ప్రముఖ టాలీవుడ్ సీనియర్ నటుడు బ్రహ్మాజీ కొడుకు సంజయ్ రావు హీరోగా నటించిన తాజా చిత్రం 'స్లమ్ డాగ్ హస్బెండ్'. పూరి జగన్నాథ్ శిష్యుడు ఏ ఆర్ దర్శకత్వం వహించిన ఈ సినిమాలో సంజయ్ సరసన ప్రణవి మానుకొండ హీరోయిన్ గా నటించింది. మైక్ మూవీస్ బ్యానర్ పై అప్పిరెడ్డి, వెంకట్ అన్నపురెడ్డి ఈ చిత్రాన్ని నిర్మించారు. ఇటీవల ఈ సినిమా నుంచి ట్రైలర్ విడుదలై మంచి రెస్పాన్స్ ని అందుకోగా.. జూలై 21న ఈ సినిమాను ప్రేక్షకుల ముందుకు తీసుకురాబోతున్నారు మేకర్స్. సినిమా విడుదల సందర్భంగా తాజాగా నిర్వహించిన ప్రెస్ మీట్ లో మూవీ టీం పాల్గొంది. ఇక ప్రెస్ మీట్ అనగానే ఈమధ్య ఎక్కడ చూసినా ఓ జర్నలిస్ట్ పేరు ఎక్కువగా వినిపిస్తోంది. హీరో, హీరోయిన్లతో పాటు దర్శక, నిర్మాతలను ఈయన తన బోల్డ్ ప్రశ్నలతో ఇరుకున పెట్టేందుకు ప్రయత్నిస్తూ ఉంటారు.


ఈ క్రమంలోనే తాజాగా 'స్లమ్‌డాగ్ హస్బెండ్' మూవీ టీం నిర్వహించిన ప్రెస్ మీట్ లో ఆ జర్నలిస్ట్ అడగబోయే ప్రశ్నలు ఏంటో ముందే చెప్పి భారీ షాకిచ్చారు బ్రహ్మాజీ. ఇక చిత్ర యూనిట్ తో ఇంట్రాక్షన్ సందర్భంగా ఓ ప్రశ్న అడగడానికి ఆ జర్నలిస్ట్ మైక్ అందుకున్నారు. అయితే ఈ క్రమంలోనే ఆయన ఏం అడుగుతారో తనకు తెలుసని బ్రహ్మాజీ చెబుతూ.. "ఆ విలేకరి ముందు హీరోని ఇలా అడుగుతాడు. ఈ సినిమాలో మీకు కుక్కతో పెళ్లయింది కదా? అలాగే శోభనం కుక్కతో జరిగింది కదా? ఎలా జరిగింది?’’ అన్నారు.  బ్రహ్మాజీ మాటలకు అక్కడున్న వారంతా షాక్ అయ్యారు. అయితే ఆన్సర్ కూడా మీరే చెప్పండి అని సురేష్ అనడంతో.. ‘‘చాలా బాగుందండి. మీరు కూడా ఒకసారి ట్రై చేయండి’’ అని చెప్తానంటూ నవ్వులు పోయించారు.


ఇదే సందర్భంగా అతను కొడుకు సంజయ్ రావు కెరియర్ గురించి మాట్లాడిన బ్రహ్మాజీ.. అతడు ఇంకా చాలా నేర్చుకోవాల్సి ఉందని అభిప్రాయపడ్డారు. అలాగే తాను ఎటువంటి సలహాలు అయితే తన కొడుకు ఇవ్వలేదని స్పష్టం చేశారు. ఈ సినిమాలో ఓ క్యారెక్టర్ చేస్తున్నాను తప్పితే తన ప్రమేయం ఏం లేదని అన్నారు. కథలు ఎంచుకోవడం, సినిమాలు సెలెక్ట్ చేసుకునే విషయంలో తన కొడుక్కి తాను ఎలాంటి సలహాలు ఇవ్వనని, తన కొడుకు మొదటి సినిమాను చిరంజీవి, మహేష్ బాబు, ఎన్టీఆర్ వంటి స్టార్స్ ముందుకొచ్చి ప్రమోట్ చేశారని, ఇకపై అంతా కష్టం మీద ఆధారపడి ఉంటుందని అన్నారు' బ్రహ్మాజీ. దీంతో సురేష్ కొండేటిని బ్రహ్మజీ ఆట పట్టించిన ఈ వీడియో ఇప్పుడు సోషల్ మీడియా అంతటా వైరల్ అవుతుంది.


కాగా ఈ ప్రెస్ మీట్ లో చిత్ర దర్శకుడు శ్రీధర్ మాట్లాడుతూ.. 'సినిమాలో ఎటువంటి అడల్ట్ కంటెంట్ ఉండదని చెప్పారు. మనుషుల కంటే జంతువులే ఎంతో విధేయంగా ఉంటాయని, గతంలో ఐశ్వరరాయ్ కూడా ఓ చెట్టుని పెళ్లి చేసుకుందని చెప్పారు. ఈ రెండు పాయింట్స్ ఆధారంగానే 'స్లమ్ డాగ్ హస్బెండ్' కథను తాను అల్లుకున్నట్లు చెప్పారు. ఇక బీమ్స్ సిసిరోలియో సంగీతం అందించిన  ఈ సినిమాలో సప్తగిరి, చమ్మక్ చంద్ర, ఫిష్ వెంకట్ తదితరులు నటించగా.. శ్రీనివాస్ జై రెడ్డి ఈ సినిమాకి సినిమాటోగ్రాఫర్ గా వ్యవహరించారు.


Also Read : ‘స్కంద’ లుక్ నుంచి 'డబుల్ ఇస్మార్ట్' స్టైల్‌లోకి మారిన రామ్ - మేకోవర్ వీడియో చూశారా?




Join Us on Telegram: https://t.me/abpdesamofficial