ప్రస్తుతం సినిమా ఇండస్ట్రీలో ఎక్కడ చూసిన ఓ వార్త మాత్రం సర్వసాధారణం అయిపోయింది. సినీ పరిశ్రమకు చెందిన నటీనటులు ప్రేమించుకోవడం, పెళ్లి చేసుకోవడం, కొన్ని కారణాలు కూడా విడాకులు తీసుకోవడం.. అలా ఇటీవల కాలంలో సినీ సెలబ్రిటీలకు సంబంధించిన విడాకుల వార్తలు ఎంతలా వైరల్ అవుతున్నాయో అందరికీ తెలిసిందే. ఇక ఈ క్రమంలోనే ఇటీవల కోలీవుడ్ స్టార్ జంట ధనుష్, ఐశ్వర్య విడాకులు తీసుకున్న విషయం తెలిసిందే. 15 ఏళ్లకే పెళ్లి చేసుకుని ఇద్దరు పిల్లలు పుట్టాక ఈ జంట ఎవరు ఊహించిన విధంగా షాకింగ్ డెసిషన్ తీసుకొని విడిపోయారు. ఇలాంటి తరుణంలో సూపర్ స్టార్ రజనీకాంత్ కూతురు ఐశ్వర్య ఇప్పుడు రెండో పెళ్లికి సిద్ధమవుతుందని సమాచారం అందుతోంది.
ఇక ధనుష్ భార్య ఐశ్వర్యను అందరూ రజనీకాంత్ కూతురుగానే గుర్తిస్తారు. ఇక రజనీకాంత్ అల్లుడు ధనుష్ ప్రస్తుతం స్టార్ హీరోగా దూసుకెళ్తూ వరుస సినిమాలు చేస్తున్నారు. కాగా ప్రస్తుతం ధనుష్ భార్య ఐశ్వర్య కు సంబంధించిన ఓ వార్త సోషల్ మీడియా అంతటా వైరల్ అవుతుంది. తాజాగా ఐశ్వర్య రెండో పెళ్లికి రెడీ అవుతుందని, కోలీవుడ్ యంగ్ హీరోతో ఐశ్వర్య ప్రేమలో ఉందని, అతన్నే ఇప్పుడు రెండో పెళ్లి చేసుకోబోతున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి. దానికి తోడూ ఇటీవల చెన్నైలోని ప్రముఖ రిసార్ట్ లో యువ హీరోతో ఐశ్వర్య కనిపించిందంటూ కోలీవుడ్లో తెగ ప్రచారం జరుగుతోంది. అంతేకాదు ప్రస్తుతం ఐశ్వర్య రెండో పెళ్లికి సంబంధించి చర్చలు కూడా జరుగుతున్నట్లు కోలీవుడ్ మీడియా వర్గాలు అంటున్నాయి.
ఇక ఐశ్వర్య రెండో పెళ్లి చేసుకోబోతుందనే వార్త ఒక్కసారిగా బయటికి రావడంతో సోషల్ మీడియాలో నెటిజన్స్ దీనిపై రకరకాలుగా స్పందిస్తున్నారు. కొందరేమో ఐశ్వర్య రెండో పెళ్లి చేసుకోవడంలో తప్పు లేదంటూ చెబుతుంటే, మరికొందరేమో ఐశ్వరకు ఇద్దరు పిల్లలు ఉన్నారని, ఆమె మళ్ళీ పెళ్లి చేసుకోవాల్సిన అవసరం ఏంటంటూ? కామెంట్స్ చేస్తున్నారు. మరి నిజంగానే ఐశ్వర్య రెండో పెళ్లి చేసుకోబోతుందా అనేది తెలియాలంటే దీనిపై పూర్తి స్పష్టత వచ్చేంతవరకు వేచి చూడాల్సిందే. కాగా 2004లో ఐశ్వర్యకు ధనుష్ తో వివాహం జరిగింది. 2022లో వారు తమ వివాహ బంధానికి స్వస్తి పలికారు. ప్రస్తుతం ఐశ్వర్య దర్శకురాలిగా 'లాల్ సలాం' అనే సినిమాని తెరకెక్కిస్తోంది. ఈ సినిమా షూటింగ్ శరవేగంగా జరుగుతుంది. ఈ సినిమాలో సూపర్ స్టార్ రజనీకాంత్ కూడా ఓ కీలక పాత్ర పోషిస్తున్నారు.
ఇక ధనుష్ విషయానికొస్తే.. భాషతో సంబంధం లేకుండా వరుస సినిమాలు చేస్తున్నారు. ఇటీవల ఈ హీరో నటించిన తెలుగు స్ట్రైట్ మూవీ 'సార్' బాక్సాఫీస్ వద్ద మంచి సక్సెస్ అందుకుంది. వెంకీ అట్లూరి దర్శకత్వంలో వచ్చిన ఈ సినిమాలో ధనుష్ జోడిగా సంయుక్త మీనన్ హీరోయిన్ గా నటించింది. ఇక 'సార్' హిట్ తో టాలీవుడ్ లో మరి కొంతమంది దర్శకులతో పనిచేస్తున్నారు ధనుష్. ప్రస్తుతం కోలీవుడ్లో 'కెప్టెన్ మిల్లర్' బాలీవుడ్లో 'తేరే ఇష్క్ మే' వంటి సినిమాలతో బిజీగా ఉన్నారు ఈ కోలీవుడ్ హీరో.
Also Read : 'గుంటూరు కారం' మ్యూజిక్‌పై మహేష్ అసంతృప్తి - ఎట్టకేలకు స్పందించిన థమన్!