంటే... (పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి)