బాలకృష్ణ అభిమాని... కలకత్తా వెళ్లి మరీ అర్జెంటీనా గోల్ కీపర్ మార్టినెజ్‌తో ఫోటో


ఇండియాలో ఎంటర్‌టైన్‌మెంట్ అంటే ముందుగా గుర్తుకు వచ్చేవి రెండు అంటే రెండు మాత్రమే! ఒకటి... సినిమా! రెండోది... క్రికెట్! అందులోనూ తెలుగు ప్రజలకు సినిమాలు అంటే ఎక్కువ అభిమానం ఉంటుంది. సినిమాలతో పాటు కార్తికేయ పాడి (karthikeya Padi) అనే యువకుడికి ఫుట్ బాల్ అంటే ఇష్టం. తన అభిమాన ఫుట్ బాల్ క్రీడాకారుడు కలకత్తా వచ్చాడని తెలుసుకుని, అతడిని కలవడం కోసం వెళ్ళాడు. (పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి)


'ఓ మై గాడ్ 2' పై నమ్మకం ఉంచండి.. శివుని పాత్రలో మెస్మరైజ్ చేస్తోన్న అక్షయ్ కుమార్


అక్షయ్ కుమార్ లేటెస్ట్ మూవీ 'ఓ మై గాడ్ 2' (OMG 2) ఆగస్టు 11న రిలీజ్ కానున్న నేపథ్యంలో మూవీ మేకర్స్ టీజర్‌‌ రిలీజ్ చేశారు. అక్షయ్ శివుడి అవతారం వేరే లెవల్ లో ఉంది. ఈ టీజర్ లో శివుని భక్తుడిగా నటించిన పంకజ్ త్రిపాఠి.. తన జీవితంలోని అన్ని అడ్డంకుల నుంచి విముక్తి చేయాలని ప్రార్థించడం సినిమాపై మరింత క్యూరియాసిటీని పెంచుతోంది. ఈ సందర్భంగా టీజర్ వీడియోను షేర్ చేసిన అక్షయ్ కుమార్.. "విశ్వాసం ఉంచండి.. OMG 2 టీజర్ ఇప్పుడే విడుదలైంది. ఆగస్ట్ 11న థియేటర్లలో రానుంది" అంటూ క్యాప్షన్ లో రాసుకొచ్చారు. (పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి)


మంగళవారం హైదరాబాద్‌లో దిగిన దీపికా పదుకోన్ - ఎందుకంటే?


ఇప్పుడు గ్లోబల్ ఐకాన్, ఇండియన్ హీరోయిన్ దీపికా పదుకోన్ (Deepika Padukone) హైదరాబాద్ సిటీలో ఉన్నారు. ముంబై నుంచి మంగళవారం భాగ్య నగరానికి వచ్చారు. ఆవిడ ఎందుకు వచ్చారు? ఏమిటి? (పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి)


రజనీకాంత్ కూతురు రెండో పెళ్లి? ఆ యువ హీరోతో ప్రేమాయణం?


ప్రస్తుతం సినిమా ఇండస్ట్రీలో ఎక్కడ చూసిన ఓ వార్త మాత్రం సర్వసాధారణం అయిపోయింది. సినీ పరిశ్రమకు చెందిన నటీనటులు ప్రేమించుకోవడం, పెళ్లి చేసుకోవడం, కొన్ని కారణాలు కూడా విడాకులు తీసుకోవడం.. అలా ఇటీవల కాలంలో సినీ సెలబ్రిటీలకు సంబంధించిన విడాకుల వార్తలు ఎంతలా వైరల్ అవుతున్నాయో అందరికీ తెలిసిందే. ఇక ఈ క్రమంలోనే ఇటీవల కోలీవుడ్ స్టార్ జంట ధనుష్, ఐశ్వర్య విడాకులు తీసుకున్న విషయం తెలిసిందే. 15 ఏళ్లకే పెళ్లి చేసుకుని ఇద్దరు పిల్లలు పుట్టాక ఈ జంట ఎవరు ఊహించిన విధంగా షాకింగ్ డెసిషన్ తీసుకొని విడిపోయారు. ఇలాంటి తరుణంలో సూపర్ స్టార్ రజనీకాంత్ కూతురు ఐశ్వర్య ఇప్పుడు రెండో పెళ్లికి సిద్ధమవుతుందని సమాచారం అందుతోంది (పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి).


'గుంటూరు కారం' మ్యూజిక్‌పై మహేష్ అసంతృప్తి - ఎట్టకేలకు స్పందించిన థమన్!


సూపర్ స్టార్ మహేష్ బాబు హీరోగా మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ దర్శకత్వంలో 'గుంటూరు కారం' అనే సినిమా తెరకెక్కుతున్న విషయం తెలిసిందే. గత కొన్ని రోజులుగా ఈ సినిమాపై రకరకాల పుకార్లు షికార్లు చేస్తున్నాయి. ముఖ్యంగా ఈ సినిమా నుంచి మ్యూజిక్ డైరెక్టర్ తమన్ ని తీసేసారనే వార్త ఆ మధ్య గట్టిగా వినిపించింది. అయితే తమన్ దాని గురించి సోషల్ మీడియాలో ఓ పోస్టు ద్వారా సెటైర్ వేస్తూ పరోక్షంగా రియాక్ట్ అయ్యారు. 'బ్రో' సినిమా ప్రమోషన్స్ లో భాగంగా 'గుంటూరు కారం' సినిమా గురించి మాట్లాడారు. ‘‘ప్రస్తుతం సినిమాకు సంబంధించిన పనులు చాలా వేగవంతంగా జరుగుతున్నాయి. పాటలు కూడా చాలా బాగా వస్తున్నాయి. కచ్చితంగా రేపు థియేటర్స్ లో ఈ ఆల్బమ్ ని ఫ్యాన్స్ ఎంతో ఎంజాయ్ చేస్తారనే నమ్మకం నాకుంది" అంటూ తాజాగా హైదరాబాదులో ఏర్పాటు చేసిన మీడియా ఇంటరాక్షన్ లో భాగంగా చెప్పుకొచ్చారు తమన్ (పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి).


ముఖ్యమైన, మరిన్ని ఆసక్తికర కథనాల కోసం ‘టెలిగ్రామ్’లో ‘ఏబీపీ దేశం’లో జాయిన్ అవ్వండి.
Join Us on Telegram: https://t.me/abpdesamofficial